
షియోమిని అధిగమించిన యాపిల్
చైనా మార్కెట్ లో షియోమిని తొలిసారిగా యాపిల్ సంస్థ అధిగమించింది.
బీజింగ్: చైనా మార్కెట్ లో షియోమిని తొలిసారిగా యాపిల్ సంస్థ అధిగమించింది. ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒక్కటైన చైనాలో అత్యధిక స్మార్ట్ ఫోన్లు విక్రయించిన కంపెనీగా నిలిచింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 14.7 శాతం స్మార్ట్ ఫోన్ అమ్మకాలు సాగించి అన్నింటికంటే ముందు నిలిచింది.
షియోమి 13.7 శాతం అమ్మకాలతో రెండో స్థానంలో ఉందని అంతర్జాతీయ డేటా కార్పొరేషన్(ఐడీసీ) తెలిపింది. హువాయ్, సామ్ సంగ్, లెనోవో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టాప్-5 కంపెనీలు కలిపి జనవరి-మార్చిలో 57.8 శాతం అమ్మకాలు సాగించినట్టు వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో యాపిల్, షియోమి, హువాయ్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయని ఐడీసీ తెలిపింది.