స్మార్ట్ఫోన్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో తనదైన హవా సాగిస్తున్న చైనీస్ టెక్నాలజీ కంపెనీ షియోమి, వర్చ్యువల్ రియాల్టీ కంటెండ్ ప్రొవైడర్ జాంట్ చైనాతో జతకట్టింది.
జాంట్ చైనాతో జతకట్టిన షియోమి
Published Fri, Dec 23 2016 12:18 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
బీజింగ్ : స్మార్ట్ఫోన్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో తనదైన హవా సాగిస్తున్న చైనీస్ టెక్నాలజీ కంపెనీ షియోమి, వర్చ్యువల్ రియాల్టీ కంటెండ్ ప్రొవైడర్ జాంట్ చైనాతో జతకట్టింది. రెండు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందంతో షియోమి గత అక్టోబర్లో లాంచ్ చేసిన వీఆర్ హెడ్సెట్ల కోసం జాంట్ చైనా ఓ యాప్ను రూపొందించనుంది. మార్కెటింగ్, టెక్నాలజీ విషయంలో రెండు కంపెనీలు ఒకదానికొకటి కలిసి పనిచేస్తాయని వెల్లడించాయి. వీఆర్ వీడియో షూటింగ్, ఎడిటింగ్, డిస్ట్రిబ్యూషన్లో జాంట్ కంపెనీ ప్రస్తుతం నిమగ్నమై ఉందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
షాంఘై మీడియా గ్రూప్, చైనా మీడియా క్యాపిటల్తో కలిసి ఈ ఏడాది జాంట్ చైనాను కంపెనీ ఆవిష్కరించింది. జాంట్తో కలిసి హై క్వాలిటీ వీఆర్ వీడియోలను తాము అందిస్తామని విశ్వసిస్తున్నట్టు షియోమి తెలిపింది. షియోమితో భాగస్వామ్యం తమకు మరింత విశ్వాసాన్ని అందిస్తుందని జాంట్ చైనా కూడా పేర్కొంది. 2016లో చైనా వీఆర్ మార్కెట్ 5.55 బిలియన్ యువాన్లు. వీఆర్ స్టార్టప్లకు ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లకు నిధులు అందించడం కోసం బైడు, ఆలీబాబా, టెన్సెంట్లు ఆ స్టార్టప్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల కాలంలో మొబైల్ వీఆర్లోకి మరలడానికి ఫోన్ తయారీసంస్థల మధ్య పోటీ తీవ్రతరమైంది.
Advertisement
Advertisement