ఎంఐ ఎ1పై పర్మినెంట్‌ రేట్‌ కట్‌ | Xiaomi Mi A1 gets permanent price cut of Rs 1,000 | Sakshi
Sakshi News home page

ఎంఐ ఎ1పై పర్మినెంట్‌ రేట్‌ కట్‌

Published Tue, Dec 12 2017 12:51 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

Xiaomi Mi A1 gets permanent price cut of Rs 1,000 - Sakshi

సాక్షి,ముంబై: చైనా మొబైల్‌ మేకర్‌ షావోమి ఎంఐ  ఫాన్స్‌కు గ్రేట్‌ న్యూస్‌ అందించింది.  ఇటీవల లాంచ్‌ చేసిన ఎంఐ ఎ1పై  శాశ్వతంగా తగ్గింపు రేటును ఆఫర్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.   ఇటీవల తాత్కాలికంగా రూ.2 వేల తగ్గింపును అందించిన కంపెనీ  తాజాగా ఎప్పటికీ  వెయ్యి రూపాయల తగ్గింపుతో  కస్టమర్లకు అందించనుంది.

భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.14,999 ధరలో  విడుదల చేసిన ఈ డివైస్‌ను ఇకమీదట రూ.13,999లకే అందిస్తున్నట్టు ట్విట్టర్లో తెలిపింది. వెయ్యి రూపాయల మేర  పర్మినెంట్‌ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు షావోమి వైస్‌ ప్రెసిడెంట్‌ మను కుమార్‌ జైన్‌ ట్వీట్‌ చేశారు. ఎం, ఫ్లిప్‌కార్ట్‌ద్వారా కొనుగోలు చేయవచ్చని  సూచించారు.

ఎంఐ ఎ1 ఫీచర్లు
5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
కార్నింగ్ గొరిల్లా గ్లాస్
ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.1.2
2గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్
12ఎంపీ  డ్యుయల్ రియర్‌ కెమెరా
5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
4జీబీ ర్యామ్‌
64జీబీ స్టోరేజ్‌
3080 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement