
న్యూఢిల్లీ: కీలకమైన సమాచార భద్రతకు సవాళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో... సైబర్ ఇన్సూరెన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. 2018లో ఈ విభాగం వార్షికంగా 40 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీఐ) నివేదిక వెల్లడించింది.
డేటా ఉల్లంఘనలు జరిగితే ఎదురయ్యే ఆర్థిక పరిణామాలను తట్టుకునేందుకు సైబర్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపింది. భారత మార్కెట్ ఇప్పటికీ ఆరంభ దశలోనే ఉందని, 2018 నాటికి 40% వృద్ధి నమోదైనట్టు తెలిపింది. అంతర్జాతీయంగా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ 2017 నాటికి 4.2 బిలియన్ డాలర్లు (రూ.29,400కోట్లు) ఉండగా, ఏటా 27 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తోందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment