ఎంఐ ఎ1 స్పెషల్‌ ఎడిషన్ | Xiaomi Mi A1 Special Edition Red to go on sale starting December 20 | Sakshi
Sakshi News home page

ఎంఐ ఎ1 స్పెషల్‌ ఎడిషన్‌

Published Tue, Dec 19 2017 9:34 AM | Last Updated on Tue, Dec 19 2017 9:57 AM

Xiaomi Mi A1 Special Edition Red to go on sale starting December 20 - Sakshi

సాక్షి, ముంబై: షావోమి  తన పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ ఎ1 లో కొత్త ఎడిషన్‌ విక్రయాలను ప్రారంభిస్తోంది. క్రిస్మస్‌ సందర్భంగా రెడ్‌ కలర్‌ వెర్షన్‌ లో దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.  రేపు (డిసెంబర్‌12వ తేదీనుంచి)  ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ హోం స్టోర్స్‌ద్వారా  ప్రత్యేకంగా విక్రయించనుంది. 

గ్లోబల్ హాలిడే సీజన్‌ను సెలబ్రేట్‌  చేస్తున్న షావోమి ఇండియాలో కూడా క్రిస్మస్‌ సేల్‌ను ప్రకటించింది. ఈ ఎంఐ ఎ1 రెడ్  స్పెషల్ ఎడిషన్‌ రూ. 13,999 ధరలో బ్లాక్, గోల్డ్‌ అండ్‌ రోజ్‌ గోల్డ్‌ ఎడిషన్‌లో లభిస్తుంది. భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో  ధర రూ. 14,999కి లాంచ్‌ చేసిన కంపెనీ ఇటీవల దీనిపై  వెయ్యి రూపాయల పర్మినెంట్‌ డిస్కౌంట్‌ ప్రకటించింది.

ఎంఐ ఎ1 ఫీచర్లు
5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
కార్నింగ్ గొరిల్లా గ్లాస్
ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్
2గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్
4జీబీ ర్యామ్‌
64జీబీ స్టోరేజ్‌
12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3080 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement