2024 మొదటి ఆరు నెలల్లో 18 శాతం వృద్ధి
ఫీచర్లు, ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ
ఎన్‌ఐక్యూ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: పెద్ద గృహోపకరణాల మార్కెట్ ప్రస్తుత ఏడాది మొదటి ఆరు నెలల్లో (జనవరి–జూన్) విలువ పరంగా 18 శాతం వృద్ధిని చూసినట్టు ఎన్‌ఐక్యూ సంస్థ ఒక నివేదికలో తెలిపింది. గృహాల్లో ముఖ్యమైన ఉత్పత్తులకు డిమాండ్ బలంగా ఉన్నట్టు పేర్కొంది. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, డిష్‌వాషర్లు, వాషింగ్ మెషిన్లను పెద్ద గృహోపకరణాలుగా(ఎండీఏ) పేర్కొంటారు.
ఎయిర్ కండీషనర్ల (ఏసీలు) అమ్మకాలు విలువ పరంగా 30 శాతం వృద్ధి చెందగా, రిఫ్రిజిరేటర్ల విలువ 7 శాతం పెరిగింది. 2023తో పోలి్చతే ఈ వృద్ధి మూడు రెట్లు అధికమని ఎన్‌ఐకే (గతంలో జీఎఫ్‌కే) నివేదిక తెలిపింది. ఇక చిన్న గృహోపకరణాల అమ్మకాల విలువ 29 శాతం వృద్ధి చెందినట్టు వెల్లడించింది. ఇళ్లల్లో సౌకర్యాన్నిచ్చే ఉత్పత్తుల పట్ల వినియోగదారుల్లో ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది.
ఎక్కువ సదుపాయాలతో (ఫీచర్లు) కూడిన ప్రీమియం ఉత్పత్తుల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారని, ఇదే గృహోపకరణాల అమ్మకాల విలువలో చక్కని వృద్ధికి సాయపడుతున్నట్టు వివరించింది. 9కిలోలు అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్ల అమ్మకాల విలువ 30 శాతం పెరిగింది. మెరుగైన పనితీరు, వినూత్న ఫీచర్లను కస్టమర్లు చూస్తున్నట్టు తెలిపింది. ఏసీల్లోనూ ఇదే విధమైన ధోరణి ఉందంటూ.. ఇంధనాన్ని ఆదా చేసే 5 స్టార్ రేటింగ్, అధిక కూలింగ్ సామర్థ్యం కలిగిన ఏసీల విక్రయాలు 59 శాతం (విలువ పరంగా) పెరిగినట్టు ఎన్‌ఐక్యూ నివేదిక తెలిపింది. సైడ్ బై సైడ్, ఫ్రెంచ్ డోర్, 3/4 డోర్ రిఫ్రిజిరేటర్ల అమ్మకాల విలువ 11 శాతం పెరిగింది.
డిమాండ్ కొనసాగుతుంది..
ఈ తరహా గృహోపకరణాలను ఇప్పటికీ తక్కువ మందే వినియోగిస్తున్నందున.. భవిష్యత్తులో మరింత వృద్ధికి అవకాశాలున్నట్టు, ఇది పరిశ్రమ విస్తరణకు అవకాశాలు కలి్పస్తున్నట్టు ఎన్‌ఐక్యూ నివేదిక తెలిపింది. స్మారŠోట్ఫన్, మొబైల్ ఫోన్ల విభాగంలో వృద్ధి పరిమాణం పరంగా 6 శాతం నమోదు కాగా, విలువ పరంగా 12 శాతం వృద్ధి కనిపించింది. కన్జ్యూమర్ టెక్, డ్యూరబుల్స్ విభాగంలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న మార్కెట్ అని ఈ నివేదిక తెలిపింది. 2030 నాటికి భారత్‌లోని మధ్యతరగతి వాసులు, ఉన్నత వర్గీయుల కంటే మరింత మొత్తం ఖర్చు చేయనున్నట్టు అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment