షియోమీ ఎంఐ 5 లాంచింగ్ నేడే | Xiaomi Mi 5 India Launch Today | Sakshi
Sakshi News home page

షియోమీ ఎంఐ 5 లాంచింగ్ నేడే

Published Thu, Mar 31 2016 11:11 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

షియోమీ ఎంఐ 5  లాంచింగ్ నేడే

షియోమీ ఎంఐ 5 లాంచింగ్ నేడే

చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమీ తన ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ ఎంఐ 5 ను గురువారం న్యూఢిల్లీలో ఒక కార్యక్రమంలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతోంది.

న్యూఢిల్లీ:
కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో ఏప్రిల్ మార్కెట్ హీటెక్కబోతోంది. ముఖ్యంగా యాపిల్ విడుదల చేయబోతోన్న చౌకధర ఫోన్ ఐఫోన్ ఎస్ఈ  కి సామ్‌సంగ్, షియోమీ వంటి పోటీ బ్రాండ్‌లు కూడా హల్ చల్ చేయనున్నాయి. 4 అంగుళాల స్ర్కీన్ సైజులో యాపిల్ డిజైన్ చేసిన 'ఐఫోన్ ఎస్ఈ' ఇండియన్ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతుండగా ,  చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమీ తన ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ ఎంఐ 5 ను గురువారం  న్యూఢిల్లీలో ఒక కార్యక్రమంలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతోంది.

షియోమీ ఎంఐ 5  స్పెసిఫికేషన్స్

శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌, డ్యూయల్ సిమ్ ,  అలానే 5.15 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే ,4కె వీడియో రికార్డింగ్ , 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఆకట్టుకుంటాయి.  ఐ ఫోన్ ఎస్ కంటే  తక్కువ బరువుతో  కేవలం 129 గ్రా. తూగే   ఈ షియామీ ఎమ్ఐ ధర 25000  రూపాయలు  ఉంటుదంని అంచాన. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు లాంచింగ్ అనంతరం వెల్లడి కానున్నాయి.


చైనా  తరువాత మొదటి మన ఇండియన్ మార్కెట్లలో  దీన్ని  మూడు వేరియంట్లలో  రిలీజ్ చేయనున్నారు. అయితే  మూడు వేరియంట్ల వివరాలపై స్పష్టత రాలేదు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement