షావోమి అత్యంత ఖరీదైన ఫోన్‌ ధర తగ్గింది | Xiaomi's most expensive smartphone in India becomes cheaper | Sakshi
Sakshi News home page

షావోమి అత్యంత ఖరీదైన ఫోన్‌ ధర తగ్గింది

Published Thu, Dec 7 2017 1:28 PM | Last Updated on Thu, Dec 7 2017 1:29 PM

Xiaomi's most expensive smartphone in India becomes cheaper - Sakshi

న్యూఢిల్లీ : షావోమి అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా పేరు గాంచిన ఎంఐ మిక్స్‌2 ధర తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసినప్పుడు రూ.37,999కాగ, ప్రస్తుతం ఇది రూ.5000వేల డిస్కౌంట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లోలభ్యమవుతోంది. పరిమిత కాల ఆఫర్‌లో భాగంగా యూజర్లు ఈ డివైజ్‌ను రూ.32,999కే విక్రయిస్తున్నారు. డిస్కౌంట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.18వేల వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.99 కు ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ బైబ్యాక్‌ గ్యారెంటీని పొందవచ్చు. ఎంఐ మిక్స్‌2ను కొనుగోలు చేయాలనుకునే వారికి, రూ.3,667 వద్ద నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ను ఆఫర్‌ చేస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను, యాక్సిస్‌ బ్యాంకు బుజ్‌ క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు 5 శాతం డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తుంది. గతేడాది ఎంఐ మిక్స్‌ విజయవంతమవడంతో, ఈ ఏడాది ఎంఐ మిక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌ను షావోమి విడుదల చేసింది. షావోమి తొలి బెజెల్‌-లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదే. 

ఎంఐ మిక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు..
5.99 అంగుళాల ఫుల్‌ హెచ్డీ ప్లస్‌ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌, ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో అప్‌డేట్‌
2.4గిగాహెడ్జ​ ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌
 12 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement