
షియోమి ఎంఐ 6 ఫీచర్లు ఇవే..!
చైనా మొబైల్ మేకర్ షియోమి తన తరువాత ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ఎంఐ 6 స్పెసిఫికేషన్స్,ధర తదితర వివరాలు ఆన్ లైన్ లీక్ అయ్యాయి.
ముంబై: ఎంఐ ఫోన్లతో స్మార్ట్ ఫోన్ల రంగంలో విప్లవానికి నాందిపలికిన చైనా మొబైల్ మేకర్ షియోమి తన తరువాత ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ఎంఐ 6 ను త్వరలోనే లాంచ్ చేయబోతోంది. అయితే కంపెనీ అధికారికంగా ఆ ఫ్లాగ్షిప్ ఫోన్ వివరాలు ప్రకటించలేదు. కానీ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్,ధర తదితర వివరాలు ఆన్ లైన్ లీక్ అయ్యాయి. అయితే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ మాత్రం తమ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించడంలేదనీ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అటు మరో ప్రముఖ మొబైల్ మేకర్ శాంసంగ్ కూడా యండబ్ల్యూసీకి దూరం.
సిరామిక్ బాడీతో మూడు వేరియంట్లలో ఇది వినియోగదారుల ముందుకు రానుంది. ఆన్ లైన్ లో చక్కర్దు కొడుతున్న నివేదికలు ప్రకారం 4 జీబీ, 6జీబీ ర్యామ్ తో ఫుల్ సిరామిక్ బాడీతో వస్తోంది. మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం వెర్షన్ ను 6జీబీ ర్యామ్ , డ్యూయల్ ఎడ్జ్ స్క్రీన్ వేరియంట్ గా రూపొందించింది. రెండు స్నాప్ డ్రాగెన్ 835 చిప్సెట్ , ఒకటి మీడియా టెక్ ఎక్స్30 ప్రాసెసర్ వెర్షన్ తో రానున్నాయి.
ఆండ్రాయిడ్ 7.0 నోగట్, ఎంఐయుఐ8,
218జీజీ, 256 జీబీ స్టోరేజ్ కెపాసిటీ
12 మెగా పిక్సెల్ రియర్ కెమెరా,
3000ఎంఏహెచ్ బ్యాటరీ
మీడియా టెక్ ప్రాసెసర్ ఎంఐ 6 వేరియంట్ సుమారుగా రూ 19,800, స్నాప్ డ్రాగెన్ 835 చిప్ సెట్ సుమారుగా రూ. 24,800 కి, డ్యూయల్ ఎడ్జ్ స్క్రీన్ వేరియంట్ రూ 29,800 ధరకి అందుబాటులోకి రానుందట.