
షియామి హయ్యస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ ఇదే!
కేవలం తొమ్మిదినెలల్లో40లక్షల రెడ్ మి 3ఎస్ స్మార్ట్‌ఫోన్లను విక్రయించినట్టు షియామి తెలిపింది.
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ షియామి భారత్‌లో స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో శరవేగంగా దూసుకుపోతోంది. ప్రతి నాలుగు సెకండ్లకు అయిదు రెడ్ మీ ఫోన్లు అమ్ముడుపోతున్నాయని ఇప్పటికే సగర్వంగా ప్రకటించిన షియోమి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది . కంపనీ తాజా గణంకాలను శనివారం ప్రకటించింది. ముఖ్యంగా రెడ్ మి 3ఎస్ డివైస్‌లపై ఆశ్చర్యకరమైన అమ్మకాలను నమోదు చేసింది. కేవలం తొమ్మిదినెలల్లో 40లక్షల రెడ్ మి 3ఎస్ స్మార్ట్‌ఫోన్లను విక్రయించినట్టు తెలిపింది. దీంతో ఆన్‌లైన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఇండస్ట్రీలో రూ.10ల లోపు స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్ లో ఇది గేమ్ చేంజర్‌గా నిలిచిందని కంపెనో ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా కాగా2 జీబీ వేరియంట్ ధర రూ. 9999, 3జీబీ వేరియంట్ ధర రూ. 11,999 ధరలో 2016, ఆగష్టులో లాంచ్ చేసింది. ప్రీమియం మెటల్‌బాడీతో విడుదల చేసిన రెడ్ మి 3 ఎస్ ను, 5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, 128 జీబీదాకా ఎక్స్‌పాండబుల్ మొబరీ, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ, బరువు 144 గ్రాములు తదితర ఫీచర్లతో దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.