
చైనాకు చెందిన ‘గ్రేట్‌వాల్ మోటార్’(జీడబ్ల్యూఎం) కంపెనీ సోవో పేరుతో తన మొదటి మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. 4-వాల్వ్, 8-సిలిండర్, 2000సీసీ సామర్థ్యంతో దీన్ని తయారుచేస్తున్నారు. 200 హార్స్‌పవర్ కంటే ఎక్కువ శక్తిని ఇది ఉత్పత్తి చేస్తుందని కంపెనీ చెప్పింది. జీడబ్ల్యూఎం కంపెనీ 1984 నుంచి కార్లను తయారుచేస్తోంది.











