బీజింగ్: చైనా నావికా విన్యాసాల్లో భాగంగా మొదటిసారిగా రెండు విమాన విధ్వంసక మిసైల్స్‌ని, దక్షిణ చైనా సముద్రంపైన ప్రయోగించింది. అమెరికా గూఢచార విమానాలు వివాదాస్పద భూభాగంలో తిరుగుతున్నాయని చైనా ఆరోపించింది. దక్షిణ, తూర్పు చైనా సముద్ర ప్రాంతాల్లో ఉన్న వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని, చైనా ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను బలోపేతం చేసుకుంది. దక్షిణ చైనా సముద్రంపై తమకే పూర్తి అధికారాలున్నాయని బీజింగ్ పేర్కొంటుండగా, వియత్నాం, మలేషియా, పిలిప్‌పైన్స్, బ్రూనే, తైవాన్‌లు విభేదిస్తున్నాయి. ఈ రెండు మిస్సైళ్లు 4 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలవు.
Comments
Please login to add a commentAdd a comment