భారీ స్క్రీన్ సైజు, బెజెల్ లెస్ డిస్‌ప్లేతో చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి విడుదల చేసిన ఎంఐ మిక్స్2 స్మార్ట్‌ఫోన్ నేటి నుంచి విక్రయానికి రాబోతుంది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్ ద్వారా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి భారత్‌లో ఇది విక్రయానికి వస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ తొలి రెగ్యులర్ ఫ్లాష్ సేల్ ఇదే. బెజెల్-లెస్ డిస్‌ప్లే మాత్రమే కాక, మెటాలిక్-సెరమిక్ బాడీ, క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్‌ఓసీ దీనికి మరో ప్రధానమైన ఆకర్షణలు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ నెల ప్రారంభంలో లాంచ్ చేసింది. మంగళవారం రెగ్యులర్ ఫ్లాస్ సేల్ అనంతరం ఎంఐ హోమ్ స్టోర్, కంపెనీ ఫిజికల్ రిటైల్ పార్టనర్ల వద్ద కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని షావోమి తెలిపింది. ఈ ఫోన్ ధర భారత్‌లో 35,999 రూపాయలు. వన్‌ప్లస్ 5, నోకియా 8, ఎల్‌జీ జీ6లకు పోటీగా ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది.
ఎంఐ మిక్స్2 స్పెషిఫికేషన్లు...
డ్యూయల్ సిమ్
ఎంఐయూఐ 9 ఆధారిత ఆండ్రాయిడ్ 7.0 నోగట్
5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్‌ఓసీ
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3400 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment