షియోమీ దివాలీ ఆఫర్లు..బంపర్ ప్రైజ్ ఏంటో తెలుసా? | Xiaomi 'Diwali with Mi' offer: Re 1 flash sale on Redmi 3S, Redmi Note 3, Mi 4, more | Sakshi
Sakshi News home page

షియోమీ దివాలీ ఆఫర్లు..బంపర్ ప్రైజ్ ఏంటో తెలుసా?

Published Fri, Oct 14 2016 5:09 PM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

షియోమీ దివాలీ ఆఫర్లు..బంపర్ ప్రైజ్ ఏంటో తెలుసా? - Sakshi

షియోమీ దివాలీ ఆఫర్లు..బంపర్ ప్రైజ్ ఏంటో తెలుసా?

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ స్పెషల్ దీపావళి సేల్ ఆఫర్లు ప్రవేశపెట్టింది. షియోమీ ఉత్పత్తుల కొనుగోళ్లపై  'దివాలి విత్ మి' ఆఫర్ ను ప్రకటించింది. ఎంఐ స్టోర్ యాప్ ద్వారా అక్టోబర్17-19 వరకు బంపర్ సేల్ ఆఫర్లను వినియోగదారులకు అందించుంది. రెడ్ మి ఉత్పత్తులపై రూ. 500 నుంచి 3000 వరకు డిస్కౌంట్  ఇవ్వనుంది. స్మార్ట్ ఫోన్, ఇతర యాక్ససరీస్ తో పాటు ఎంఐ బ్రాండ్  ప్యూరి ఫయర్లను ఈ సేల్ కోసం ప్రత్యేకంగా లాంచ్ చేయనుంది. వీటిని  స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా అందించనుంది.   

  • అక్టోబర్ 17న 30 రెడ్ మి 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్లు, 100  బ్లూటూత్ స్పీకర్లు,  100 ఎంఐ బ్యాండ్
  • అక్టోబర్ 18న  30  రెడ్ మి నోట్ 3 స్మార్ట్ ఫోన్లు(16 జీబీ),  100  20,000 ఎంఎహెచ్  పవర్ బ్యాంకులు
  • అక్టోబర్ 19న 30 ఎంఐ 4 ఫోన్లు, 100 ఎంఐ బ్యాండ్ 2  అందుబాటులో ఉంటాయి.

మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని షియామీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కొనుగోలుదారులు అందరికీ  పండుగ కానుకగా ల్యాప్ టాప్ స్టికర్లు అందిస్తోంది. రూ 5000-15000 మధ్య కొనుగోలు చేస్తే ఒక కీ చైన్, రూ 15,000 పైన ఎంఐ యూఎస్బీ ని ఉచితంగా అందించనుంది. దీంతో పాటుగా ఎంఐ మాక్స్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్ ను కూడా  లాంచ్  చేయనుంది. స్నాప్ డ్రాగెన్ 652, 128జీబీ/ 4జీబీ వేరియంట్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ లో రూ.19,000 (మూడు వేల తగ్గింపు)తో విడుదల చేస్తుంది. అలాగే మూడు రోజులలో ఎంఐ 5ను జీరో శాతం వడ్డీ ఈఎంఐతో రూ 22.999 ధరకు అందుబాటులో ఉంచనుంది

మరోవైపు ఎంఐ స్టోర్ లో ఆన్ లైన్ గేమ్ పోటీ కూడా నిర్వహిస్తోంది. గో స్మాష్ గేమ్ ద్వారా కూపన్లు, డిస్కౌంట్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది.  అక్టోబర్ 10 నుంచి 16 వరకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు డిస్కౌంట్ కూపన్లు అందిస్తోంది. అంతేకాదు మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది. మూడు రోజుల ఆఫర్ ముగిసిన తరువాత బంపర్ బహుమతి గా ఎంఐ వాక్యూమ్ రోబో గెలుచుకోవచ్చు. లక్కీ డ్రా ద్వారా విజేతను ఎంపిక చేయనుంది. వినియోగదారులు ముందుగా ఎంఐ యాప్, షియోమి వెబ్ సైట్ లో రిజిస్టర్ కావాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement