Mi A1
-
షావోమి అభిమానులకు బ్యాడ్‌న్యూస్
చైనీస్ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి అభిమానులకు బ్యాడ్‌న్యూస్. కంపెనీకి చెందిన తొలి ఆండ్రాయిడ్ వన్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ ఏ1 ఇక నుంచి భారత్‌లో లభ్యం కాదట. ఈ స్మార్ట్‌ఫోన్ ఇక నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కానీ కంపెనీ అధికారిక సెల్లింగ్ పార్టనర్ వద్ద కానీ అమ్మకానికి లభ్యం కాదని కంపెనీ తన భారత వెబ్సైట్లో పేర్కొంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఈ ఏడాది ప్రారంభంలోనే ఓరియో అప్డేట్ తీసుకొచ్చింది. ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది సెప్టెంబర్‌లోనే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు లాంచ్‌చేసిన ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఏడు నెలల్లోనే నిలిపివేయలేదు. వచ్చే కొన్ని రోజుల్లో ఎంఐ ఏ1కు సక్సెసర్‌గా ఎంఐ ఏ2 లాంచ్ చేయనున్న నేపథ్యంలో షావోమి ఈ ఫోన్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు టెక్ విశ్లేషకులంటున్నారు. ఎంఐ 6ఎక్స్ అక్కా ఎంఐ ఏ2 చైనాలో ఈ నెల 25న లాంచ్ కాబోతోంది. అయితే కంపెనీ అధికారిక ఆహ్వానంలో మాత్రం ఎంఐ 6ఎక్స్ గురించి ధృవీకరించలేదు. కొంత మంది టెక్ విశ్లేషకులు ఏప్రిల్ 25న ఎంఐ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తుందని అంటున్నారు. లీకైన సమాచారం ప్రకారం ఏప్రిల్ 25న లాంచ్ కాబోతోన్న స్మార్ట్‌ఫోన్‌కు ఫీచర్లు ఈ కింది విధంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. 5.99 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీప్లస్ డిస్ప్లే 4జీబీ ర్యామ్, 32జీబీ వెర్షన్ 6జీబీ ర్యామ్, 64జీబీ వెర్షన్ 6జీబీ ర్యామ్, 128జీబీ మోడల్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ 12మెగాపిక్సెల్, 20మెగాపిక్సెల్‌తో బ్యాక్ కెమెరాలు 20మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమ్మకాలు నిలిపివేస్తున్న ఎంఐ ఏ1 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి. 5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 12 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్‌తో డ్యూయల్ రియర్ కెమెరాలు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3080 ఎంఏహెచ్ బ్యాటరీ ధర 14,999 రూపాయలు. -
ఎంఐ ఎ1 స్పెషల్ ఎడిషన్
సాక్షి, ముంబై: షావోమి తన పాపులర్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ ఎ1 లో కొత్త ఎడిషన్ విక్రయాలను ప్రారంభిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా రెడ్ కలర్ వెర్షన్ లో దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రేపు (డిసెంబర్12వ తేదీనుంచి) ఫ్లిప్‌కార్ట్, ఎంఐ హోం స్టోర్స్ద్వారా ప్రత్యేకంగా విక్రయించనుంది. గ్లోబల్ హాలిడే సీజన్‌ను సెలబ్రేట్ చేస్తున్న షావోమి ఇండియాలో కూడా క్రిస్మస్ సేల్‌ను ప్రకటించింది. ఈ ఎంఐ ఎ1 రెడ్ స్పెషల్ ఎడిషన్ రూ. 13,999 ధరలో బ్లాక్, గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ ఎడిషన్‌లో లభిస్తుంది. భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ధర రూ. 14,999కి లాంచ్ చేసిన కంపెనీ ఇటీవల దీనిపై వెయ్యి రూపాయల పర్మినెంట్ డిస్కౌంట్ ప్రకటించింది. ఎంఐ ఎ1 ఫీచర్లు 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్ 2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3080 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఎంఐ ఎ1పై పర్మినెంట్ రేట్ కట్
సాక్షి,ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి ఎంఐ ఫాన్స్‌కు గ్రేట్ న్యూస్ అందించింది. ఇటీవల లాంచ్ చేసిన ఎంఐ ఎ1పై శాశ్వతంగా తగ్గింపు రేటును ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల తాత్కాలికంగా రూ.2 వేల తగ్గింపును అందించిన కంపెనీ తాజాగా ఎప్పటికీ వెయ్యి రూపాయల తగ్గింపుతో కస్టమర్లకు అందించనుంది. భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.14,999 ధరలో విడుదల చేసిన ఈ డివైస్‌ను ఇకమీదట రూ.13,999లకే అందిస్తున్నట్టు ట్విట్టర్లో తెలిపింది. వెయ్యి రూపాయల మేర పర్మినెంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు షావోమి వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. ఎం, ఫ్లిప్‌కార్ట్‌ద్వారా కొనుగోలు చేయవచ్చని సూచించారు. ఎంఐ ఎ1 ఫీచర్లు 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.2 2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్ 12ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 3080 ఎంఏహెచ్ బ్యాటరీ Great news Mi Fans: announcing a permanent price drop of ₹ 1000 on Mi A1! 🙌#MiA1: picture perfect flagship dual camera phone. Now available for a perfect price of ₹13,999! Buy it from https://t.co/lzFXOcGyGQ and @Flipkart. pic.twitter.com/PWplnIMC71 — Manu Kumar Jain (@manukumarjain) December 10, 2017 -
హైదరాబాద్‌లో 'ఎంఐ హోం' షోరూమ్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ షావోమి తన మార్కెట్‌ను పెంచుకోవడానికి మరో నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఎంఐ హోమ్ పేరుతో ప్రత్యేక షోరూమ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పలు మెట్రో నగరాల్లో షోరూమ్‌లు నెలకొల్సిన షావోమి ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ప్రత్యేక షోరూమ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈనెల 12న హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 'ఎంఐ హోం' షోరూమ్‌ను ప్రారంభించనుంది. ఈమేరకు షావోమి తన అధికారిక వెబ్సైట్లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ షోరూమ్‌లో ఎంఐ అన్ని ప్రొడక్టులు దొరకుతాయని పేర్కొంది. అలాగే గత మంగళవారం విడుదల చేసిన ఎంఐ ఏ1 ప్రీబుకింగులు గురువారం నుంచి ప్రారంభమౌతాయని ప్రకటించింది. ఇంకా చదవండి: ఎంఐ ఏ1 లాంచ్, ఫీచర్లు