భారత్‌తో సమాచార మార్పిడి భద్రం: స్విట్జర్లాండ్
న్యూఢిల్లీ/బెర్న్: భారతదేశంలో ప్రస్తుతం అమలవుతున్న డేటా సెక్యూరిటీ, సమాచార గోప్యత చట్టాలు పటిష్టంగా ఉన్నాయని, ‘ఆటోమెటిక్ ఎక్సే్చంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్’ ఒప్పందంలో ఆ దేశం చేరేందుకు అనువుగా ఉన్నాయని స్విట్జర్లాండ్ ప్రభుత్వం పేర్కొంది.
స్విస్ బ్యాంకు ఖాతాల వివరాల్ని పంచుకునేందుకు భారత్‌తో సమాచార మార్పిడి ఒప్పందం కోసం నోటిషికేషన్‌ను స్విట్జర్లాండ్ ఆదివారం గెజిట్‌లో ప్రచురించింది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే స్విస్ బ్యాంకుల్లోని నల్ల కుబేరుల వివరాల్ని పొందేందుకు భారత్‌కు అవకాశం ఏర్పడుతుంది. నోటిఫికేషన్ విడుదల చేస్తూ.. బీమా, ఇతర ఆర్థిక సేవల రంగంలో భారత్ మార్కెట్‌లో ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు స్విస్ పేర్కొంది.