Great Wall
-
Souo s2000 GL: బైకులలో బాహుబలి!.. 2000 సీసీ ఇంజిన్ (ఫోటోలు)
-
‘గ్రేట్‌వాల్ మోటార్’ మొదటి బైక్.. (ఫొటోలు)
-
మన దేశంలోనే ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ఎంతమందికి తెలుసు!
గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే పొడవాటి కుడ్యమైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి అందరికీ తెలుసు. మన దేశంలోనే ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా గురించి కొద్దిమందికి మాత్రమే తెలుసు. రాజస్థాన్‌లో ఉందిది. పదిహేనో శతాబ్దంలో అప్పటి మేవార్ రాజు మహారాణా కుంభ తాను నిర్మించిన కుంభాల్‌గఢ్ కోటకు రక్షణగా ఈ పొడవాటి గోడను నిర్మించాడు. సముద్ర మట్టానికి 1,100 మీటర్ల ఎత్తున ఆరావళి కొండ ప్రాంతంలో 662 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కుంభాల్‌గఢ్ కోట చుట్టూ నిర్మించిన ఈ గోడ పొడవు 36 కిలోమీటర్లు. ఈ కోటలో గోడ పొడవునా పలు హిందూ ఆలయాలు, జైన మందిరాలు ఉన్నాయి. యూనెస్కో పదేళ్ల కిందట కుంభాల్‌గఢ్ కోటను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. (చదవండి: నిజాయితీ నిల్! అబద్ధాలు చెప్పేవాళ్లే ఎక్కువట..అందులో మగాళ్లే ఫస్ట్!) -
సముద్ర గర్భంలో డ్రాగన్ వాల్
బీజింగ్ : దక్షిణ చైనా సముద్రంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నీటిగర్భంలో గ్రేట్ వాల్‌ను నిర్మిస్తోంది. ఈ ప్రాంతంలో సముద్రగర్భ యుద్ధతంత్రాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు డ్రాగన్ భారీ స్కెచ్‌ను రూపొందిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ చైనా సముద్రంలో యుద్ధనౌకల నెట్వర్క్, సబ్‌సర్ఫేస్ సెన్సార్లను సంసిద్ధం చేస్తోంది. వివాదాస్పద ప్రాంతంలో విదేశీ నౌకల కదలికలను పసిగట్టేందుకూ వ్యూహాత్మకంగా చైనా అడుగులువేస్తోంది. మరోవైపు ఈ ప్రాంతంలో చైనా సైన్యం చర్యలకు చెక్‌పెట్టేందుకు దక్షిణ చైనా సముద్రంలో అమెరికా పలు మిషన్స్‌ను చేపట్టింది. అమెరికాకు దీటుగా అగ్రరాజ్యానికి సవాల్ విసురతూ సైనిక పాటవాన్ని చైనా సంతరించుకోవడంతో దక్షిణ చైనా సముద్రం సాయుధ వివాదాలకు, అలజడులకు కేంద్ర బిందువు కానుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
రెండు దేశాల మధ్య గోడ.. ఫోటోలివే!
వాషింగ్టన్ : అమెరికన్లకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. తనను గెలిపిస్తే మెక్సికో-అమెరికా మధ్య పెద్ద గోడకడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 8 నమునాలు ఇప్పటికే రూపకల్పన కాగా, వాటిలో ఏదో ఒకదానికి అంగీకారం చెబితే పనులు మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. దక్షిణ కాలిఫొర్నియాలోని శాండియాగో, టిజువానా (మెక్సికో) సరిహద్దుల్లో వీటిని ఏర్పాటుచేశారు. కాంక్రీట్, లోహాంతో కూడిన 9 మీటర్ల వెడల్పుతో 18 నుంచి 30 మీటర్ల ఎత్తు ఉండేలా నిర్మించారు. ఈ గోడపై భాగాన పదునైన కొక్కీలను ఏర్పాటు చేశారు. మధ్యలో ఎలక్ట్రిక్ వ్యవస్థతో కూడిన భద్రత వ్యవస్థ ఉంటుంది. ఒక్కో నమూనా తయరీకి 5 లక్షల డాలర్లను ఖర్చుచేసినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు 3,146 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇప్పటికే 1,052 కిలోమీటర్ల మేర ఒక వరుస కంచె ఉంది. మరో 82 కిలోమీటర్లు మేర రెండు, మూడు వరుసల కంచె ఏర్పాటు చేశారు. ఈ మొత్తం సరిహద్దును ట్రంప్ ఎత్తైన గోడ కట్టేసి మూసేయాలని భావిస్తున్నారు. దీంతో 18 మీటర్ల నుంచి 30 మీటర్లు ఎత్తు సరిహద్దు గోడ నిర్మించాలంటే అయ్యే ఖర్చును లెక్కలు గడుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ‘‘మెక్సికన్లు నేరస్థులు, రేపిస్టులు, డ్రగ్ డీలర్లు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 827 బిలియన్ డాలర్ల ప్యాకేజీతో కేవలం గోడ నిర్మాణంతో కాకుండా.. 10 వేల మందితో బోర్డర్ సెక్యూరిటీ పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వైట్ హౌజ్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. -
హైదరాబాద్‌కూ గ్రేట్ వాల్!
నగరం చుట్టూరా మహాకుడ్యం శత్రు దుర్భేద్యంగా నిర్మించిన కుతుబ్‌షాహీలు 25 అడుగుల ఎత్తు.. 10 కిలోమీటర్ల పొడవున భారీ గోడ 12 దర్వాజాలు 12 కిటికీలు - నిజాం రాజుల కాలంనాటికి పూర్తయిన ప్రహరీ - సూర్యోదయమైతేనే నగర ప్రవేశం - సూర్యాస్తమయానికి మార్గాలన్నీ బంద్ - వందల ఏళ్లపాటు రాజసం పంచిన కుడ్యం - మూసీ వరద, కూల్చివేతలతో చాలా వరకు ధ్వంసం - ప్రస్తుతం మిగిలింది పురానాపూల్, డబీర్‌పురా దర్వాజాలు మాత్రమే నాలుగు వందల ఏళ్ల క్రితమే సకల సదుపాయాలతో తులతూగిన భాగ్యనగరికి ఎన్నో చారిత్రక ప్రత్యేకతలు ఉన్నాయి. మూసీ (ముచ్కుందా నది) ఒడ్డున 426 ఏళ్ల కింద పద్నాలుగు వేల భవనాలతో మహానగరాన్ని నిర్మించారు. ఆ సమయంలో నగరాన్ని నిర్మించిన కులీకుతుబ్‌షా ప్రార్థన చేస్తూ.. ‘వీలైనంత త్వరగా నా రాజ్యం సుసంపన్నం కావాలి. సకల జాతుల జనంతో చెరువులో చేపల్లా నిండిపోవాలి. ప్రపంచంలో కెల్లా మహానగరమై కలికితురాయిగా మెరిసిపోవాలి..’’అని వేడుకున్నారట. పుట్టుకతో నగరమైన హైదరాబాద్.. అనతికాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెందింది. అలాంటి సమయంలో శత్రువుల దాడుల నుంచి రక్షణ కోసం నగరం చుట్టూ భారీ గోడను నిర్మించారు. దానిలో 12 దర్వాజాలు (మార్గాలు), 12 కిటికీలు (చిన్నపాటి తలుపులు) ఏర్పాటు చేశారు. చార్మినార్ కేంద్రంగా నగరం చుట్టూ సుమారు 10 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఈ గోడ ప్రత్యేకతలపై ఈ వారం ఫోకస్.. – సాక్షి, హైదరాబాద్ నాడు పన్నెండు తలుపులు.. చుట్టూరా కిటికీలు హైదరాబాద్ మహానగరం ఎన్నో అనుకూలతలకు నిలయం. సముద్ర మట్టానికి సుమారు 600 అడుగుల ఎత్తులో ఉండడంతో నెలకొన్న సమశీతోష్ణస్థితి ప్రత్యేకం. ఈ మహా నగరి.. మంత్ర నగరిని తలపించిందంటూ కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలంలో వచ్చిన విదేశీ యాత్రికులు మెచ్చుకున్న సందర్భాలు కోకొల్లలు. మహా నగరానికి, ఇక్కడి ప్రజలకు భద్రత కల్పించేందుకు చార్మినార్ చుట్టూరా సుమారు పది కిలోమీటర్ల (ఆరు మైళ్ల)పొడవుతో 25 అడుగుల ఎత్తుతో గోడను నిర్మించారు. 1684లో కుతుబ్‌షాహీల హయాంలో నిర్మాణం ప్రారంభమైన ఈ గోడ.. 1765లో అసఫ్ జాహీ నిజాం అలీఖాన్ ఆధ్వర్యంలో పూర్తయింది. నగరంలోకి వచ్చి, వెళ్లేందుకు ఈ గోడలో 12 చోట్ల ద్వారాలు ఏర్పాటు చేశారు. పురానాపూల్ దర్వాజా, పేట్లబురుజు (చంపా దర్వాజా), మోతిగల్లీ (దిల్లీ దర్వాజా), చాదర్‌ఘాట్, డబీర్‌పురా, యాకుత్‌పురా, కట్టామీర్జుమ్లా (తలాబ్‌కట్ట), గౌలిపురా, లాల్‌దర్వాజా, ఆలియాబాద్, ఫతే దర్వాజా (శాలిబండ సమీపంలో), దూద్‌బౌలి దర్వాజాలతో పాటు మరో పన్నెండు కిటికీలు నిర్మించారు. ఆ సమయంలోనే.. హైదరాబాద్ మహానగరం లోపలికి వెళ్లాలన్నా.. బయటికి వెళ్లాలన్నా సూర్యోదయం, సూర్యాస్తమయాల మధ్యే జరగాలి. ఈ రెండు పూటలా గేట్లు తెరుచుకునే/మూసేసే సమయంలో అందరినీ అప్రమత్తం చేసేందుకు భారీ నగరాలు మోగించేవారు. ఇందుకు ప్రత్యేక యంత్రాంగం పనిచేసేది. ఇక పన్నెండు దర్వాజాల్లో అత్యధికం 1908 సెప్టెంబర్ వరదల్లో ధ్వంసమవగా.. మరికొన్నింటిని రాకపోకలకు అడ్డంకిగా మారాయంటూ 1954లో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు తొలగించింది. ప్రస్తుతం పురానాపూల్, డబీర్‌పురా దర్వాజాలు మాత్రమే మిగిలాయి. అయితే నగర చరిత్ర ఇప్పటికే ధ్వంసమైందని... ఏ దర్వాజా, కిటికీ ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఇంటాక్ కన్వీనర్ అనురాధారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం చుట్టారా ధ్వంసమైన చరిత్రను ముందుతరాలకు అందించేందుకు ప్రత్యేక కృషి మొదలుపెట్టామని తెలిపారు. దర్వాజాల మధ్య 12 కిటికీలు నగరం చుట్టూ దర్వాజాల మధ్య 12 కిటికీలను నిర్మించారు. అయితే ఇవి మామూలు కిటికీలు కావు.. పెద్ద ద్వారాల్లా కాకుండా చిన్న తలుపుల మాదిరిగా ఉండేవి. ఎందుకంటే ఆ రోజుల్లో శ్మశానాలన్నీ నగరం బయట ఉండేవి. ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు జరపడానికి దర్వాజా ద్వారా తీసుకెళ్లడాన్ని అపశకునంగా భావించేవారు. ఇక రాజ కుటుంబం, ఉన్నతాధికారులు వెళ్లే దర్వాజాల ద్వారా అంత్యక్రియల ఊరేగింపులకు అనుమతి ఉండేదికాదు. దాంతో కిటికీలను ఏర్పాటు చేసి.. వాటిని దీనికి వినియోగించారు. అందువల్లే కిటికీలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఇప్పటికీ çశ్మశానాలు ఉన్నాయి. ఇక అత్యవసర సమయాల్లోనూ రాకపోకలకు కిటికీలను ఉపయోగించుకునేవారు. ఎక్కడెక్కడ ఉన్నాయి..? చంపా దర్వాజా–ఢిల్లీ దర్వాజా మధ్యలో చార్మహల్ కిటికీ; ఢిల్లీ దర్వాజా–చాదర్‌ఘాట్ మధ్య హత్తి కిటికీ; చాదర్‌ఘాట్–డబీర్‌పురా మధ్య బొదే అలీషా కిటికీ; డబీర్‌పుర–యాకుత్‌పురా దర్వాజాల మధ్య మాతా కిటికీ; యాకుత్‌పుర–కట్టమీర్‌జుమ్లా మధ్య రంగేలీషా కిటికీ; కట్టమీర్‌జుమ్లా–గౌలిపుర మధ్య కమాన్దాన్ కిటిæకీ; ఆలియాబాద్–ఫతే దర్వాజా మధ్య గాజిబండ కిటికీ, ఫతే దర్వాజా–పురానాపూల్ మధ్య బొహోరోకి కిటికీలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు గొల్ల కిటిæకీ, మంగళ కిటికీ, కిటికీ బవహీర్, కిటిæకీ కార్వాన్లను నిర్మించారు. నేడు ఏదారి.. ఎవరిది? హైదరాబాద్ నగరం చుట్టూ ఏర్పాటు చేసిన దర్వాజాలకు ప్రత్యేకత ఉండేది. సాధారణ ప్రజలు, అధికారులు, సైనికులు ఇలా ఎవరెవరు ఏయే దర్వాజాల నుంచి ఎవరు రాకపోకలు సాగించాలన్న నిబంధనలు ఉండేవి. 1. పురానాపూల్ దర్వాజా నగరానికి ప్రధాన ద్వారంగా పరిగణించే పురానాపూల్ దర్వాజా నుంచి సాధారణ జనానికి అనుమతి ఉండేది. మూసీపై నిర్మించిన పురానాపూల్ వంతెన ద్వారా వచ్చేవారు ఈ దర్వాజా నుంచే నగరంలోకి ప్రవేశించేందుకు అనుకూలంగా ఉండేది. 2. చంపా దర్వాజా పురానాపూల్–దిల్లీ దర్వాజాల మధ్యలో ప్రస్తుతం పేట్లబురుజు ప్రాంతంలో ఉండేది. దీని ద్వారా కళాకారులు, పండితులు వెళ్లేవారు. 3. దిల్లీ దర్వాజా నయాపూల్ సమీపంలో ఉండే ఈ దర్వాజా ద్వారా దిల్లీ రాజ్యం నుంచి వచ్చేవారికి, ఇక్కడి నుంచి దిల్లీ వెళ్లేవారికి, మంత్రులు, రాజవంశీకులు, రాయబారులకు అనుమతి ఉండేది. 4. చాదర్‌ఘాట్ దర్వాజా హైదరాబాద్ సంస్థానం మొత్తంలో పండించే పంటలు,« ధాన్యం ఇతర వస్తువులను ఈ దర్వాజా ద్వారా తీసుకొని వచ్చేవారు. 5.డబీర్‌పురా దర్వాజా దీని ద్వారా మిలటరీ, పోలీసు ఉన్నతాధికారులే వచ్చేవారు. ఇది పురానీ హవేలీకి దగ్గరగా ఉండేది. 6.యాకుత్‌పురా దర్వాజా నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం నగరంలోకి వచ్చే వారి కోసం, విదేశీయులు, యాత్రికుల కోసం వినియోగించేవారు. 7. కట్ట మీర్‌జుమ్లా దర్వాజా ఈ దర్వాజా తలాబ్ అంటే చెరువుకు నీటి కోసం వెళ్లే వారి కోసం ఉండేది. పురానా హవేలీలోని నిజాం నివాసానికి, ఉన్నతాధికారుల నివాసాలకు ఈ దర్వాజా ద్వారా ఏనుగులపై నీళ్లు తీసుకొని వచ్చే వారు. 8. గౌలిపురా దర్వాజా దీని ద్వారా పశువులను నగరం బయటికి మేత కోసం తీసుకెళ్లి, తీసుకొచ్చే వారు. ఈ ప్రదేశంలో ఇప్పటికీ ఎక్కువగా యాదవులు ఉండడం గమనార్హం. 9. లాల్ దర్వాజా హిందువుల పండుగలు, ఊరేగింపులు, ఇతర వేడుకలు, రథాల ఊరేగింపులు దీని ద్వారానే జరిగేవి. అందువల్లే ఈ దర్వాజా సమీపంలో దేవాలయాలు ఉన్నాయి. 10. ఆలియాబాద్ దర్వాజా జిల్లాల నుంచి వచ్చే వారి కోసం ఉండేది. నగరంలో ఏర్పాటు చేసే సంతలకు వచ్చి సరుకులు విక్రయించుకునేవారు, ప్రజలు దీనిని వినియోగించేవారు. 11. ఫతే దర్వాజా ఇది గోల్కొండ కోట నుంచి వచ్చే వారి కోసం ఉండేది. దీనిద్వారా రాజ కుటుంబీకులు, సుబేదారులు, సైనికులు రాకపోకలు సాగించేవారు. 12. దూద్‌బౌలి దర్వాజా ఈ దర్వాజా చుట్టుపక్కల పెద్ద సంఖ్యలు గుళ్లు, దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో పూజలు చేసే అర్చకులు, పురోహితులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వేద పండితులు ఈ మార్గాన్ని వినియోగించేవారు. -
గ్రేట్‌వాల్ ఆఫ్ ఇండియా!
గ్రేట్‌వాల్ అనగానే గుర్తొచ్చేది చైనానే.. అయితే మన దేశంలో కూడా పురాతనమైన ఓ గ్రేట్‌వాల్ ఉందనే విషయం తెలుసా? మధ్య ప్రదేశ్ నడిబొడ్డున ఉన్న ఈ అద్భుతమైన కట్టడం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది దాదాపు 80 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉందని పురావస్తు అధికారులు చెబుతున్నారు. ఈ గోడ భారత్‌లో మొదటి, ప్రపంచంలోనే రెండో అతి పొడవైన కట్టడమని పేర్కొంటున్నారు. అక్కడి స్థానికులు దీన్ని ‘దివాల్’ అని పిలుచుకుంటారు. భోపాల్, జబల్పూర్ మధ్య.. గోరఖ్‌పూర్–దియోరీ నుంచి రాయ్ సేన్ జిల్లాలోని ఛోకీగఢ్ వరకు ఈ గోడ విస్త రించి ఉంది. వింధ్యా లోయలు, దట్టమైన అడవులు, పొలాలను దాటుకుంటూ వెళ్లి ఓ డ్యాం వద్ద ఆగిపోతుంది. ఇది కొన్ని చోట్ల చాలా ఎత్తులో.. మరి కొన్ని చోట్ల చాలా తక్కువ ఎత్తులో ఉంది.. అక్కడక్కడ పాత దేవాలయాల శిథిలాలు, విగ్రహాల భాగా లతో ఈ గోడ నిర్మించి ఉంది. చాలా చోట్ల శిథిలమై ఉన్న ఈ గోడపై ఫార్మసిస్ట్ అయిన రాజీవ్ చౌబే, ఆర్కియాలజిస్ట్ నారాయణ్ వ్యాస్, వినోద్ తివారీ కలసి పరిశోధనలు చేస్తున్నారు. నీటి కొలనులు, సైనికులు పరిసరాలను పరిశీలించేందుకు ఎత్తైన నిర్మాణాలు, మనుషులు దాక్కునేందుకు గూళ్లు, డ్రైనేజీలు ఇలా ఎన్నో రకాల నిర్మాణాలు ఈ గోడ పొడవునా ఉన్నాయి. ఈ కట్టడం దాదాపు 10 లేదా 11వ శతాబ్దానికి చెందినదై ఉండొచ్చని వ్యాస్ పేర్కొంటున్నారు. పరమార పాలకుల రాజధాని ఇప్పటి జబల్పూర్ దగ్గర ఉండేదని, ఈ నేపథ్యంలో శత్రువుల నుంచి రక్షణ కోసం ఈ కట్టడాన్ని నిర్మించి ఉండొచ్చని చెప్పారు. అయితే ఈ గోడ కోసం వాడిన రాళ్లు 17వ శతాబ్దానికి చెందినవని రహమాన్ అలీ అనే చరిత్రకారుడు చెబుతున్నారు. -
ఒక మీటరు ప్రజాస్వామ్యం కోసం...
ఇనుపబూట్ల సంకెళ్లలో ఇసుమంతైనా స్వేచ్ఛలేని రాజ్యం అది... కమ్యూనిస్టు చైనాలో వ్యక్తి వేసే ప్రతి అడుగుకు ప్రతిబంధకాలే... ‘గ్రేట్‌వాల్’ వెనుక సమాధి అవుతున్న ప్రజాస్వామాన్ని నిద్రలేపేందుకు ఓ కళాకారుడు సాహసమే చేశాడు.. 47 ఏళ్ల యున్‌చాంగ్.. చైనాకు చెందిన సినీ ఆర్టిస్ట్.. స్టేజ్ ప్రదర్శనలిస్తూ పేరు తెచ్చుకున్నాడు... అయితే చైనాలో వ్యక్తులపై విధించే ఆంక్షలు అతడికి భావప్రకటన స్వేచ్ఛను హేళన చేస్తున్నట్లు... ప్రజాస్వామాన్ని అపహాస్యం చేస్తున్నట్లుగా కనిపించాయి. అందుకే ‘రాజ్యం’ చేస్తున్న ఈ అరాచకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పెద్ద సాహసాన్నే చేయాలని నిశ్చయించుకున్నాడు. అందులో భాగంగా తనకు తానే ఆపరేషన్ చేసుకున్నాడు... అది కూడా ఆపరేషన్ థియేటర్లో వీడియో ముందు.. ఒక డాక్టర్ పర్యవేక్షిస్తుండగా... మత్తుమందు తీసుకోకుండా.. మెడ కింది నుంచి తొడభాగం వరకు మీటరు పొడుగుతో గాటుపెట్టుకొని పక్కటెముకలను స్వయంగా తొలగించుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ ఎముకలను మెడలో వేసుకొని మణిహారంగా ధరించాడు. తన భావప్రకటన స్వేచ్ఛకోసమే ఇదంతా చేశానని చెప్పాడు. ఈ ‘శారీరక’సాహస కృత్యాన్ని చైనా స్వేచ్ఛాపిపాసి ఒకరు ‘వన్ మీటర్ డెమోక్రసీ’( ఒక మీటరు ప్రజాస్వామ్యం)గా అభివర్ణించాడు. ఈ ఆపరేషన్ కంటే ముందు యున్‌చాంగ్ సాహసంపై ప్రజల అభిప్రాయాలను కోరితే 12 మంది అతడు విజయం సాధిస్తాడని అనుకూలంగా ఓటేస్తే... 10 మంది ఓడిపోతారంటూ హేళన చేశారు. తన సాహస కృత్యం ‘చైనాకు, చైనీయులకు మధ్య జరుగుతున్న భావసంఘర్షణకు’ ప్రతిబింబం లాంటిదని యుంగ్చాన్ అభివర్ణించాడు. ‘చైనా సమాజం చాలా సంక్షిష్టమైనదని భావిస్తున్నా... మన శరీరాన్ని, తెలివిని మనకు నచ్చినట్లు ఉపయోగించుకోవడానికి ఇక్కడ (చైనా) వాస్తవాన్ని ఎదుర్కోవాలి’అని పేర్కొన్నాడు. -
కరెన్సీ వాల్ ఆఫ్ చైనా
బీజింగ్: చైనా అనగానే ప్రపంచ వింతల్లో ఒకటైన ‘గ్రేట్‌వాల్’ గుర్తొస్తుంది. అదే చైనా ఇప్పుడు మరో ‘గ్రేట్‌వాల్’తో వార్తల్లోకొచ్చింది. సిచువాన్ రాష్ట్రంలోని లియాన్షన్ మున్సిపాలిటీకి చెందిన జియాన్షె గ్రామంలో పూర్తిగా కరెన్సీ నోట్ల కట్టలతో 2 మీటర్ల ఎత్తై గోడను నిర్మించారు. నిర్మాణానికి ఉపయోగించిన కరెన్సీ విలువ దాదాపు రూ. 13 కోట్లు. దొంగల భయానికి రాత్రంతా కొందరు గ్రామస్తులు ఆ నోట్లగోడపైనే ఉండి కాపలా కాశారట. విషయమేంటంటే.. ఆ గ్రామంలోని 340 కుటుంబాలకు స్థానిక సహకార సంస్థలో పెట్టుబడులు ఉన్నాయి. 2010లో ప్రారంభమైన ఆ సంస్థ చైనా నూతన సంవత్సరం ముందు ఏటా ఆ గ్రామస్తులకు బోనస్ ఇస్తుంది. ఈ సారి ఆ సంస్థకు ఊహించని స్థాయిలో లాభాలు రావడంతో బోనస్ కూడా భారీగానే వచ్చింది. దాంతో కాస్త డిఫరెంట్‌గా ఉంటుందని దాన్ని పంచడానికి ముందురోజు ఇలా ఆ డబ్బుతో గోడ కట్టారట. పందుల పెంపకం, చెర్రీ తోటలతో పాటు సిచువాన్‌లో ఉన్న నాలుగు చిన్నస్థాయి జల విద్యుత్కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ సహకార సంస్థ లాభాలనార్జిస్తుంది. ఆ సంస్థలో భాగస్వాములు కావడం మాత్రం అంత తేలిక కాదు. ఆ గ్రామ పౌరులకు మాత్రమే అందులో షేర్లు కొనే అర్హత ఉంటుంది.