అహోబిలం ఏసీగా గాయత్రి | gayatri as ahobilam ac | Sakshi
Sakshi News home page

అహోబిలం ఏసీగా గాయత్రి

Published Sat, Dec 3 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

gayatri as ahobilam ac

 కర్నూలు(న్యూసిటీ): ఆళ్లగడ్డ మండలం అహోబిలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఉపకమిషనర్‌గా(ఏసీగా) బి.గాయత్రి దేవిని నియమించారు. రాయలసీమలోని కర్నూలు, వైఎస్సార్‌ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ఉపకమిషనర్‌గా గాయత్రి దేవి ఉన్నారు. అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వాణి గత నెల 23వ తేదీ నుంచి సెలవుపై వెళ్లారు. దీంతో ఎఫ్‌ఏసీ(ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌)గా గాయత్రి దేవిని నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ వై.వి.అనురాధ కర్నూలుకు ఉత్తర్వులు పంపారు. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 6 ఏ కేటగిరీ కిందకు వస్తుంది. అంతేకాక రాష్ట్రంలోని అతిపెద్ద వైష్ణవ దేవాలయాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement