tech industry
-
ఒకప్పుడు డ్రీమ్ జాబ్.. ఇప్పుడేమో సీన్ రివర్స్..! ఐటీ ఉద్యోగులకు ఇక కష్టమే..!
-
అది తప్పే.. అలా చేయాల్సింది కాదు.. అంగీకరించిన గూగుల్ సీఈవో
పెద్ద మొత్తంలో ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తప్పేనని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అంగీకరించారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా తప్పలేదని, అయితే మరోలా వ్యవహరించాల్సి ఉండేదని పశ్చాతాపం వ్యక్తం చేశారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 2023 సంవత్సరం ప్రారంభంలో 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ సమయంలో నెలకొన్న మాంద్యం భయాల నేపథ్యంలో ఈ టెక్ దిగ్గజం తీసుకున్న ఈ నిర్ణయం మొత్తం ఉద్యోగ వర్గాల్లో ఆందోళనను, అలజడిని సృష్టించింది. బిజినెస్ ఇన్సైడర్ నుంచి వచ్చిన కథనం ప్రకారం.. ఇటీవల ఉద్యోగులతో జరిగిన సమావేశంలో సీఈవో సుందర్ పిచాయ్‌ను ఈ వివాదాస్పద నిర్ణయంతో ఏం సాధించారని ఓ ఉద్యోగి ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ అది తప్పేనని అంగీకరించారు. కానీ తప్పలేదని, గూగుల్ తన 25 ఏళ్ల చరిత్రలో అంత కీలకమైన క్షణాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పారు. అప్పుడు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే మరింత ప్రతికూల ఫలితాలకు దారితీసేదన్నారు. అయితే ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉండేదని పశ్చాతాపం వ్యక్తం చేశారు. తొలగింపులు ఉద్యోగుల మానసిక స్థైర్యంపై చాలా ప్రభావం చూపించాయని, "గూగుల్జీస్ట్" వంటి ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్ ఛానెల్‌లలో అది స్పష్టంగా కనిపించిందని ఆయన చెప్పారు. -
టెక్ కంపెనీల్లో కోతల పర్వం..
న్యూయార్క్: ఉత్పత్తులు, సర్వీసులు, సాఫ్ట్వేర్ మొదలైన వాటికి డిమాండ్ నెలకొనడంతో గత కొన్నాళ్లుగా చిన్నా, పెద్ద టెక్నాలజీ కంపెనీలు జోరుగా నియామకాలు జరిపాయి. కానీ, ఇటీవల పరిస్థితులు మారడంతో భారీగా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే టెక్నాలజీ కంపెనీలు దాదాపు 50,000 మందికి ఉద్వాసన పలికాయి. అయితే, ఇటీవల కొన్ని వారాలుగా భారీగా తొలగింపులు చేపట్టినప్పటికీ మూడేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటికీ చాలా మటుకు టెక్ సంస్థల్లో సిబ్బంది సంఖ్య గణనీయంగానే పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా.. ఈ మధ్య కాలంలో టెక్ రంగంలో ఉద్యోగాల కోతలను ఒకసారి చూస్తే.. 2022 ఆగస్టు స్నాప్: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం స్నాప్‌చాట్ మాతృ సంస్థ 20 శాతం మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రాబిన్‌హుడ్: కొత్త తరం ఇన్వెస్టర్లకు మార్కెట్‌ను చేరువలోకి తెచ్చిన రాబిన్‌హుడ్ తమ ఉద్యోగుల సంఖ్యను 23 శాతం తగ్గించుకుంది. దాదాపు 780 మందిని తొలగించింది. 2022 నవంబర్ ట్విటర్: టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ చేతికి వచ్చే నాటికి ట్విటర్లో 7,500 మంది ఉద్యోగులు ఉండేవారు. అందులో దాదాపు సగం మందిని తొలగించారు. లిఫ్ట్: ట్యాక్సీ సేవల సంస్థ లిఫ్ట్ దాదాపు 700 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం. మెటా: ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 11,000 మందికి ఉద్వాసన పలికింది. 2023 జనవరి అమెజాన్: ఈ–కామర్స్ కంపెనీ 18,000 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. కంపెనీకి అంతర్జాతీయంగా ఉన్న సిబ్బందిలో ఇది సుమారు 1 శాతం. సేల్స్‌ఫోర్స్: కంపెనీ సుమారు 8,000 మందిని (మొత్తం సిబ్బందిలో 10 శాతం) తొలగించింది. కాయిన్‌బేస్: ఈ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం 950 ఉద్యోగాల్లో కోత పెట్టింది. దాదాపు 20 శాతం మందిని తొలగించింది. మైక్రోసాఫ్ట్: ఈ సాఫ్ట్వేర్ దిగ్గజం మొత్తం సిబ్బందిలో 5 శాతం మందిని (సుమారు 10,000 ఉద్యోగాలు) తొలగిస్తోంది. గూగుల్: ఈ సెర్చి ఇంజిన్ దిగ్గజం 12,000 మందికి ఉద్వాసన పలుకుతోంది. మొత్తం సిబ్బందిలో ఇది దాదాపు 6 శాతం. స్పాటిఫై: ఈ మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవల సంస్థ అంతర్జాతీయంగా తమ ఉద్యోగుల సంఖ్యను 6 శాతం తగ్గించుకుంటోంది. నిర్దిష్టంగా సంఖ్యను పేర్కొనలేదు. ఇటీవలి స్పాటిఫై వార్షిక ఫలితాల నివేదిక ప్రకారం కంపెనీలో సుమారు 6,600 మంది ఉద్యోగులు ఉన్నారు. -
40-50 ఏళ్ల వయస్సులో బిజినెస్‌లో రాణించాలనుకునే వారి కోసం
ముంబై: దేశీయంగా తొలి స్టార్టప్ స్టూడియో జెన్ఎక్స్ వెంచర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అంకుర సంస్థ సండే టెక్ వెల్లడించింది. 40 ఏళ్లు పైబడి, వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే వారికి తోడ్పాటు అందించేందుకు తొలుత 2 మిలియన్ డాలర్ల నిధితో దీన్ని నెలకొల్పినట్లు సంస్థ వ్యవస్థాపకుడు జోసెఫ్ జార్జి తెలిపారు. వచ్చే మూడేళ్లలో 50 స్టార్టప్‌ల వృద్ధిలో పాలుపంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ తదితర నగరాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. కెరియర్ మధ్యలో ఉన్న చాలా మంది మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలను వదులుకుని, ఎంట్రప్రెన్యూర్షిప్ బాట పడుతున్నారని జార్జి పేర్కొన్నారు. స్టార్టప్ వెంచర్లలో సహ వ్యవస్థాపకులుగా ఉండటంతో పాటు వాటిని ప్రారంభ దశ నుంచి నిర్మించడంలో స్టార్టప్ స్టూడియోల ముఖ్య పాత్ర పోషిస్తాయి. 1965 నుంచి 1980 మధ్య కాలంలో పుట్టిన జనరేషన్ ఎక్స్ (జెన్ ఎక్స్) తరం ప్రస్తుతం 40–50 ఏళ్ల వయస్సులో ఉన్నారని, వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే ఇలాంటి సీనియర్ ప్రొఫెషనల్స్‌కు తోడ్పాటు అందించే సరైన వ్యవస్థ ప్రస్తుతం లేని నేపథ్యంలోనే తాము జెన్ఎక్స్ వెంచర్స్‌ను తలపెట్టామని జార్జి పేర్కొన్నారు. -
ట్విట్టర్ బ్యాన్: అసలు కారణం ఇదేనా?
అబూజా: ఆఫ్రికన్ కంట్రీ నైజీరియా.. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తమ అధ్యక్షుడు బుహారీ ట్వీట్‌ను తొలగించిన కారణంగానే ట్విట్టర్ కార్యాకలాపాలను నిలిపివేస్తున్నట్లు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే నైజీరియా నిర్ణయంపై సొంత ప్రజలు అంసతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ప్రపంచం మొత్తం నివ్వెరపోతోంది. అయితే ఇది అసలు కారణం కాదనే వాదన ఒకటి వెలుగులోకి వచ్చింది. నిజానికి ట్విట్టర్‌పై నైజీరియా సర్కార్ గుర్రుగా ఉంది అధ్యక్షుడి ట్వీట్ డిలీట్ వ్యవహారంతో మాత్రమే కాదని ఆ వాదన సారాంశం. గత కొన్నేళ్లుగా నైజీరియాలోని లాగోస్ ఆఫ్రికాలోనే అత్యంత ఆకర్షణనీయమైన టెక్ హబ్‌గా పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ వస్తోంది. కానీ, ఈ ఏప్రిల్‌లో ట్విట్టర్ ఆఫ్రికాలో తన రీజినల్ హెడ్‌క్వార్టర్ కోసం లాగోస్ కాకుండా.. ఘనాను ఎంచుకుంది. దీనిపై నైజీరియా వివరణ కోరగా.. ఘనా ప్రభుత్వం బయటి పెట్టుబడులను ఆకర్షించడంలో ముందుందని ట్విట్టర్ కారణం చెప్పింది. నిజానికి ట్విట్టర్ వివరణను సమర్థించడానికి బోలెడు కారణాలున్నాయి. అయినప్పటికీ నైజీరియా ఆ విషయంలో దారుణంగా హర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్ డిలీట్ వ్యవహారం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. దెబ్బ నైజీరియాకే! ఇక ట్విట్టర్ బ్యాన్ వివాదంతో నైజీరియా టెక్ రంగం సంక్షోభంలో పడే అవకాశం లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు. ఇరవై కోట్లకు పైగా జనాభా ఉన్న నైజీరియాలో స్మార్ట్ ఫోన్ యూజర్ల శాతం 60కి పైనే ఉంది. మరోవైపు టెక్ పెట్టుబడులతో లాగోస్ ఆర్థికాభివృద్ధికి బీజం వేసింది. ఆఫ్రికాకే అతిపెద్ద ఆర్థిక కేంద్రంగా అవతరించింది. ఇలాంటి తరుణంలో నైజీరియా ట్విట్టర్ బ్యాన్ నిర్ణయంతో.. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2016లో నైజీరియా టూర్లో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ ఆఫీస్ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించాడు. 2021 ద్వితియార్థంలో అది జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫేస్బుక్ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితుల తర్వాత నైజీరియా ప్రతినిధులు ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్‌కు సందేశం పంపగా.. అక్కడి నుంచి బదులు లేకపోవడంతో ఇది దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు చెప్తున్నారు. ఇక ఇదే బాటలో మరికొన్ని టెక్ సంస్థలు లాగోస్ నుంచి వెనక్కి వెళ్లే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నైజీరియా దూకుడు నిర్ణయం వల్ల 170 మిలియన్ డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు వెనక్కిపోయే ప్రమాదం నెలకొన్నట్లు వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. -
షియోమి బిగ్ సర్ప్రైజ్, ఏంటది?
టెక్ ఇండస్ట్రీకి షియోమి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతుంది. ఎంఐ, రెడ్మి సిరీస్ స్మార్ట్ఫోన్లతో ఆన్లైన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షియోమి, మూడో సబ్-బ్రాండును లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నెల చివర్లోనే షియోమి తన మూడో సబ్-బ్రాండును ప్రకటించబోతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఎంఐ, రెడ్మి బ్రాండులు ఎక్కువగా ఆన్లైన్ రిటైల్‌ను ఫోకస్ చేస్తే, ఈ మూడో సబ్-బ్రాండు ఆఫ్‌లైన్ మార్కెట్లో గట్టిపోటీ ఇవ్వనుందని తెలుస్తోంది. అయితే ఈ మూడు సబ్-బ్రాండు ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. వివో, ఒప్పో లాంటి ఈ సబ్-బ్రాండు తీవ్ర పోటీ ఇస్తుందని చైనీస్ న్యూస్ వెబ్సైట్ మైడ్రైవర్స్రిపోర్టు చేసింది. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లను పెంచి చైనా ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ తన సత్తాన్ని చాటాలని షియోమి ప్లాన్ చేస్తుందని జీఎస్ఎంఏరినా తెలిపింది. అయితే ఒప్పో, వివోలకు వేల కొద్దీ స్టోర్లలో బలమైన పంపిణీ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. ఆన్లైన్ స్పేస్‌లో మాత్రం షియోమినే తిరుగులేని స్థాయిలో ఉంది. షియోమి కాస్త ఆలస్యంగానే ఆఫ్‌లైన్ మార్కెట్‌పై దృష్టిసారించడం ప్రారంభించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.. ఇటీవలే కంపెనీ భారత్‌లోనూ తన తొలి ఎంఐ హోమ్ స్టోర్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఆశ్చర్యకరంగా షియోమి నుంచి రాబోతున్న కొత్త స్మార్ట్ఫోన్లు అప్‌కమింగ్ సబ్-బ్రాండులో ఉండనున్నాయని లీకేజీలు చెబుతున్నాయి. ఈ స్మార్ట్ఫోన్లను కూడా షియోమి ఈ నెల చివర్లోనే లాంచ్ చేస్తోంది.