ఎంఐ3 ఫోన్కు అనూహ్య ఆదరణ! | unexpected popularity to MI 3 phone | Sakshi
Sakshi News home page

ఎంఐ3 ఫోన్కు అనూహ్య ఆదరణ!

Published Mon, Oct 6 2014 2:30 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఎంఐ3 ఫోన్‌ - Sakshi

ఎంఐ3 ఫోన్‌

చైనా కంపెనీ షియోమీ ఇండియాలో లాంఛ్‌ చేసిన ఎంఐ3 ఫోన్‌కు అనూహ్యమైన ఆదరణ లభించింది.

చైనా కంపెనీ షియోమీ ఇండియాలో లాంఛ్ చేసిన ఎంఐ3 ఫోన్‌కు అనూహ్యమైన ఆదరణ లభించింది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ స్టాక్‌  సెకన్లలోనే అమ్ముడైపోయింది. ఈ నేపథ్యంలో దీపావళికి మరోసారి ఎంఐ3 ఫోన్లను ఫ్లిఫ్‌కార్ట్‌లో అమ్మకానికి ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కో బ్యాచ్‌లో 10 నుంచి 20 వేల ఎంఐ3 ఫోన్లను షియోమి విక్రయించింది. ఈ కంపెనీ ఎంఐ3 ఫోన్లను ఇండియాలో విడుదల చేసిన నెల రోజుల్లో లక్షకుపైగా విక్రయించింది. మరో 2 లక్షల మందికిపైగా కస్టమర్లు ఈ ఫోన్‌కు ఫ్లిఫ్‌కార్ట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు.ప్రస్తుతం ఈ ఫోన్ల అమ్మకాలను నిలిపివేశారు. రిజిస్టేషన్ను కూడా క్లోజ్ చేశారు.

 హై-ఎండ్‌ స్మార్ట్‌ఫోన్లలో ఉన్న ఫీచర్లు ఇందులో ఉండటంతోపాటు ధర 14 వేల రూపాయలుగా మాత్రమే కావడంతో దీనికి విపరీతమైన డిమాండ్‌ వచ్చింది. ఈ ఫోన్‌లో 5 ఇంచ్ల స్క్రీన్‌, 2 జీబీ ర్యామ్‌, 13 ఎంపి బ్యాక్‌ కెమేరా, 2 ఎంపి ఫ్రంట్‌ కెమేరా, 3050 ఎంఏహెచ్  బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.

చైనా మార్కెట్లో మూడవ అతిపెద్ద మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీగా అవతరించిన జియోమీని 2010లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఆరవ స్థానంలో ఉంది. బీజింగ్ ప్రధాన కేంద్రంగా ఉన్న జియోమీ అనతికాలంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement