అందుకే ‘నోట్‌-4’ కాలింది: షావోమి | 'Extreme external force' applied to 'burnt' Redmi Note 4: Xiaomi | Sakshi
Sakshi News home page

అందుకే ‘నోట్‌-4’ కాలింది: షావోమి

Published Fri, Aug 18 2017 7:29 PM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

అందుకే ‘నోట్‌-4’  కాలింది: షావోమి

అందుకే ‘నోట్‌-4’ కాలింది: షావోమి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఇటీవల రెడ్‌మి నోట్‌-4 కాలి భావన సూర్యకిరణ్ అనే  యువకుడికి గాయాలైన ఘటనపై  చైనా కంపెనీ షావోమీ స్పందించింది. ఇందులో తమ తప్పేమీ లేదనే రీతిలో... ఫోన్‌ను విపరీతమైన ఒత్తిడికి గురి చేసినందునే ఈ ఘటన చోటుచేసుకుని ఉంటుందని పేర్కొంది. 

కస్టమర్‌తో పలుమార్లు మాట్లాడిన అనంతరం కాలిపోయిన ఫోన్‌ను తెప్పించుకుని పరిశీలించామని ఫోన్‌పై  వేరే ఒత్తిడితో బ్యాక్‌ కవర్‌తో పాటు బ్యాటరీ ప్రభావితమైందని, స్ర్కీన్‌ దెబ్బతిన్నదని ప్రాథమికంగా వెల్లడైందని కంపెనీ పేర్కొంది. ఫోన్‌ దెబ్బతినడానికి సరైన కారణమేంటనేది పూర్తి పరిశోధన అనంతరం తేలుతుందని తెలిపింది.

సంబంధిత వార్త... కాలిపోయిన 'నోట్‌-4'.. యువకుడికి గాయాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement