ఎంఐ మిక్స్‌ 2లాంచ్‌.. ఫీచర్స్‌ తెలిస్తే.. | Xiaomi Mi MIX 2 Comes With Sony’s 12MP Sensor From The Mi | Sakshi
Sakshi News home page

ఎంఐ మిక్స్‌ 2లాంచ్‌.. ఫీచర్స్‌ తెలిస్తే..

Published Mon, Sep 11 2017 12:55 PM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

Xiaomi Mi MIX 2 Comes With Sony’s 12MP Sensor From The Mi



సాక్షి,  బీజింగ్‌:
మొబైల్‌ దిగ్గజం షావోమి మరో రెండు ఉత్పత్తులను లాంచ్‌  చేసింది. ఎంఐ మిక్స్‌ 2 పేరుతో మరో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను,  ఎంఐ నోట్‌బుక్‌  ప్రో ను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.   ముఖ్యంగా ఎంఐమిక్స్‌కు సక్సెసర్‌గా  ఎంఐమిక్స్‌ 2ను  సోమవారం చైనా మర్కెట్లో ప్రవేశపెట్టింది.   చైనాలో  ఈ మధ్యాహ్నం జరిగిన ప్రత్యేక కార‍్యక్రమంలో    వీటిని విడుదల చేసింది.   భారీ స్క్రీన్‌, ర్యామ్‌,  స్టోరేజ్‌ కెపాసిటీ తమ ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది.
ఎంఐ మిక్స్‌ 2 ఫీచర్స్‌
5.99  ఫుల్‌  స్క్రీన్‌ డిస్‌ప్లే
6/8 జీబీ ర్యామ్‌
64/128 256/ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
16ఎంపీ రియర్‌ కెమెరా విత్‌ సోనీ  సెన్సర్‌
12ఎంపీసెల్ఫీ కెమెరా
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ


మరోవైపు ఇది ఐ ఫోన్‌ 7కి గట్టి పోటీఇవ్వనుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.   6జీబీ ర్యామ్‌ / 64జీబీ స్టోరేజ్‌  వేరియంట్ ధర  3,299(సుమారు రూ.32,335) యెన్‌లుగాను, 6జీబీ ర్యామ్‌ / 128 జీబీ స్టోరేజ్‌  వేరియంట్   3,599 (సుమారు రూ.36వేలు) యెన్‌గాను, 6జీబీ ర్యామ్‌ / 256 జీబీ స్టోరేజ్‌  3,999 (సుమారు రూ.39 వేలు) యెన్‌ గాను కంపెనీ నిర్ణయించింది. అంతేకాదు సూపర్ బ్లాక్ కలర్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ రియర్‌ కెమరా రింగ్‌ను 18 క్యారెట్ల బంగారు రింగ్‌ను అమర్చడం మరో విశేషంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement