షావోమి ఎంఐ మిక్స్ 2 ధర తగ్గిందోచ్‌... | Xiaomi Mi MIX 2 price cut by Rs 3,000, now available at Rs 32,999 | Sakshi
Sakshi News home page

షావోమి ఎంఐ మిక్స్ 2 ధర తగ్గిందోచ్‌...

Published Tue, Jan 2 2018 8:06 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

Xiaomi Mi MIX 2 price cut by Rs 3,000, now available at Rs 32,999 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌​ దిగ్గజం  షావోమి మరోసారి తన వినియోగదారులకు  శుభవార్త అందించింది.  తన ఫ్లాగ్‌ షిప్‌ బెజెల్‌లెస్‌ ​స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ మిక్స్2 ను డిస్కౌంట్‌ ధరలో  అందుబాటులోకి తీసుకొచ్చింది.   ఈ తగ్గింపు తరువాత ఇపుడు ఇది రూ.32,999 ధరకు లభించనుంది. అసలు ధరతో  పోలిస్తే రూ.3వేల డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది.  పరిమిత కాల ఆఫర్‌ కింద జనవరి 5వ తేదీ వరకే ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటుంది.   ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

కాగా గత అక్టోబర్ నెలలో  లాంచ్‌ అయిన ఎంఐ మిక్స్ 2 స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.35,999గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఎంఐ మిక్స్ 2 ఫీచర్లు
 5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్,
6 జీబీ ర్యామ్
128 జీబీ స్టోరేజ్
12ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
3400 ఎంఏహెచ్ బ్యాటరీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement