Record Level Sales
-
ఏసీ కంపెనీలకు కలిసొచ్చిన వేసవి
ముంబై: వేసవిలో ఠారెత్తించిన ఎండలు ఏసీ తయారీ కంపెనీలకు కాసుల వర్షం కురిపించాయి. ఎండ తీవ్రతతో ఉక్కపోత, వేడిమి తట్టుకోలేక ప్రజలు భారీగా ఏసీలను కొనుగోలు చేశారు. ఏప్రిల్ – జూన్ క్వార్టర్లో రికార్డు స్థాయి విక్రయాలు జరగడంతో వోల్టాస్, బ్లూ స్టార్, వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా, జాన్సన్ హిటాచి, హావెల్స్ కంపెనీల ఆదాయాలు రెండింతలు పెరిగాయి. నికరలాభాలు రెండురెట్ల వృద్ధి నమోదు చేశాయి. రూం ఏసీల వార్షిక విక్రయాలు 14 మిలియన్లకు చేరొచ్చని కన్జూమర్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్స్ మానుఫ్యాక్చరర్స్(సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ సునీల్ వచానీ తెలిపారు. → టాటా గ్రూప్ వోల్టాస్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 10 లక్షల ఏసీలను విక్రయించింది. మొత్తం ఆదాయం రూ.5 వేల కోట్లు సాధించింది. ఇదే క్యూ1లో నికరలాభం రెండు రెట్లు పెరిగి రూ.335 కోట్లుగా, నిర్వహణ ఆదాయం 46% ఎగసి రూ.4,921 కోట్లుగా నమోదైంది. మొత్తం ఏసీ మార్కెట్లో ఈ సంస్థ 21.2 శాతం వాటాతో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. → తొలి క్వార్టర్లో బ్లూ స్టార్ నికర లాభం రెండురెట్లు పెరిగి రూ.168.76 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. నిర్వహణ ఆదాయం 28.72 శాతం ఎగసి రూ.2,865 కోట్లుగా నమోదైంది. దేశవాప్తంగా ఎండల తీవ్రత నేపథ్యంలో ఏసీల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత ఏడాదితో పోలి్చతే ఈ వేసవిలో ఏసీల అమ్మకాలు రెట్టింపు అయ్యాయని బ్లూ స్టార్ అధికారి ఒకరు తెలిపారు. → వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా నికరలాభం 89.4 శాతం పెరిగి రూ.145.3 కోట్లకు చేరింది. నిర్వహణ అదాయం 22.5% ఎగసి రూ.2,496.9 కోట్లకు చేరింది. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజరేటర్లకు డిమాండ్ భారీగా పెరగడంతో పరిశ్రమతో పోలిస్తే తమ కంపెనీ ఆదాయ వృద్ధి అధికంగా ఉందని కంపెనీ తెలిపింది. → లాయిడ్స్ బ్రాండ్ ఏసీ విక్రయాల ద్వారా రూ.67.39 కోట్ల నికరలాభాన్ని ఆర్జించినట్లు హావెల్స్ ప్రకటించింది. ఈ క్యూ1లో లాయిడ్ బ్రాండ్ విక్రయాలు రూ. 1,929 కోట్లకు చేరా యి. కంపెనీ మొత్తం ఆదాయంలో ఏసీల విక్రయ వ్యాపారం ద్వారా అధిక భాగం సమకూరిందని త్రైమాసిక ఫలితాల సందర్భంగా హావెల్స్ యాజమాన్యం చెప్పుకొచి్చంది. → హిటాచి బ్రాండ్లతో గృహ వినియోగ ఏసీల విక్రయించే జాన్సన్ కంట్రోల్స్ జూన్ క్వార్టర్ ఆదాయం 76% పెరిగి రూ.982 కోట్లకు చేరింది. వాణిజ్య విభాగంలోనూ చెప్పుకొదగిన అమ్మకాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది. -
48 గంటల్లో 9.5 కోట్ల మంది విజిటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత సీజన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన తొలి 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో 9.5 కోట్ల మంది పైచిలుకు కస్టమర్లు తమ పోర్టల్‌ను సందర్శించినట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డైరెక్టర్ (స్మార్ట్ఫోన్లు, టీవీలు) రంజిత్ బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు, టీవీల విక్రయాలకు సంబంధించి తమ టాప్ 3 మార్కెట్లలో రాష్ట్రాలపరంగా తెలంగాణ, నగరాలవారీగా హైదరాబాద్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సీజన్లో తెలంగాణలో టీవీలకు రెండు రెట్లు డిమాండ్ కనిపించగా, 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు 60 శాతం పెరిగాయని రంజిత్ బాబు చెప్పారు. ఎక్కువగా ప్రీమియం స్మార్ట్ఫోన్లు, పెద్ద స్క్రీన్ టీవీలవైపు కస్టమర్లు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తమ ప్లాట్‌ఫాంపై 50,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారని గురువారమిక్కడ ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన అమెజాన్ ఎక్స్పీరియన్స్ ఎరీనా (ఏఎక్స్ఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇందులో వివిధ ఉత్పత్తులను ప్రదర్శించే జోన్లను ఏర్పాటు చేశారు. మరికొన్నాళ్లు కొనసాగే ఫెస్టివల్లో బ్యాంకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ఎక్సే్చంజ్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయ ఆఫర్లు ఇస్తున్నట్లు రంజిత్ బాబు వివరించారు. -
ఈసారి రికార్డు స్థాయిలో కార్ల విక్రయాలు
న్యూఢిల్లీ: డిమాండ్ గణనీయంగా పేరుకుపోయిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయంగా ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదు కావచ్చని టాటా మోటర్స్ ఎండీ (ప్యాసింజర్ వెహికల్స్ విభాగం) శైలేష్ చంద్ర తెలిపారు. 38 లక్షల పైచిలుకు యూనిట్లు అమ్ముడు కావచ్చని అంచనాలు ఉన్నట్లు వివరించారు. మూడో త్రైమాసికంలో కాస్త మందగించినా, నాలుగో త్రైమాసికంలో విక్రయాలు తిరిగి పుంజుకుంటాయని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 19 లక్షల విక్రయాలతో ప్యాసింజర్ వెహికల్స్ విభాగం పటిష్టమైన పనితీరు కనపర్చినట్లు తెలిపారు. భారతీయ వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం 2021–22లో పీవీల అమ్మకాలు 30.69 లక్షలుగా నమోదయ్యాయి. అంతక్రితం 2018–19లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 33.77 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో సెమీ–కండక్టర్లు వంటి కీలక భాగాల సరఫరా సమస్యలతో కొన్నాళ్లుగా డెలివరీలు నెమ్మదించి, డిమాండ్ పెరిగిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు, 2023–24లో వాహన విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరం తరహాలో ఉండకపోవచ్చని చంద్ర చెప్పారు. ఇప్పటికే పేరుకుపోయిన డిమాండ్‌కు దాదాపు సరిపడేంత అమ్మకాలు జరిగాయని, ఇక నుండి కొత్తగా ఆవిష్కరించేవి మార్కెట్‌కు ఊతంగా ఉండగలవని పేర్కొన్నారు. ఉద్గార ప్రమాణాలకు సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీఎస్ 6 రెండో దశ అమల్లోకి రానుండటంతో రేట్లు పెంచాల్సి వస్తే కొన్ని సెగ్మెంట్లు.. ముఖ్యంగా ఎంట్రీ స్థాయి విభాగంపై కొంత ప్రతికూల ప్రభావం పడవచ్చని చంద్ర చెప్పారు. తమ ఎలక్ట్రికల్ వాహనాల విషయానికొస్తే.. సెప్టెంబర్ త్రైమాసికంలో అత్యధికంగా 12,000 యూనిట్లు విక్రయించినట్లు, 87 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నట్లు ఆయన వివరించారు. -
9 శాతం పెరిగిన జేఎల్ఆర్ విక్రయాలు
లండన్: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి అమ్మకాలు(4,62,678) సాధించింది. 2013 అమ్మకాలతో పోల్చితే ఇది 9 శాతం అధికమని, 2008 అమ్మకాలతో పోల్చితే ఇది రెట్టింపని జేఎల్ఆర్ సీఈఓ రాల్ప్ స్పెత్ చెప్పారు. జాగ్వార్ బ్రాండ్ అమ్మకాలు 6 శాతం వృద్ధితో 81,570 అమ్ముడయ్యాయని, ల్యాండ్ రోవర్ అమ్మకాలు 9 శాతం వృద్ధితో 3,81,108కు పెరిగాయని వివరించారు. చైనాలో అమ్మకాలు 28 శాతం, ఇంగ్లండ్‌లో 7 శాతం, ఉత్తర అమెరికాలో 2 శాతం చొప్పున వృద్ధి చెందాయని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది 5 లక్షల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ ఏడాది 12 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేనున్నామని... వీటిల్లో జాగ్వార్ ఎక్స్ఈ, ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఫోర్డ్‌లు కూడా ఉన్నట్లు చెప్పారు. 1,300 కొత్త కొలువులు... జేఎల్ఆర్ సంస్థ కొత్తగా 1,300 ఉద్యోగాలివ్వనున్నది. వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న కొత్త మోడల్ కారు కోసం ఈ కొత్త కొలువులు ఇవ్వనున్నామని రాల్ఫ్ స్పెత్ చెప్పారు. ఇంగ్లండ్‌లోని సోల్హిల్ ప్లాంట్‌లోని ఈ ఉద్యోగాల కోసం ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించామని పేర్కొన్నారు.