ఆటోమొబైల్ సంస్థలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు జారీ చేశారు. రానున్న రోజుల్లో ట్రక్ క్యాబిన్‌లలో డ్రైవర్ పక్కన ఎయిర్ కండీషనర్లను తప్పని సరిగా అమర్చాలని సూచించారు.
మహీంద్రా లాజిస్టిక్స్ సంస్థ భారతీయ డ్రైవర్లను గౌరవిస్తూ ‘దేశ్ ఛాలక్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతూ..43.. 47 సెల్సియస్ డిగ్రీల వేడిలో విధులు నిర్వహించే ట్రక్ డ్రైవర్ల జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే ట్రక్‌లలో ఏసీలు ఉండాలన్న నిబంధనల్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
కానీ కొంతమంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. లారీల్లో ఏసీ తప్పని సరి అయితే వాహన ధరలు అమాంతం పెరుగుతాయని అంటున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందే ట్రక్‌లలో ఏసీలను అమర్చాలన్న నిబంధనల అమలు ఫైల్‌పై సంతకం చేసి వస్తున్నా’ అని అన్నారు. ఏసీ క్యాబిన్‌లతో కూడిన ఆ ట్రక్కులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో మంత్రి ప్రస్తావించలేదు. పలు నివేదికలు మాత్రం 2025 నుండి విడుదల కానున్నట్లు చెబుతున్నాయి.
నిద్రలోకి జారుకుంటే
లారీల్లో ఏసీ క్యాబిన్లు ఉండాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా పరిశ్రమ వర్గాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఖర్చు పెరగడంతో పాటు, ఏసీ క్యాబిన్లు ఉండడం వల్ల డ్రైవర్లు నిద్రలోకి జారుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. అందుకే ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్ల నిబంధనను వ్యతిరేకిస్తున్నాయి. ఇలా ఉంటే వోల్వో, స్కానియా వంటి కంపెనీలు తాము తయారుచేసే వాహనాల్లో ఏసీ క్యాబిన్లు అందిస్తుండడం గమనార్హం.
చదవండి👉 టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!
Comments
Please login to add a commentAdd a comment