(విశాఖ ఉత్తర): విశాఖ నుంచి మహబూబ్ నగర్ బయలుదేరిన కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీలు మొరాయించాయి. దీంతో శుక్రవారం చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం సాయంత్రం 6.40 గంటలకు కాచిగూడ ఎక్స్‌ప్రెస్ విశాఖ నుంచి బయలుదేరింది. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ బోగీల్లో ప్రయాణికులు గేటు వద్ద నిల్చుని ఆపసోపాలు పడ్డారు.
రైలు ప్లాట్ ఫాం మీద పెట్టిన వెంటనే ఏసీలు ఆన్ చేయాలి.. కానీ శుక్రవారం అలా జరగలేదు. రైల్వే సిబ్బంది మాత్రం ఏసీలు ఆన్‌లోనే ఉన్నాయని, రైలు నిలిపి ఉంచినపుడు పవర్ మోటార్లు పనిచేయవన్నారు. రైలు రన్నింగ్ ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఏసీలు పనిచేస్తాయని బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment