
బీజింగ్ : దక్షిణ చైనా సముద్రంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నీటిగర్భంలో గ్రేట్ వాల్‌ను నిర్మిస్తోంది. ఈ ప్రాంతంలో సముద్రగర్భ యుద్ధతంత్రాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు డ్రాగన్ భారీ స్కెచ్‌ను రూపొందిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ చైనా సముద్రంలో యుద్ధనౌకల నెట్‌వర్క్, సబ్‌సర్ఫేస్ సెన్సార్లను సంసిద్ధం చేస్తోంది. వివాదాస్పద ప్రాంతంలో విదేశీ నౌకల కదలికలను పసిగట్టేందుకూ వ్యూహాత్మకంగా చైనా అడుగులువేస్తోంది.
మరోవైపు ఈ ప్రాంతంలో చైనా సైన్యం చర్యలకు చెక్‌పెట్టేందుకు దక్షిణ చైనా సముద్రంలో అమెరికా పలు మిషన్స్‌ను చేపట్టింది. అమెరికాకు దీటుగా అగ్రరాజ్యానికి సవాల్ విసురతూ సైనిక పాటవాన్ని చైనా సంతరించుకోవడంతో దక్షిణ చైనా సముద్రం సాయుధ వివాదాలకు, అలజడులకు కేంద్ర బిందువు కానుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment