నోట్ 3 ధరకే రెడ్‌మి నోట్ 4? | Xiaomi to release redmi note 4 soon, know about features | Sakshi
Sakshi News home page

నోట్ 3 ధరకే రెడ్‌మి నోట్ 4?

Published Mon, Jan 16 2017 7:33 AM | Last Updated on Tue, Sep 5 2017 1:16 AM

Xiaomi to release redmi note 4 soon, know about features


చవక ధరలతో స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న షియోమి.. తన రెడ్‌మి నోట్ 4ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మరో మూడు రోజుల్లో ఇది భారత మార్కెట్లలోకి రానుంది. జనవరి 19వ తేదీన దీన్ని మార్కెట్లోకి తెస్తామని షియోమి కంపెనీ ప్రకటించింది. షియోమి రెడ్‌మి నోట్ 3 మార్కెట్లో క్లిక్ కావడంతో.. దాదాపు దాని ధరలోనే మరికొంత అప్‌గ్రేడెడ్ వెర్షన్, మరింత ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో నోట్ 4ను తీసుకొస్తోంది. మరి దాని గురించిన వివరాలు తెలుసుకోవాలని ఉందా..? ఆ సినిమా గురించిన కొన్ని అంచనాలు ఇలా ఉన్నాయి.
 
డిస్‌ప్లే
దీనికి 5.5 అంగుళాల డిస్‌ప్లే, 2.5 డ్రాగన్ గ్లాస్‌తో ఉంటుందని అంచనా. దీని బరువు 160-165 గ్రాముల మధ్య ఉండొచ్చు. మెటల్ బాడీ, వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయంటున్నారు. 
 
ప్రాసెసర్
షియోమి రెడ్‌మి నోట్ 4లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉండి, మూడు రకాల వేరియంట్లలో వస్తుందని అంటున్నారు. ప్రధానంగా 2 జీబీ, 3 జీబీ, 4 జీబీ ర్యామ్‌లు ఉండనున్నాయి. వీటి ఇంటర్నల్ మెమరీ 32, 64 జీబీలుగా ఉంటుంది. డ్యూయల్ సిమ్ సపోర్టుతో పాటు 4జి ఎల్‌టీఈ కనెక్టివిటీ, హైబ్రిడ్ సిమ్ ట్రే ఉంటాయి. 128 జీబీ వరకు మెమొరీని పెంచుకోవచ్చు. 
 
కెమెరాలు
షియోమి రెడ్‌మి నోట్4లో 13 మెగాపిక్సెళ్ల వెనక కెమెరా, 5 మెగా పిక్సెళ్ల ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు. 
 
బ్యాటరీ
దీని బ్యాటరీ సామర్థ్యం కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. 4100 ఎంఏహెచ్ లి-పాలీమర్ బ్యాటరీ, త్వరగా చార్జి అయ్యేలా ఉంటుంది. అయితే.. ఈ బ్యాటరీ ఫోన్‌లోనే ఫిక్స్ అయి ఉంటుంది తప్ప, పాతవాటిలా బయటకు తీయడానికి కుదరదు. 
 
ఆపరేటింగ్ సిస్టమ్
ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అత్యాధునికమైన ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో 6.0 ఉంటుందని, దాంతోపాటు షియోమి ఎంఐయూఐ 8 వెర్షన్ ఉంటుందని చెబుతున్నారు. 
 
ధర
షియోమి స్మార్ట్ ఫోన్లు అంటేనే ధరలు అందుబాటులో ఉంటాయని ప్రసిద్ధి. గతంలో 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 2 జీబీ ర్యాం ఉన్న నోట్ 3ని 10వేల రూపాయల ధరకు ఇవ్వగా, ఇప్పుడు అదే రేంజిలో ఉన్న నోట్ 4ను కూడా దాదాపు అదే ధరకు ఇస్తారని అంటున్నారు. అదే 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ అయితే 12వేలు, 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉన్నదైతే 15వేలు ధరలు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement