ఈమధ్య కాలంలో ఏసీల వినియోగం బాగా పెరిగింది.ఇల్లు, ఆఫీస్,ప్రయాణాల్లోనూ ఏసీలో ఉండటానికే ఇష్టపడతాం.కాస్త వేడిగా అనిపిస్తే చాలు ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు. అలా ఏసీల వినియోగం ప్రస్తుతం వ్యసనంగా మారిపోయింది.
కానీ ఈ ఎయిర్ కండీషనర్ శరీరాన్ని ఎంత దారుణంగా ప్రభావితం చేస్తుందో తెలుసా? రోజులో ఎక్కుసేపు ఏసీలో ఉంటే ‘సిక్ బిల్డింగ్ సిండ్రోమ్’ వచ్చే ప్రమాదం ఉంది. ఏసీ వినియోగం మితిమీరితే శరీరంపై కలిగే దుష్ప్రభావాలు ఏంటన్నది ఈ స్టోరీలో చదివేయండి.
► ఏసీలు వేయగానే డోర్‌లు మూసేస్తాం. దీనివల్ల బయటి గాలి లోపలికి రాదు. దీంతో ఆక్సిజన్ తక్కువ అయి తలనొప్పి వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే మైగ్రేన్‌కు కూడా దారితీస్తుంది.
► ఏసీ వల్ల రక్తంలో ఆక్సిజన్ తక్కువై శరీరం త్వరగా ఆలసిపోతుంది. లోబీపీ వస్తుంది.
► ఎక్కువ సేపు ఏసీలో ఉండడం వల్ల శరీరంలో తేమ తగ్గుతుంది.దీని కారణంగా, చర్మం పగుళ్లు ఏర్పడి పొడిగా మారుతుంది.
► ఎక్కువగా ఏసీలో ఉండే వ్యక్తులు తలనొప్పి వంటి సమస్యలను తరచూ ఎదుర్కొంటారు.
► ఏసీ చల్లదనం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతాం. ఏసీలో ఉండటం వల్ల ఎక్కువ శాతం నీరు తాగాలనిపించదు. ఇది కిడ్నీ సమస్యకు కూడా దారితీయొచ్చు.
► ఆస్తమాతో బాధపడుతున్న వాళ్లు ఏసీలకు దూరంగా ఉండటమే మంచిదే.
► ఎక్కువ సేపు ఏసీలో గడిపేవారు ముక్కు, గొంతుకు సంబంధించిన శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గొంతు పొడిబారడం, రినిటిస్ వంటి సమస్యలతో ఇబ్బందిపడతారు.
► ఏసీల వల్ల మరో సమస్య ఎలుకలు సెంట్రల్ ఏసీల్లో గూడు కట్టుకుంటాయి. వ్యర్థాలను అక్కడే తింటాయి. ఫలితంగా ఏసీల్లో వాతావరణం విషపూరితం అవుతుంది. మనకు రకరకాల వ్యాధులు వస్తాయి. నెలకోసారి అయినా ఏసీలను క్లీన్ చేయాలి. అందుకే ఎక్కువ సేపు బయటి వాతావరణం పై ఆధారపడాలి. కిటికీలు, డోర్‌లు తెరిచిపెట్టాలి. సాధ్యమైనంత వరకు ఏసీలకు దూరంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment