పెద్ద మొత్తంలో ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తప్పేనని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అంగీకరించారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా తప్పలేదని, అయితే మరోలా వ్యవహరించాల్సి ఉండేదని పశ్చాతాపం వ్యక్తం చేశారు.
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 2023 సంవత్సరం ప్రారంభంలో 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ సమయంలో నెలకొన్న మాంద్యం భయాల నేపథ్యంలో ఈ టెక్ దిగ్గజం తీసుకున్న ఈ నిర్ణయం మొత్తం ఉద్యోగ వర్గాల్లో ఆందోళనను, అలజడిని సృష్టించింది.
బిజినెస్ ఇన్‌సైడర్ నుంచి వచ్చిన కథనం ప్రకారం.. ఇటీవల ఉద్యోగులతో జరిగిన సమావేశంలో సీఈవో సుందర్ పిచాయ్‌ను ఈ వివాదాస్పద నిర్ణయంతో ఏం సాధించారని ఓ ఉద్యోగి ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ అది తప్పేనని అంగీకరించారు. కానీ తప్పలేదని, గూగుల్ తన 25 ఏళ్ల చరిత్రలో అంత కీలకమైన క్షణాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పారు.
అప్పుడు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే మరింత ప్రతికూల ఫలితాలకు దారితీసేదన్నారు. అయితే ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉండేదని పశ్చాతాపం వ్యక్తం చేశారు. తొలగింపులు ఉద్యోగుల మానసిక స్థైర్యంపై చాలా ప్రభావం చూపించాయని, "గూగుల్‌జీస్ట్" వంటి ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్ ఛానెల్‌లలో అది స్పష్టంగా కనిపించిందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment