కరెన్సీ వాల్ ఆఫ్ చైనా | China farmers build wall of cash with USD 2.2 mn payout | Sakshi
Sakshi News home page

కరెన్సీ వాల్ ఆఫ్ చైనా

Published Thu, Jan 16 2014 1:34 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM

కరెన్సీ వాల్ ఆఫ్ చైనా - Sakshi

కరెన్సీ వాల్ ఆఫ్ చైనా

బీజింగ్: చైనా అనగానే ప్రపంచ వింతల్లో ఒకటైన ‘గ్రేట్‌వాల్’ గుర్తొస్తుంది. అదే చైనా ఇప్పుడు మరో ‘గ్రేట్‌వాల్’తో వార్తల్లోకొచ్చింది. సిచువాన్ రాష్ట్రంలోని లియాన్షన్ మున్సిపాలిటీకి చెందిన జియాన్షె గ్రామంలో పూర్తిగా కరెన్సీ నోట్ల కట్టలతో 2 మీటర్ల ఎత్తై గోడను నిర్మించారు. నిర్మాణానికి ఉపయోగించిన కరెన్సీ విలువ దాదాపు  రూ. 13 కోట్లు. దొంగల భయానికి రాత్రంతా కొందరు గ్రామస్తులు ఆ నోట్లగోడపైనే ఉండి కాపలా కాశారట. విషయమేంటంటే.. ఆ గ్రామంలోని 340 కుటుంబాలకు స్థానిక సహకార సంస్థలో పెట్టుబడులు ఉన్నాయి.
 
  2010లో ప్రారంభమైన ఆ సంస్థ చైనా నూతన సంవత్సరం ముందు ఏటా ఆ గ్రామస్తులకు బోనస్ ఇస్తుంది. ఈ సారి ఆ సంస్థకు ఊహించని స్థాయిలో లాభాలు రావడంతో బోనస్ కూడా భారీగానే వచ్చింది. దాంతో కాస్త డిఫరెంట్‌గా ఉంటుందని దాన్ని పంచడానికి ముందురోజు ఇలా ఆ డబ్బుతో గోడ కట్టారట. పందుల పెంపకం, చెర్రీ తోటలతో పాటు సిచువాన్‌లో ఉన్న నాలుగు చిన్నస్థాయి జల విద్యుత్‌కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ సహకార సంస్థ లాభాలనార్జిస్తుంది. ఆ సంస్థలో భాగస్వాములు కావడం మాత్రం అంత తేలిక కాదు. ఆ గ్రామ పౌరులకు మాత్రమే అందులో షేర్లు కొనే అర్హత ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement