redmi Series
-
రెడ్మీ నోట్ 13 సిరీస్ వచ్చేది అప్పుడే.. ధర ఎంతంటే?
భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెడ్ మీ ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఇప్పటి వరకు విడుదలైన అన్నీ ఫోన్లు టెక్ ప్రియుల్ని ఎంతగానో అలరించాయి. ఈ తుణంలో షావోమీ రెడ్మీ నోట్ 13 5జీ సిరీస్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. షావోమీ రెడ్మీ నోట్ 13, రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ఫోన్లను సెప్టెంబర్‌లోనే చైనాలో లాంచ్ చేసింది. ఈ మూడు వేరియంట్ మోడళ్లు 6.67 అంగుళాలు 1.5కే ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్‌లో మీడియా టెక్ డైమన్సిటీ 7200 ఆల్ట్రా ఎస్ఓసీ, రెడ్మీ నోట్ 13 ప్రో స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 2 ఎస్‌ఓఎస్‌తో వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్లను భారత్‌లో జనవరి 4, 2024న విడుదల చేయనున్నట్లు షావోమీ ఇండియా అధికారికంగా ట్వీట్ చేసింది. షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ ధరలు ఎంతంటే? రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్ ప్రారంభ ధర (చైనా కరెన్సీ యువాన్‌లో ) రూ.13,900, రెడ్మీ నోట్ 13 ప్రో ప్రారంభ ధర రూ.17,400, రెడ్మీ నోట్ 13ప్రో ప్లస్ ప్రారంభ ధర రూ.22,800 ఉండగా భారత్‌లో సైతం ఇవే ధరల్లో అందుబాటులో ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక యూరప్‌లో రెడ్మీ నోట్ 13 ప్రో మోడల్ ధర రూ.40,700, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ రూ.45,000గా ఉంది. రెడ్మీ నోట్ 13 సిరీస్ స్పెసిఫికేషన్స్ రెడ్మీ నోట్ 13 ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14తో ఈ ఫోన్ రాబోతోంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5కే హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లేలను కలిగి ఉంది. ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జెన్3 ఎస్ఓఎసీపై నడుస్తుంది. అయితే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మీడియాటెక్ డైమన్సిటీ 7200 ఆల్ట్రా ఎస్ఓసీతో పనిచేస్తుంది. వెనిలా రెడ్మి నోట్ 13 మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్ఓసీని కలిగి ఉంది. -
రెడ్మి ఎస్2 భారత్‌లోకి వచ్చేస్తోంది
షావోమి ఇటీవల చైనాలో లాంచ్ చేసిన అఫార్డబుల్ సెల్ఫీ సెట్రిక్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి ఎస్2. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చేస్తోందట. కానీ ఈ స్మార్ట్‌ఫోన్ రెడ్మి వై2 పేరుతో భారత మార్కెట్లోకి లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. తన తర్వాత స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌ను షావోమి తన ట్విటర్ అకౌంట్ ద్వారా ధృవీకరించింది. కొత్త రెడ్మి హ్యాండ్సెట్ లాంచింగ్ గురించి సోషల్ మీడియా ఛానల్స్‌లో టీజ్ చేసింది. బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్’ ను జూన్ 7న మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు షావోమి టీజర్ పోస్టు చేసింది. కానీ మిగతా వివరాలను వెల్లడించలేదు. కంపెనీ టీజర్లో జూన్7న న్యూఢిల్లీలో రెడ్మి స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈవెంట్ ఉందని పేర్కొంది. అంతేకాక #ఫైండ్‌యువర్‌సెల్ఫీ, #రియల్‌యూ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ఈ టీజర్‌ను పోస్టు చేసింది. ఈ హ్యాష్ట్యాగ్ల్లో ‘వై’ను హైలెట్ చేసింది. దీంతో షావోమి జూన్ 7న తీసుకొచ్చే డివైజ్ రెడ్మి వై2 అని తెలుస్తోంది. కానీ కంపెనీ ఇటీవల చైనాలో లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ రెడ్మి ఎస్2. ఇదే కంపెనీకి బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌గా షావోమి అభివర్ణించింది. దీంతో రెడ్మి ఎస్2 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి రెడ్మి వై2 పేరుతో లాంచ్ చేయనుందని సమాచారం. రెడ్మి వై1, రెడ్మి వై1 లైట్ స్మార్ట్ఫోన్లకు కొనసాగింపుగా రెడ్మి ఎస్ 2 వచ్చింది. రెడ్మి ఎస్2 అచ్చం ఎంఐ 6ఎక్స్ మాదిరిగానే ఉంది. అయితే ఎంఐ 6ఎక్స్ కంటే రెడ్మి ఎస్2నే తక్కువ. ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1, హానర్ 9 లైట్ ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. రెడ్మి ఎస్2 ధర.. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ధర సీఎన్‌వై 999(సుమారు రూ.10,600). 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 1299(సుమారు రూ.13,700). ఈ రెండు వేరియంట్లు గోల్డ్, ప్లాటినం సిల్వర్, రోజ్ గోల్డ్ రంగుల్లో అందుబాటు. అయితే భారత్‌లో వీటి ధరలు ఎంత ఉంటాయన్నది ఇంకా రివీల్ కాలేదు. రెడ్మి ఎస్2 స్పెషికేషన్లు ఆండ్రాయిడ్ ఆధారిత ఎంఐయూఐ 9 5.99 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీ 12 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా 256జీబీ వరకు విస్తరణ మెమరీ 3080 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మి ఎస్2 నేడే లాంచింగ్
రెడ్మి సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనీస్ మొబైల్స్ దిగ్గజం షావోమి నేడు లాంచ్ చేస్తోంది. మరికొన్ని గంటల్లో కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్మి ఎస్2ను షావోమి రివీల్ చేయబోతోంది. రెడ్మి సిరీస్‌లో బెస్ట్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌గా ఇది వినియోగదారుల ముందుకు వస్తోంది. చైనా, భారత మార్కెట్లను టార్గెట్‌గా చేసుకుని షావోమి ఈ స్మార్ట్‌ఫోన్‌ను తన స్వదేశంలో ప్రవేశపెడుతోంది. లాంచ్ ఈవెంట్ చైనాలో మధ్యాహ్నం రెండు గంటలకు జరుగనుంది. గత కొన్ని వారాలుగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర, స్పెషిషికేషన్లు, డిజైన్, ఫీచర్లపై పలు లీకేజీలు మార్కెట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఒకవేళ ఆ లీకేజీలే కనుక నిజమైతే.. రెడ్మి ఎస్2 మూడు వేరియంట్లలో రాబోతున్నట్టు తెలుస్తోంది.ఒకటి 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ దీని ధర సీఎన్‌వై 1000(సుమారు రూ.10,500) కంటే తక్కువగా ఉండబోతోంది. మరొకటి 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, దీని ధర 165.99 డాలర్లు అంటే సుమారు రూ.11,100గా ఉండనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా చివరిది 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్. అయితే ఈ టాప్ వేరియంట్ ధర ఎంత ఉండొచ్చనది ఇంకా క్లారిటీ లేదు. రెడ్మి ఎస్2 స్పెషిఫికేషన్లు... 5.99 అంగుళాల డిస్ప్లే విత్ హెచ్డీ ప్లస్ రెజుల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఎంఐయూఐ 9 ఆపరేటింగ్ సిస్టమ్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీ బ్లాక్, రోజ్ గోల్డ్, వైట్, బ్లూ, రెడ్, పింక్, గ్రే, సిల్వర్ రంగుల్లో లభ్యం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వెనుక వైపు 12 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్‌తో డ్యూయల్ కెమెరా 256జీబీ వరకు విస్తరణ మెమరీకి అవకాశం 3080 ఎంఏహెచ్ బ్యాటరీ -
షావోమి నుంచి మరో 2 స్మార్ట్ ఫోన్లు
న్యూఢిల్లీ : చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా రెడ్మీ సిరీస్‌లో మరో రెండు ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది. ‘రెడ్మీ 3ఎస్’, ‘రెడ్మీ 3ఎస్ ప్రైమ్’ ధరలు వరుసగా రూ.6,999, రూ.8,999. ‘రెడ్మీ 3ఎస్’లో 5 అంగుళాల స్క్రీన్, 1.4 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇక ‘రెడ్మీ 3ఎస్ ప్రైమ్’లో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి తదితర ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్.. ఫ్లిప్‌కార్ట్ సహా కంపెనీ వెబ్సైట్లో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. రెడ్మీ 3ఎస్ ప్రైమ్ అమ్మకాలు ఆగస్ట్ 9 నుంచి, రెడ్మీ 3ఎస్ విక్రయాలు ఆగస్ట్ 16 నుంచి జరుగుతాయని కంపెనీ తెలిపింది.