గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ ఇండియా! | Great Wall of India | Sakshi
Sakshi News home page

గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ ఇండియా!

Published Mon, Jan 16 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ ఇండియా!

గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ ఇండియా!

గ్రేట్‌వాల్‌ అనగానే గుర్తొచ్చేది చైనానే.. అయితే మన దేశంలో కూడా పురాతనమైన ఓ గ్రేట్‌వాల్‌ ఉందనే విషయం తెలుసా? మధ్య ప్రదేశ్‌ నడిబొడ్డున ఉన్న ఈ అద్భుతమైన కట్టడం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది దాదాపు 80 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉందని పురావస్తు అధికారులు చెబుతున్నారు. ఈ గోడ భారత్‌లో మొదటి, ప్రపంచంలోనే రెండో అతి పొడవైన కట్టడమని పేర్కొంటున్నారు. అక్కడి స్థానికులు దీన్ని ‘దివాల్‌’ అని పిలుచుకుంటారు. భోపాల్, జబల్‌పూర్‌ మధ్య.. గోరఖ్‌పూర్‌–దియోరీ నుంచి రాయ్‌ సేన్‌ జిల్లాలోని ఛోకీగఢ్‌ వరకు ఈ గోడ విస్త రించి ఉంది.

వింధ్యా లోయలు, దట్టమైన అడవులు, పొలాలను దాటుకుంటూ వెళ్లి ఓ డ్యాం వద్ద ఆగిపోతుంది. ఇది కొన్ని చోట్ల చాలా ఎత్తులో.. మరి కొన్ని చోట్ల చాలా తక్కువ ఎత్తులో ఉంది.. అక్కడక్కడ పాత దేవాలయాల శిథిలాలు, విగ్రహాల భాగా లతో ఈ గోడ నిర్మించి ఉంది. చాలా చోట్ల శిథిలమై ఉన్న ఈ గోడపై ఫార్మసిస్ట్‌ అయిన రాజీవ్‌ చౌబే, ఆర్కియాలజిస్ట్‌ నారాయణ్‌ వ్యాస్, వినోద్‌ తివారీ కలసి పరిశోధనలు చేస్తున్నారు.

wall

నీటి కొలనులు, సైనికులు పరిసరాలను పరిశీలించేందుకు ఎత్తైన నిర్మాణాలు, మనుషులు దాక్కునేందుకు గూళ్లు, డ్రైనేజీలు ఇలా ఎన్నో రకాల నిర్మాణాలు ఈ గోడ పొడవునా ఉన్నాయి. ఈ కట్టడం దాదాపు 10 లేదా 11వ శతాబ్దానికి చెందినదై ఉండొచ్చని వ్యాస్‌ పేర్కొంటున్నారు. పరమార పాలకుల రాజధాని ఇప్పటి జబల్‌పూర్‌ దగ్గర ఉండేదని, ఈ నేపథ్యంలో శత్రువుల నుంచి రక్షణ కోసం ఈ కట్టడాన్ని నిర్మించి ఉండొచ్చని చెప్పారు. అయితే ఈ గోడ కోసం వాడిన రాళ్లు 17వ శతాబ్దానికి చెందినవని రహమాన్‌ అలీ అనే చరిత్రకారుడు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement