షియోమి బిగ్ సర్‌ప్రైజ్, ఏంటది?
షియోమి బిగ్ సర్‌ప్రైజ్, ఏంటది?
Published Tue, Jul 11 2017 5:29 PM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM
టెక్ ఇండస్ట్రీకి షియోమి బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతుంది. ఎంఐ, రెడ్‌మి సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో ఆన్‌లైన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షియోమి, మూడో సబ్-బ్రాండును లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నెల చివర్లోనే షియోమి తన మూడో సబ్-బ్రాండును ప్రకటించబోతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఎంఐ, రెడ్‌మి బ్రాండులు ఎక్కువగా ఆన్‌లైన్ రిటైల్‌ను ఫోకస్ చేస్తే, ఈ మూడో సబ్-బ్రాండు ఆఫ్‌లైన్ మార్కెట్‌లో గట్టిపోటీ ఇవ్వనుందని తెలుస్తోంది. అయితే ఈ మూడు సబ్-బ్రాండు ఏంటన్నది ఇంకా తెలియరాలేదు.
వివో, ఒప్పో లాంటి ఈ సబ్-బ్రాండు తీవ్ర పోటీ ఇస్తుందని చైనీస్ న్యూస్ వెబ్‌సైట్ మైడ్రైవర్స్‌రిపోర్టు చేసింది. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లను పెంచి చైనా ఆఫ్‌లైన్ మార్కెట్‌లోనూ తన సత్తాన్ని చాటాలని షియోమి ప్లాన్ చేస్తుందని జీఎస్‌ఎంఏరినా తెలిపింది. అయితే ఒప్పో, వివోలకు వేల కొద్దీ స్టోర్లలో బలమైన పంపిణీ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. ఆన్‌లైన్ స్పేస్‌లో మాత్రం షియోమినే తిరుగులేని స్థాయిలో ఉంది. షియోమి కాస్త ఆలస్యంగానే ఆఫ్‌లైన్ మార్కెట్‌పై దృష్టిసారించడం ప్రారంభించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.. ఇటీవలే కంపెనీ భారత్‌లోనూ తన తొలి ఎంఐ హోమ్ స్టోర్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఆశ్చర్యకరంగా షియోమి నుంచి రాబోతున్న కొత్త స్మార్ట్‌ఫోన్లు అప్‌కమింగ్ సబ్-బ్రాండులో ఉండనున్నాయని లీకేజీలు చెబుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లను కూడా షియోమి ఈ నెల చివర్లోనే లాంచ్ చేస్తోంది.
Advertisement
Advertisement