Mi3
-
చైనా యాపిల్.. ఈసారి 6వేలే!!
ఎంఐ3 ఫోన్‌తో సంచలనాలు సృష్టించిన చైనా యాపిల్ కంపెనీ జియోమి మరో సంచలనం మొదలుపెట్టేసింది. ఎంఐ3 ధర దాదాపు 14వేలు కాగా, ఇప్పుడు కొత్తగా ఇదే కంపెనీ ప్రవేశపెట్టిన రెడ్ ఎంఐ1ఎస్ ధరను కేవలం 6వేలకే పెట్టింది. 40 వేల ఫోన్లు అమ్మకానికి పెడితే కేవలం 4.2 సెకన్లలోనే మొత్తం అయిపోయాయి. వాస్తవానికి చైనాలో ఈ ఫోన్ అమ్ముతున్న ధరకంటే కూడా భారతదేశంలో కాస్త చవగ్గానే వస్తోంది. ఎప్పటిలాగే ఫ్లిప్‌కార్ట్ ద్వారానే ఆన్లైన్లో మాత్రమే దీన్ని అమ్ముతున్నారు. ఎంఐ3లాగే.. ఈ ఫోన్‌కు కూడా అభిమానులు తక్కువ సమయంలోనే బాగా పెరిగిపోయారు. ఇప్పటికే రెండున్నర లక్షల మంది దీనికోసం రిజిస్టర్ చేసుకున్నారు. వచ్చే బ్యాచ్ మళ్లీ మంగళవారమే అమ్మకాలకు సిద్ధమవుతుంది. దీనికోసం ఫ్లిప్‌కార్ట్‌లో రిజిస్ట్రేషన్లు చకచకా సాగిపోతున్నాయి. ఫీచర్లు డ్యూయల్ సిమ్ కార్డులను సపోర్ట్ చేసే ఈ ఫోన్ 158 గ్రాముల బరువు ఉంటుంది. దీని ఎల్సీడీ స్క్రీన్‌లో 16మిలియన్ల రంగులుంటాయి. లౌడ్స్పీకర్లు, 3.5ఎంఎం జాక్ మామూలుగానే ఉన్నాయి. ఇంటర్నల్ మెమొరీ 8జీబీ, ర్యామ్ 1 జీబీ ఇచ్చారు. మైక్రో ఎస్డీ కార్డుతో 32 జీబీ వరకు మెమొరీని విస్తరించుకోవచ్చు. ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన ఆటోఫోకస్ కెమెరా 8మెగా పిక్సెల్స్ ఉండగా, ఫ్రంట్ కెమెరా 1.6 మెగా పిక్సెల్స్ ఉంది. సెకనుకు 30 ఫ్రేములతో వీడియో తీయగలదు. ఆండ్రాయిడ్ వెర్షన్ 4.3 జెల్లీబీన్‌తో ఫోన్ పనిచేస్తుంది. దీని సీపీయూ క్వాడ్ కోర్ 1.6 గిగా హెర్ట్జ్ ఉంది. హెచ్‌టీఎంఎల్5తో బ్రౌజింగ్ చేసుకోవచ్చు. -
ఫ్లిప్ కార్ట్ లో ఎంఐ3 మళ్లీ మ్యాజిక్!
బెంగళూరు: ఆన్ లైన్ అమ్మకాలలో సియోమి కంపెనీ రూపొందించిన ఎంఐ3 మోబైల్ సంచలనం రేపుతోంది. కేవలం ఇంటర్నెట్ లో ఫ్లిప్ కార్ట్.కామ్ లో లభ్యమయ్యే ఎంఐ3 మొబైల్ ఫోన్ ఆగస్టు 19 తేదిన నిర్వహించిన ఆన్ లైన్ అమ్మకాల్లో 20 వేల ఫోన్లు కేవలం కొద్ది సెకన్లలో అమ్ముడు పోయాయి. ఆన్ లైన్ లో ఈ మొబైల్ ఫోన్ అమ్మకానికి పెట్టడం ఇది ఐదవ సారి. జూలై 22 తేది నుంచి ఐదు దఫాలుగా కొనసాగుతున్న అమ్మకాల్లో ఇప్పటి వరకు 70 వేల ఫోన్లు అమ్మినట్టు నిర్వాహకులు వెల్లడించారు. తొలి దఫాలో 40 నిమిషాలకే స్టాక్ అమ్మకాలు పూర్తయ్యాయని, రెండవ బ్యాచ్ లో ఐదు సెకన్లు, మూడవ బ్యాచ్ లో రెండు సెకన్లలోనే అమ్మకాలు పూర్తయ్యాయిన సంగతి తెలిసిందే. ఆరవ దఫా అమ్మకాలను ఆగస్టు 26 తేదిన నిర్వహించనున్నట్టు ప్రకటించారు. వినియోగదారులు ఎంఐ3ని చేజిక్కించుకునేందుకు రిజిస్ట్రేషన్లను ఆగస్టు 19 తేది నుంచి ఆగస్టు 25 తేది వరకు కొనసాగించనున్నట్టు ఫ్లిఫ్ కార్ట్ తెలిపింది. -
ప్రకంపనలు సృష్టిస్తోన్న ఐఫోన్!
వ్యాపార పరంగా ప్రస్తుతం ప్రపంచంలో హాటెస్ట్ సెక్టార్ ఏది అంటే ఎవరైనా ఠక్కున మొబైల్ రంగమని చెబుతారు. అది వాస్తవం కూడా. ఇందుకు తాజాగా ఓ ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎంఐ3 చైనా ఐఫోన్‌గా పేరుగాంచింది. ఈ ఫోన్ చైనాలో భారీ స్థాయిలో అమ్ముడయింది. ఇప్పుడు భారత్‌లో కూడా అదే రీతిన ప్రకంపనలు సృష్టిస్తోంది. విడుదలైన 39 నిమిషాల్లో లక్ష ఫోన్లు అమ్ముడుపోయాయి. కొత్త తరహా ఫోన్లపై ప్రజలకు ముఖ్యంగా యువతకు ఎంత మోజు ఉందో ఈ సంఘటన తెలియజేస్తుంది. కాస్త కొత్తదనం కనిపిస్తే చాలు మొబైల్ ఫోన్ ప్రియులు స్మార్ట్ ఫోన్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. షియోమి ఎంఐ3 ఫోన్‌కు లభించిన స్పందనే ఇందుకు నిదర్శనం. చైనా 'యాపిల్'గా పేరు గడించిన షియోమీ సంస్థ తన ఎంఐ3 ఫోన్‌ను భారత్‌లో విక్రయించేందుకు ఇ-కామర్స్ పోర్టల్ ఫ్లిఫ్కార్టుతో ఒప్పందం చేసుకుంది. ఈమేరకు ఎంఐ3ని ఫ్లిఫ్‌కార్ట్ తన పోర్టలో విక్రయానికి పెట్టింది. జూన్ 22న ఎంఐ3 ఫోన్ అమ్మకానికి వచ్చిన 39 నిమిషాల్లోనే అందుబాటులో ఉంచిన స్టాక్ మొత్తం అయిపోయింది. లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి. జూలై 15 నుంచి జూలై 21 మధ్యకాలంలో ఈ ఫోన్ కోసం లక్షకు పైగా రిజిస్ర్టేషన్లు జరిగినట్టు ఫ్లిఫ్‌కార్ట్ తెలిపింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఫోన్‌ను విక్రయిస్తున్నట్లు ఫ్లిఫ్‌కార్ట్ చెబుతోంది. కొత్త స్టాక్ కోసం ప్రయత్నిస్తున్నామని, స్టాక్ రాగానే విక్రయిస్తామని, ముందుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచిస్తోంది. ఎంఐ3 ఫోన్‌కు ఇంత డిమాండ్ ఉండటానికి కారణం ఐఫోన్ 5ఎస్, గెలాక్సీ ఎస్5ల్లో ఉన్న ఫీచర్స్ కంటే మెరుగైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 5ఎస్‌లో 1.3 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ఏ7 ప్రాసెసర్ ఉంటే, ఎంఐ3లో 2.3 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఉంది. ఐఫోన్ 5ఎస్‌లో 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంటే, ఇందులో 13 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. ఐఫోన్లో బ్యాటరీ 1560 ఎంఏహెచ్ కాగా, ఇందులో 3050 ఎంఏహెచ్‌గా ఉంది. ఐఫోన్ 5ఎస్ 43 వేల రూపాయలు, గెలాక్సీ ఎస్5 ధర 37 వేల రూపాయలు కాగా, ఎంఐ3 ధర15 వేల రూపాయలే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ హైఎండ్ ఫోను కన్నా ఎంఐ3లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. ఇందువల్లే ఈ ఫోన్ హాట్‌కేకుగా మారింది. ఈ ఫోన్ ఆన్లైన్లో కూడా సంచలనం సృష్టించింది. ఫోన్ విడుదలకు ముందు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇస్తే 86 సెకండ్లలో లక్ష ఫోన్లను బుక్ చేసుకున్నారు. విడుదల అయిన తరువాత 39 నిమిషాలలో లక్ష ఫోన్లు అమ్ముడుపోయాయి. షియోమి కంపెనీ ప్రపంచంలోనే ఆరవ, చైనాలో మూడో అతి పెద్ద మొబైల్ ఫోన్ల కంపెనీ. 2010లో బీజింగ్ కేంద్రంగా లీ జున్ దీనిని ప్రారంభించారు. ఈ కంపెనీ వ్యాపారం అంతా ఆన్లైన్లోనే జరుగుతోంది. అందువల్ల ఈ సంస్థ మార్కెటింగ్‌కు చాలా తక్కువగా నిధులు కేటాయిస్తుంది. ఆ రకంగా ఎక్కువ ఫీచర్స్‌తో తక్కువ ధరకు ఇవ్వగలుగుతున్నట్లు యాజమాన్యం తెలిపింది. - శిసూర్య -
భారత్‌లోకి ‘చైనా యాపిల్’!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన షియోమి కంపెనీ భారత్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఆవిష్కరించింది. చైనా యాపిల్‌గా ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీ ఎంఐ3 స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కు భారత్‌లో అందిస్తోంది. వచ్చేవారం నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమవుతాయని షియోమి వెబ్సైట్ పేర్కొంది. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ల విక్రయాలు జరిగే అవకాశాలున్నాయి. 86 సెకన్లలో లక్ష ఫోన్ల విక్రయాలు ఈ కంపెనీ ఎంఐయూఐ వీ5 పేరుతో ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ను కస్టమైజ్ చేసింది. ఎంఐయూఐ వీ5 ఓఎస్‌పై పనిచేసే ఈ ఎంఐ 3 స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల ఫుల్ హెచ్డీ 1080పి ఎల్సీడీ టచ్ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 800 2.3 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్, అడ్రెనో 330 450 మెగా హెర్ట్జ్ జీపీయూ, 2 జీబీ ర్యామ్, ఈఎంఎంసీ 4.5 ఫ్లాష్ మెమరీ, 16 జీబీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3050 ఎంఏహెచ్ లిథియమ్-ఐయాన్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ కంపెనీ ఉత్పత్తులకు చైనాలో ఎంత క్రేజ్ ఉందంటే, ఆన్లైన్లో ఎంఐ 3 ఫోన్లు 86 సెకన్లలోనే లక్ష అమ్ముడు కావడం విశేషం. ఆన్లైన్లోనే అమ్మకాలు షియోమి కంపెనీ ప్రపంచంలోనే ఆరవ, చైనాలో మూడో అతి పెద్ద మొబైల్ ఫోన్ల కంపెనీ. 2010లో ఈ కంపెనీని లీ జున్ ప్రారంభించారు. బీజింగ్ కేం ద్రంగా పనిచేసే ఈ కంపెనీ అనతికాలంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం ఈ సంస్థ ఇప్పటికే 1.7 కోట్ల హ్యాండ్సెట్లను విక్రయించింది. ఎంఐ 3, రెడ్మి, ఎంఐ వై-ఫై, ఎంఐ బాక్స్ తదితర హ్యాండ్సెట్లను అందిస్తోంది. ఈ కంపెనీ ఆన్లైన్లోనే తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. రిటైల్ స్టోర్స్‌లో ఎక్కడా తన ఫోన్లను విక్రయించదు. ఇక కంపెనీ మొత్తం ఆదాయంలో 1 శాతమే మార్కెటింగ్‌కు కేటాయిస్తోంది(శామ్సంగ్ కేటాయింపు 5.1%). ఇలా ఆదా చేసిన సొమ్ములతో నాణ్యమైన విడిభాగాలను కొనుగోలు చేసి అత్యంత ఆధునిక ఫీచర్లున్న ఫోన్లను తక్కువ ధరకే అందిస్తోంది. షియోమి కంపెనీ భారత కార్యకలాపాలను జబాంగ్ సహ వ్యవస్థాపకుడు మను కుమార్ జైన్ చూస్తారు. ఈ మేరకు షియోమి కం పెనీ ఆయనతో ఒప్పందం కుదుర్చుకుంది. హువాయి, జెడ్‌టీఈ, లెనొవొ, జియోని, అప్పో వంటి ఇతర చైనా కంపెనీలు ఇప్పటికే భారత్‌లో స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్నాయి.