గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే పొడవాటి కుడ్యమైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి అందరికీ తెలుసు. మన దేశంలోనే ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా గురించి కొద్దిమందికి మాత్రమే తెలుసు. రాజస్థాన్‌లో ఉందిది. పదిహేనో శతాబ్దంలో అప్పటి మేవార్ రాజు మహారాణా కుంభ తాను నిర్మించిన కుంభాల్‌గఢ్ కోటకు రక్షణగా ఈ పొడవాటి గోడను నిర్మించాడు.
సముద్ర మట్టానికి 1,100 మీటర్ల ఎత్తున ఆరావళి కొండ ప్రాంతంలో 662 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కుంభాల్‌గఢ్ కోట చుట్టూ నిర్మించిన ఈ గోడ పొడవు 36 కిలోమీటర్లు. ఈ కోటలో గోడ పొడవునా పలు హిందూ ఆలయాలు, జైన మందిరాలు ఉన్నాయి. యూనెస్కో పదేళ్ల కిందట కుంభాల్‌గఢ్ కోటను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
(చదవండి: నిజాయితీ నిల్! అబద్ధాలు చెప్పేవాళ్లే ఎక్కువట..అందులో మగాళ్లే ఫస్ట్!)
Comments
Please login to add a commentAdd a comment