Mi MIX 2
-
షావోమి ఆ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది
న్యూఢిల్లీ : షావోమి అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా ఎంఐ మిక్స్2 గతేడాది మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రస్తుతం షావోమి ధర తగ్గించింది. 2017 అక్టోబర్‌లో లాంచింగ్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ 35,999 రూపాయలుగా ఉంటే, తాజాగా ధర తగ్గింపు అనంతరం ఎంఐ మిక్స్2 స్మార్ట్‌ఫోన్‌ను 29,999 రూపాయలకు విక్రయానికి తీసుకొచ్చింది. ఎంఐ మిక్స్2పై ధర తగ్గింపును శాశ్వతంగా చేపడుతున్నట్టు షావోమి ధృవీకరించింది. ఎంఐ.కామ్, ఎంఐ హోమ్, అధికారిక పార్టనర్లలో తగ్గింపు ధరలు అమ్లోకి రానున్నాయని షావోమి పేర్కొంది. ఇప్పటికే ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో తగ్గింపు ధర అందుబాటులోకి వచ్చింది. జనవరిలో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ఫై 3వేల రూపాయల ధర తగ్గించి 32,999 రూపాయలకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆశ్చర్యకరంగా షావోమి ప్రత్యర్థి వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6 ను భారత్‌లో లాంచ్ చేసిన ఒక్కరోజులోనే ఈ ధర తగ్గింపును చేపట్టింది. ఎంఐ మిక్స్2 స్పెషిఫికేషన్లు... 5.99 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 12 జీబీ స్టోరేజ్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫేసియల్ రికగ్నైజేషన్ 3400 ఎంఏహెచ్ బ్యాటరీ జూన్ 7న మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను షావోమి భారత మార్కెట్లోకి లాంచ్ చేయబోతుంది. ఆ స్మార్ట్‌ఫోన్‌ను సెల్ఫీ సెట్రిక్ స్మార్ట్‌ఫోన్‌గా షావోమి అభివర్ణించింది. -
షావోమి ఎంఐ మిక్స్ 2 ధర తగ్గిందోచ్...
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి మరోసారి తన వినియోగదారులకు శుభవార్త అందించింది. తన ఫ్లాగ్ షిప్ బెజెల్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ మిక్స్2 ను డిస్కౌంట్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ తగ్గింపు తరువాత ఇపుడు ఇది రూ.32,999 ధరకు లభించనుంది. అసలు ధరతో పోలిస్తే రూ.3వేల డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. పరిమిత కాల ఆఫర్ కింద జనవరి 5వ తేదీ వరకే ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. కాగా గత అక్టోబర్ నెలలో లాంచ్ అయిన ఎంఐ మిక్స్ 2 స్మార్ట్‌ఫోన్ ధరను రూ.35,999గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎంఐ మిక్స్ 2 ఫీచర్లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 12ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ -
షావోమి అత్యంత ఖరీదైన ఫోన్ ధర తగ్గింది
న్యూఢిల్లీ : షావోమి అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా పేరు గాంచిన ఎంఐ మిక్స్2 ధర తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసినప్పుడు రూ.37,999కాగ, ప్రస్తుతం ఇది రూ.5000వేల డిస్కౌంట్‌తో ఫ్లిప్కార్ట్లోలభ్యమవుతోంది. పరిమిత కాల ఆఫర్లో భాగంగా యూజర్లు ఈ డివైజ్‌ను రూ.32,999కే విక్రయిస్తున్నారు. డిస్కౌంట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.18వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.99 కు ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ బైబ్యాక్ గ్యారెంటీని పొందవచ్చు. ఎంఐ మిక్స్2ను కొనుగోలు చేయాలనుకునే వారికి, రూ.3,667 వద్ద నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను ఆఫర్ చేస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను, యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు 5 శాతం డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. గతేడాది ఎంఐ మిక్స్ విజయవంతమవడంతో, ఈ ఏడాది ఎంఐ మిక్స్2 స్మార్ట్‌ఫోన్‌ను షావోమి విడుదల చేసింది. షావోమి తొలి బెజెల్-లెస్ స్మార్ట్‌ఫోన్ ఇదే. ఎంఐ మిక్స్2 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు.. 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.0 నోగట్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్డేట్ 2.4గిగాహెడ్జ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఎంఐ మిక్స్ 2.. తొలి ఫ్లాష్ సేల్
భారీ స్క్రీన్ సైజు, బెజెల్ లెస్ డిస్ప్లేతో చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి విడుదల చేసిన ఎంఐ మిక్స్2 స్మార్ట్‌ఫోన్ నేటి నుంచి విక్రయానికి రాబోతుంది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్ ద్వారా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి భారత్‌లో ఇది విక్రయానికి వస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ తొలి రెగ్యులర్ ఫ్లాష్ సేల్ ఇదే. బెజెల్-లెస్ డిస్ప్లే మాత్రమే కాక, మెటాలిక్-సెరమిక్ బాడీ, క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్ఓసీ దీనికి మరో ప్రధానమైన ఆకర్షణలు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ నెల ప్రారంభంలో లాంచ్ చేసింది. మంగళవారం రెగ్యులర్ ఫ్లాస్ సేల్ అనంతరం ఎంఐ హోమ్ స్టోర్, కంపెనీ ఫిజికల్ రిటైల్ పార్టనర్ల వద్ద కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని షావోమి తెలిపింది. ఈ ఫోన్ ధర భారత్‌లో 35,999 రూపాయలు. వన్‌ప్లస్ 5, నోకియా 8, ఎల్జీ జీ6లకు పోటీగా ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఎంఐ మిక్స్2 స్పెషిఫికేషన్లు... డ్యూయల్ సిమ్ ఎంఐయూఐ 9 ఆధారిత ఆండ్రాయిడ్ 7.0 నోగట్ 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్ఓసీ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఎంఐ మిక్స్ 2లాంచ్.. ఫీచర్స్ తెలిస్తే..
సాక్షి, బీజింగ్: మొబైల్ దిగ్గజం షావోమి మరో రెండు ఉత్పత్తులను లాంచ్ చేసింది. ఎంఐ మిక్స్ 2 పేరుతో మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను, ఎంఐ నోట్‌బుక్ ప్రో ను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఎంఐమిక్స్కు సక్సెసర్‌గా ఎంఐమిక్స్ 2ను సోమవారం చైనా మర్కెట్లో ప్రవేశపెట్టింది. చైనాలో ఈ మధ్యాహ్నం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీటిని విడుదల చేసింది. భారీ స్క్రీన్, ర్యామ్, స్టోరేజ్ కెపాసిటీ తమ ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది. ఎంఐ మిక్స్ 2 ఫీచర్స్ 5.99 ఫుల్ స్క్రీన్ డిస్ప్లే 6/8 జీబీ ర్యామ్ 64/128 256/ ఇంటర్నల్ స్టోరేజ్ 16ఎంపీ రియర్ కెమెరా విత్ సోనీ సెన్సర్ 12ఎంపీసెల్ఫీ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ మరోవైపు ఇది ఐ ఫోన్ 7కి గట్టి పోటీఇవ్వనుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. 6జీబీ ర్యామ్ / 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,299(సుమారు రూ.32,335) యెన్లుగాను, 6జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 3,599 (సుమారు రూ.36వేలు) యెన్‌గాను, 6జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ 3,999 (సుమారు రూ.39 వేలు) యెన్ గాను కంపెనీ నిర్ణయించింది. అంతేకాదు సూపర్ బ్లాక్ కలర్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమరా రింగ్‌ను 18 క్యారెట్ల బంగారు రింగ్‌ను అమర్చడం మరో విశేషంగా ఉంది.