cellphone caught fire
-
అందుకే ‘నోట్-4’ కాలింది: షావోమి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఇటీవల రెడ్మి నోట్-4 కాలి భావన సూర్యకిరణ్ అనే యువకుడికి గాయాలైన ఘటనపై చైనా కంపెనీ షావోమీ స్పందించింది. ఇందులో తమ తప్పేమీ లేదనే రీతిలో... ఫోన్‌ను విపరీతమైన ఒత్తిడికి గురి చేసినందునే ఈ ఘటన చోటుచేసుకుని ఉంటుందని పేర్కొంది. కస్టమర్‌తో పలుమార్లు మాట్లాడిన అనంతరం కాలిపోయిన ఫోన్‌ను తెప్పించుకుని పరిశీలించామని ఫోన్‌పై వేరే ఒత్తిడితో బ్యాక్ కవర్‌తో పాటు బ్యాటరీ ప్రభావితమైందని, స్ర్కీన్ దెబ్బతిన్నదని ప్రాథమికంగా వెల్లడైందని కంపెనీ పేర్కొంది. ఫోన్ దెబ్బతినడానికి సరైన కారణమేంటనేది పూర్తి పరిశోధన అనంతరం తేలుతుందని తెలిపింది. సంబంధిత వార్త... కాలిపోయిన 'నోట్-4'.. యువకుడికి గాయాలు! -
కాలిపోయిన 'నోట్-4'.. యువకుడికి గాయాలు!
రావులపాలెం: ప్యాంటు జేబులో పెట్టుకున్న చైనా సెల్‌ఫోన్ కాలిపోవడంతో ఓ యువకుడు గాయపడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో చోటుచేసుకుంది. రావులపాలెం గ్రామానికి చెందిన భావన సూర్యకిరణ్ కిళ్ళీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం అతను సెల్‌ఫోన్ ప్యాంట్ జేబులో పెట్టుకుని మోటార్ సైకిల్‌పై దుకాణానికి వెళ్తుండగా.. అది ఒక్కసారిగా కాలిపోయి జేబులో నుంచి మంటలు వచ్చాయి. దీంతో బండి దిగి ఎంత లాగినా ఫోన్ బయటకు రాలేదు. మంటలు గమనించిన స్థానికులు వెంటనే నీళ్లు చల్లి మంటలు ఆర్పి ఫోన్‌ను కింద పడేశారు. ఈ సంఘటనలో కిరణ్ తొడ భాగంలో గాయాలయ్యాయి. ఇరవై రోజుల క్రితమే కొనుగోలు చేసిన రెడ్-ఎంఐ నోట్-4 ఫోన్ ఇలా కాలిపోయిందని కిరణ్ తెలిపారు. కొత్త నోట్-4 ఫోన్ కాలిపోవడమే కాకుండా ఆ మంటల వల్ల తనకు గాయాలయ్యాయని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు.