న్యూఢిల్లీ: రవాణా ట్రక్కుల్లో డ్రైవర్ల క్యాబిన్లకు ఏసీలు అమర్చడాన్ని తప్పనిసరి చేసే ముసాయిదా నోటిఫికేషన్‌కు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. ఎన్2, ఎన్3 ట్రక్కుల క్యాబిన్లకు ఏసీలను బిగించడం తప్పనిసరి అని ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
రహదారి భద్రతలో ట్రక్ డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తున్నట్టు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ట్రక్కు డ్రైవర్లకు సౌకర్యవంతమైన పని వాతావరణం కల్పించడంతో ఈ నిర్ణయం కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఇది వారి పనితీరును సైతం మెరుగుపరుస్తుందన్నారు.
Approved the draft notification to mandate the installation of air-conditioning systems in the cabins of trucks belonging to categories N2 and N3.
— Nitin Gadkari (@nitin_gadkari) July 6, 2023
Truck drivers play a crucial role in ensuring road safety. This decision marks a significant milestone in providing comfortable…
Comments
Please login to add a commentAdd a comment