షావోమి నుంచి మరో 2 స్మార్ట్ ఫోన్లు | Xiaomi Redmi 3S, Redmi 3S Prime: Specifications, features and price | Sakshi
Sakshi News home page

షావోమి నుంచి మరో 2 స్మార్ట్ ఫోన్లు

Published Thu, Aug 4 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

షావోమి నుంచి మరో 2 స్మార్ట్ ఫోన్లు

షావోమి నుంచి మరో 2 స్మార్ట్ ఫోన్లు

న్యూఢిల్లీ : చైనా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా రెడ్‌మీ సిరీస్‌లో మరో రెండు ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది. ‘రెడ్‌మీ 3ఎస్’, ‘రెడ్‌మీ 3ఎస్ ప్రైమ్’ ధరలు వరుసగా రూ.6,999, రూ.8,999. ‘రెడ్‌మీ 3ఎస్’లో 5 అంగుళాల స్క్రీన్, 1.4 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇక ‘రెడ్‌మీ 3ఎస్ ప్రైమ్’లో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి తదితర ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్.. ఫ్లిప్‌కార్ట్ సహా కంపెనీ వెబ్‌సైట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. రెడ్‌మీ 3ఎస్ ప్రైమ్ అమ్మకాలు ఆగస్ట్ 9 నుంచి, రెడ్‌మీ 3ఎస్ విక్రయాలు ఆగస్ట్ 16 నుంచి జరుగుతాయని కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement