sanghamitra express
-
ధైర్యంగా రైలుకు ఎదురెళ్లాడు.. ‘సంఘమిత్ర’కు ప్రమాదాన్ని తప్పించాడు
చీరాల: ఓవ్యక్తి అప్రమత్తతతో వ్యవహరించడంతో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం ఉదయం 7:15నిమిషాల సమయంలో బహిర్భూమికి వెళుతూ పట్టాలు దాటుతున్న స్థానికుడు గద్దె హేమసుందరబాబు రైలు పట్టా విరగడాన్ని గమనించాడు. అదే సమయంలో చెన్నై వెళుతున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ వేగంగా వస్తోంది. వెంటనే రైలుకు ఎదురెళ్లి లోకో పైలెట్‌కు రైలు పట్టాలు చూపిస్తూ సైగలు చేస్తూ సంకేతాలు పంపించాడు. అప్రమత్తమైన లోకోపైలెట్ రైలు వేగం తగ్గించి రైలును నిలిపివేశాడు. అనంతరం రైలు పట్టా విరిగి ఉందని చెప్పి ఘటనా స్థలానికి తీసుకెళ్లి చూపించాడు. దీంతో విషయాన్ని రైల్వే అధికారులకు తెలియజేశారు. చీరాల, బాపట్ల నుంచి వచ్చిన రైల్వే ఇంజనీరింగ్ అధికారులు విరిగిన పట్టాకు మరమ్మతులు చేశారు. దీంతో 40 నిమిషాలు ఆలస్యంగా సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కాగా పెను ప్రమాదం నుంచి తప్పించిన హేమసుందరబాబును రైల్వే అధికారులతో సహా ప్రయాణికులు ప్రశంసించారు. ఘోర ప్రమాదాన్ని నివారించిన గద్దె హేమసుందరబాబు సాహసాన్ని అభినందిస్తూ ఎస్పీ వకుల్ జిందాల్ ఆయనను ఘనంగా సత్కరించారు. బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. -
రైల్లో ఊహించని పరిణామం.. వీడియో వైరల్
ఇళ్ళల్లోని ఏసీ నుంచి వాటర్ లీక్ కావడం అప్పుడప్పుడూ అందరికీ ఎదురయ్యే సంఘటనే. అయితే మనం ప్రయాణిస్తున్న రైలు బోగీలోని ఏసీ నుంచి సడెన్‌గా వరద పారితే..ఒక్కసారిగా ఆందోళన పుట్టదూ...! సంఘమిత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఏసీ కోచ్‌లోని ఏసీ లోంచి అకస్మాత్తుగా వరదలాగా నీరు ఉబికి వచ్చింది. ఈ ఊహించని పరిణామానికి బోగిలో గందరగోళ పరిస్థతి ఏర్పడింది. ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు. ముఖ్యంగా ఆయా బెర్త్‌లలోని సీనియర్ సిటిజన్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రయాణీకుల్లో ఒకరు రికార్డు చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. संगमित्रा सुपर फ़ास्ट A1 का हाल, यात्री परेशान, pic.twitter.com/6pSzqKPjmB — suyagya rai (@RaiSuyagya) June 29, 2019 -
‘సంఘమిత్ర’లో చోరీ అంతర్రాష్ట్ర దొంగల పనే
► క్లూస్ టీం ఆధారంగా అన్వేషిస్తున్నాం ► బందోబస్తు మరింత పెంచాం ► రైల్వే ఎస్పీ ఎస్జే జనార్దన్ కాజీపేట రూరల్ : వరంగల్-ఖమ్మం రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన చోరీ అంతర్రాష్ట్ర దొంగల పనిగా భావిస్తున్నట్లు మంగళవారం రైల్వే ఎస్పీ ఎస్‌జె.జనార్దన్ అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. బెంగళూర్ నుంచి పాట్నా వెళ్తున్న సంఘమిత్ర బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు విజయవాడ తర్వాత వరంగల్‌లో హాల్టింగ్ ఉంది. వరంగల్ రాక ముందే గుండ్రాతిమడుగు వద్ద అర్ధరాత్రి చైన్ లాగి రైలు నిలిపి ఎస్-2, ఎస్-8, ఎస్-9,ఎస్-11 బోగీల్లోకి ప్రవేశించి ఎస్-8, ఎస్-11లోని ఉన్న ఇద్దరు మహి ళ ప్రయాణికుల వద్ద రెండున్నర తులాల చెవి రింగులు, చైన్ చోరీ చేసి పారిపోయారు. సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలులో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది ఎస్కార్ట్‌గా ఉంటారు. అయితే సోమవారం ఆర్పీఎఫ్ సిబ్బంది ఎస్కార్ట్ లేరు. దీనిని ఆసరాగా చేసుకొని దుండగులు చోరీ చే సినట్లు తాము భా విస్తున్నామని ఎస్పీ వివరించారు. బిహా ర్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర నుంచి వచ్చిన దొంగల పనే అయి ఉంటుందని ప్రాథమిక సమాచారంతో దర్యాప్తు చేస్తున్నామన్నారు. క్లూస్‌టీం ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు. చోరీ జరిగినట్లు తెలియగానే రైలు వద్దకు మహబూబాబాద్ జీఆర్పీ, ఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు చేరుకున్నారని, బాధిత ప్రయాణికులను ఫిర్యాదు ఇవ్వమని కోరితే సమయం లేకపోవడంతో తాము పట్నాకు వెళ్లిన తర్వాత ఫిర్యాదు చేస్తామని అన్నారని చెప్పారు. సంఘమిత్ర ఘటనతో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో తిరిగే అన్ని రైళ్లలో, అన్ని రైల్వేస్టేషన్లలో పోలీస్ నిఘాను తీవ్రతరం చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే రైలులో ఉన్న రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. విచారణ ముమ్మరం చేశాం : జీఆర్పీ డీఎస్పీ ఎస్.శ్రీనివాసరావు మహబూబాబాద్ : సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన దోపిడీ ఘటపపై విచారణ ముమ్మరం చేసినట్లు జీఆర్పీ డీఎస్పీ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక జీఆర్పీ అవుట్‌పోస్ట్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని 5 నుంచి 10 మంది దొంగలు చోరీకి పాల్పడి ఉంటారన్నారు. ఎస్-8 మినహా మిగిలిన బోగీల్లో దొంగలు చోరీకి యత్నించినా ఆభరణాల అపహరణ జరగలేదన్నారు.చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించామని, త్వరలోనే ఆ దొంగలను పట్టుకుంటామన్నారు. సమావేశంలో జీఆర్పీ సీఐ కె.స్వామి, ఎస్సై దేవేందర్ పాల్గొన్నారు. -
సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
పాట్నా నుంచి బెంగళూరు వెళ్లే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్యాంట్రీ కారు బ్రేకుల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో అక్కడ పొగలు దట్టంగా అలముకున్నాయి. అయితే దాన్ని సిబ్బంది సకాలంలో గుర్తించడంతో పెద్దప్రమాదమే తప్పింది. వెంటనే రైలును వరంగల్ స్టేషన్లో నిలిపివేశారు. బీహార్ రాజధాని పాట్నా నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్తున్న ఈ రైలును వరంగల్ స్టేషన్లో క్షుణ్ణంగా పరిశీలించి, తగిన మరమ్మతులు చేసి ఆ తర్వాత మళ్లీ బెంగళూరుకు పంపుతారని రైల్వే వర్గాలు తెలిపాయి. సమయానికి పొగను గమనించి ఆపేయడంతో భారీ ప్రమాదమే తప్పిందని చెబుతున్నారు.