న్యూఢిల్లీ: అంకుర సంస్థ హెచ్‌బిట్స్ ప్రతిపాదిత రూ. 500 కోట్ల ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతినిచి్చంది. ఈ ఫండ్ ద్వారా సేకరించిన నిధులను కమర్షియల్ రియల్ ఎస్టేట్‌పై ఇన్వెస్ట్ చేయనున్నట్లు హెచ్‌బిట్స్ వెల్లడించింది. ఈ పెట్టుబడులపై ఇన్వెస్టర్లు 18–20 శాతం మేర రాబడులు అందుకునే అవకాశం ఉందని పేర్కొంది.
మే నెలాఖరున సెబీ నుంచి అనుమతి లభించిందని, ప్రస్తుతం ఫ్యామిలీ ఆఫీస్‌లు, అత్యంత సంపన్నులు, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, ఇంటర్నేషనల్ ఫండ్స్ నుంచి నిధులు సమీకరిస్తున్నామని వివరించింది. ప్రస్తుతం హెచ్‌బిట్స్ తొమ్మిది ప్రాపరీ్టలవ్యాప్తంగా రూ. 220 కోట్ల అసెట్స్‌ను నిర్వహిస్తోంది. 50,000 మంది పైచిలుకు రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment