
ఇళ‍్ళల్లోని ఏసీ నుంచి వాటర్ లీక్ కావడం అప్పుడప్పుడూ అందరికీ ఎదురయ్యే సంఘటనే. అయితే మనం ప్రయాణిస్తున్న రైలు బోగీలోని ఏసీ నుంచి సడెన్‌గా వరద పారితే..ఒక్కసారిగా ఆందోళన పుట్టదూ...! సంఘమిత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఏసీ కోచ్‌లోని ఏసీ లోంచి అకస్మాత్తుగా వరదలాగా నీరు ఉబికి వచ్చింది. ఈ ఊహించని పరిణామానికి బోగిలో గందరగోళ పరిస్థతి ఏర్పడింది. ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు. ముఖ్యంగా ఆయా బెర్త్‌లలోని సీనియర్ సిటిజన్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రయాణీకుల్లో ఒకరు రికార్డు చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
संगमित्रा सुपर फ़ास्ट A1 का हाल, यात्री परेशान, pic.twitter.com/6pSzqKPjmB
— suyagya rai (@RaiSuyagya) June 29, 2019
Comments
Please login to add a commentAdd a comment