Investment funds
-
ఏఐఎఫ్‌ల పెట్టుబడుల రికవరీపై పిరమల్ ధీమా
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలతో ప్రభావితమయ్యే ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల (ఏఐఎఫ్) నుంచి పెట్టుబడులను సజావుగా రాబట్టుకోగలమని పిరమల్ ఎంటర్ప్రైజెస్ (పీఈఎల్) ధీమా వ్యక్తం చేసింది. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి ఏఐఎఫ్ యూనిట్లలో పీఈఎల్, పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్‌కు రూ. 3,817 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో రుణగ్రస్త కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయని మొత్తం .. రూ. 653 కోట్లుగా ఉంది. మిగతా రూ. 3,164 కోట్లలో రూ. 1,737 కోట్ల నిధులను గత 12 నెలల వ్యవధిలో మూడు రుణగ్రస్త కంపెనీల్లో ఏఐఎఫ్‌లు ఇన్వెస్ట్ చేశాయి. అయితే, నిబంధనలకు అనుగుణంగా మొత్తం రూ. 3,164 కోట్లకు పీఈఎల్ ప్రొవిజనింగ్ చేయొచ్చని, ఫలితంగా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,200 కోట్ల మేర నష్టాలను చూపించే అవకాశం ఉందని బ్రోకరేజి సంస్థ ఎమ్కే ఒక నివేదికలో తెలిపింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ దగ్గర రుణాలు తీసుకున్న సంస్థల్లో ఏఐఎఫ్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేయరాదని, ఒకవేళ చేసి ఉంటే నెలరోజుల్లోగా వాటిని ఉపసంహరించుకోవాలని లేదా ఆ మొత్తానికి ప్రొవిజనింగ్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. -
హెచ్‌బిట్స్ ఆల్టర్నేటివ్ ఫండ్‌కు సెబీ ఆమోదం
న్యూఢిల్లీ: అంకుర సంస్థ హెచ్‌బిట్స్ ప్రతిపాదిత రూ. 500 కోట్ల ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతినిచి్చంది. ఈ ఫండ్ ద్వారా సేకరించిన నిధులను కమర్షియల్ రియల్ ఎస్టేట్‌పై ఇన్వెస్ట్ చేయనున్నట్లు హెచ్‌బిట్స్ వెల్లడించింది. ఈ పెట్టుబడులపై ఇన్వెస్టర్లు 18–20 శాతం మేర రాబడులు అందుకునే అవకాశం ఉందని పేర్కొంది. మే నెలాఖరున సెబీ నుంచి అనుమతి లభించిందని, ప్రస్తుతం ఫ్యామిలీ ఆఫీస్‌లు, అత్యంత సంపన్నులు, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, ఇంటర్నేషనల్ ఫండ్స్ నుంచి నిధులు సమీకరిస్తున్నామని వివరించింది. ప్రస్తుతం హెచ్‌బిట్స్ తొమ్మిది ప్రాపరీ్టలవ్యాప్తంగా రూ. 220 కోట్ల అసెట్స్‌ను నిర్వహిస్తోంది. 50,000 మంది పైచిలుకు రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. -
ఆకర్షణీయంగా ఆల్టర్నేటివ్ ఫండ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలకు దేశీయంగా డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాలకు దీటుగా, కొన్నిసార్లు అంతకు మించిన రాబడులు అందిస్తూ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) ఆకట్టుకుంటున్నాయి. దీంతో వీటిలో పెట్టుబడులపై దేశీ ఇన్వెస్టర్లలోనూ ఆసక్తి పెరుగుతోంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం దాదాపు రెండేళ్ల క్రితం వరకు రూ. 4.5 లక్షల కోట్లుగా ఉన్న ఏఐఎఫ్‌ల నిధులు గతేడాది ఆఖరు నాటికి రూ. 7 లక్షల కోట్లకు చేరాయి. రాబోయే రోజుల్లో ఇది 4–5 రెట్లు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ. 40 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ స్థాయికి చేరవచ్చని లెక్క వేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం దాకా ఎక్కువగా విదేశాల నుంచి పెట్టుబడులు వస్తుండగా ప్రస్తుతం 80– 90% నిధులు దేశీయంగా సమీకరించినవే ఉంటున్నాయి. అత్యంత సంపన్నులతో పాటు ఒక మోస్త రు ఇన్వెస్టర్లు కూడా వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మూడు రకాలు: ఈక్విటీలు, బాండ్లు, రియల్టీ వంటి సంప్రదాయ సాధనాలకే పరిమితం కాకుండా ఇతరత్రా మరిన్ని ప్రత్యామ్నాయ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులను అందుకోవాలనుకునే ఇన్వెస్టర్ల కోసం ఉద్దేశించినవి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు. సంప్రదాయ ఫండ్స్‌తో పోలిస్తే భిన్నమైన వ్యూహాలతో, విభిన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులను ఆర్జించడం వీటి లక్ష్యం. రిస్కులు ఉన్నప్పటికీ దానికి తగ్గట్లుగా మరింత రాబడులు పొందేందుకు అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా మూడు కేటగిరీల కింద దాదాపు 4,000 పైచిలుకు ఏఐఎఫ్‌లు ఉన్నాయి. ఏఐఎఫ్ల్లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. కేటగిరీ 1 తరహా ఏఐఎఫ్‌లు ప్రధానంగా స్టార్టప్‌లు, చిన్న .. మధ్య తరహా సంస్థలు లేదా లాభదాయకమైనవిగా ప్రభుత్వం పరిగణించే రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. ఇక రెండో కేటగిరీ ఫండ్‌లో ప్రైవేట్ ఈక్విటీ, డెట్ ఫండ్స్ లాంటివి ఉంటాయి. మూడో కేటగిరీలో హెడ్జ్ ఫండ్స్, స్వల్పకాలికంగా రాబడులు అందించే ఉద్దేశంతో ఏర్పాటయ్యే ఫండ్స్ మొదలైనవి ఉంటాయి. తొలి రెండు కేటగిరీల్లోని ఏఐఎఫ్ స్కీములు క్లోజ్ ఎండెడ్‌గా ఉంటాయి. కాల వ్యవధి పరిమితి కనీసం మూడేళ్లుగా ఉంటుంది. మూడో కేటరిగీ ఫండ్లు ఓపెన్ ఎండెడ్ లేదా క్లోజ్ ఎండెడ్గానైనా ఉండొచ్చు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) ఏఐఎఫ్ బెంచ్‌మార్క్ నివేదిక ప్రకారం మూడో కేటగిరీ ఏఐఎఫ్‌లు కాల వ్యవధిని బట్టి 10 శాతం నుంచి 23 శాతం వరకు రాబడులు ఇచ్చాయి. టెక్నాలజీతో అధిక రాబడులకు ఆస్కారం.. సరైన వ్యూహాలు పాటిస్తే ఏఐఎఫ్‌ల ద్వారా మార్కెట్‌కు మించి రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉందని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న షేర్స్బజార్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) భూపాల్ నానావత్ తెలిపారు. ‘‘దాదాపు రూ. 3,900 కోట్ల ఫండ్స్ నిర్వహిస్తున్నాం. కొత్తగా మరో రూ. 1,000 కోట్ల ఫండ్‌కి నిధులను సమీకరిస్తున్నాం. ఏఐఎఫ్ 3 కేటగిరీ కింద లిస్టెడ్ కంపెనీల్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము. అల్గోరిథమ్‌ల వంటి అధునాతన సాంకేతికతలతో, రోబోటిక్ సిస్టమ్‌లతో రిస్కులను సమర్ధంగా ఎదుర్కొనే వ్యూహాలను అమలుపర్చడం ద్వారా ఇన్వెస్టర్లకు అధిక రాబడులను అందిస్తున్నాం. దీనితో 30 శాతం పైగా రాబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది’’ అని ఆయన వివరించారు. వీటిలో రూ. కోటి నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చని, హెడ్జ్ ఫండ్స్ కేటగిరీ కింద షేర్లు, బాండ్లు, డెరివేటివ్‌లు, కమోడిటీలు వంటి విస్తృత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని తెలిపారు. ఫిక్సిడ్ డిపాజిట్లు, మార్కెట్లకు మించిన రాబడులు అందించే సాధనాలేవీ లేవంటూ ఇన్వెస్టర్లలో నెలకొన్న అపోహలను తొలగించేందుకు, ఏఐఎఫ్‌లు వంటి సాధనాలపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నామని నానావత్ చెప్పారు. - భూపాల్ నానావత్, షేర్స్బజార్ ఎండీ -
YSR Rythu Bharosa: వరుసగా ఐదో ఏడాదీ వైఎస్సార్ రైతు భరోసా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా తొలి విడత పెట్టుబడి సాయంతో పాటు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నలకు సీజన్ ముగియక ముందే పంట నష్ట పరిహారం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2023–24 సీజన్‌కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నాలుగేళ్ల వ్యవధిలో సీఎం జగన్ ప్రభుత్వం రైతన్నలకు వివిధ పథకాల ద్వారా రూ.1,61,236.72 కోట్ల మేర నేరుగా సాయాన్ని అందించడం గమనార్హం. నాలుగేళ్లలో రూ.30,985.31 కోట్ల పెట్టుబడి సాయం వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. వెబ్‌ల్యాండ్ ఆధారంగా అర్హులైన భూ యజమానులతో పాటు దేవదాయ, అటవీ (ఆర్ఓఎఫ్ఆర్) భూముల సాగుదారులతోపాటు సెంటు కూడా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున జమ చేస్తున్నారు. ఇలా 2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు సాయం అందించారు. 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్ల మేర సాయం అందింది. 2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022–23లో 51,40,943 మందికి రూ.6944.50 కోట్లు చొప్పున సాయాన్ని ఖాతాల్లో జమ చేశారు. తాజాగా 2023–24కి సంబంధించి 52,30,939 మంది అర్హత పొందగా వీరికి తొలి విడతగా రూ.3923.22 కోట్ల మేర సాయం అందించనున్నారు. ఈ ఏడాది తొలి విడత సాయం కోసం అర్హత పొందిన వారిలో భూ యజమానులు 50,19,187 మంది, అటవీ భూ సాగుదారులు 91,752 మంది ఉండగా, భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులు 1.20 లక్షల మంది ఉన్నారు. 2023–24లో అందించే ఈ తొలివిడత సాయం రూ.3923.22 కోట్లతో కలిపి ఇప్పటివరకు సగటున 52 లక్షల మందికి వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.30,985.31 కోట్ల పెట్టుబడి సాయం అందించనట్లవుతుంది. ఏ సీజన్లో నష్టపోతే అదే సీజన్ ముగియక ముందే.. వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఏ సీజన్లో నష్టపోతే అదే సీజన్ ముగియక ముందే పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందిస్తూ బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల 78,830 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా 51,468 మంది రైతులకు పంట నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి రూ.53.62 కోట్ల పంట నష్టపరిహారాన్ని పెట్టుబడి సాయంతో పాటు బుధవారం జమ చేయనున్నారు. ఈ సాయంతో కలిపి 22.73 లక్షల మంది రైతులకు రూ.1,965.41 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని జమ చేసినట్లవుతుంది. -
ఓపెన్ ఎండెడ్ ఫండ్స్‌తో ఆర్థిక స్థిరత్వానికి రిస్క్
వాషింగ్టన్: అంతర్జాతీయంగా ఓపెన్ ఎండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ గణనీయంగా వృద్ధి చెంది, 2022 మార్చి నాటికి 41 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని.. వీటితో అస్సెట్ మార్కెట్లకు రిస్క్ పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. వీటి కచ్చితమైన నిర్వహణకు వీలుగా అంతర్జాతీయంగా నియంత్రణ సంస్థల మధ్య గొప్ప సమన్వయం అవసరమని అభి ప్రాయపడింది. అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి సంబంధించి తాజా నివేదికను ఐఎంఎఫ్ విడుదల చేసింది. ఫైనాన్షియల్ మార్కెట్లలో ఓఎన్ ఎండ్ ఫండ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. లిక్విడ్ ఆస్తులను నిర్వహిస్తూ, ఇన్వెస్టర్ల నుంచి రోజు వారీ పెట్టుబడుల ఉపసంహరణకు అనుమతిస్తున్నందున, ఏకపక్ష విక్రయాలతో మార్కెట్లలో తీవ్ర కుదుపులు చోటుచేసుకోవచ్చని తెలిపింది. దీనివల్ల ఆటుపోట్లు పెరిగి, ఫైనాన్షియల్ మార్కెట్ల స్థిరత్వానికి ముప్పు పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అన్నవి ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టేందుకు, వాటిని వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉండే పథకాలు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తున్న క్రమంలో ఈ ఫండ్స్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ చోటు చేసుకోవచ్చని, ఇది మార్కెట్లలో ఒత్తిళ్లకు దారితీయవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. సమన్వయంతో నియంత్రించాలి: ‘‘ఈ ఫండ్స్ అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. కనుక వీటి విక్రయాల ప్రభా వం వివిధ దేశాల్లో ఉంటుంది. వీటి కచ్చితమైన నిర్వహణకు వీలుగా అంతర్జాతీయ స్థాయిలో లిక్వి డిటీ నిర్వహణ విధానాలు ఉండాలి. ఇందుకు ని యంత్రణ సంస్థల మధ్య గొప్ప సమన్వయం అవసరం’’అని ఐఎంఎఫ్ తన నివేదికలో సూచించింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశానికి ముందు ఈ నివేదిక విడుదలైంది. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ నుంచి పొంచి ఉన్న సంస్థాగత రిస్క్‌ను తగ్గించేందుకు ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నట్టు గుర్తు చేసింది. ‘‘ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత ఓపెన్ ఎండెడ్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు అనూహ్య వృద్ధిని చూశాయి. వాటి నిర్వహణలోని ఆస్తులు 2008 నుంచి 4 రెట్లు పెరిగి 2022 మార్చి నాటికి 41 ట్రిలియన్ డాలర్లకు చేరాయి’’అని వెల్లడించింది. -
మరింత మంది రైతులకు పెట్టుబడి సాయం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన రైతు ఆవుల గోపిరెడ్డికి రెండేళ్లపాటు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పెట్టుబడి సాయం జమయ్యింది. ఏడాది కాలంగా ఆ మొత్తం జమ కావడం లేదు. ఆరా తీస్తే ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మ్యాపింగ్ కాలేదని చెబుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఎన్పీసీఐ పోర్టల్‌లో అప్లోడ్ చేయడం లేదు. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం సోంపల్లి గ్రామానికి చెందిన కోనేటి రెడ్డప్పకు కూడా గత రెండు విడతల్లో పీఎం కిసాన్ సాయం జమ కాలేదు. పరిశీలిస్తే ఆధార్ ఫెయిల్యూర్ అని వస్తోంది. విశాఖ జిల్లా నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన యు.వరహాలమ్మకు ఈ ఏడాది మూడో విడత సాయం జమ కాలేదు. పరిశీలిస్తే బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పుగా నమోదైనట్టు చూపిస్తోంది. ఇలా లక్షలాది మంది వివిధ కారణాలతో పీఎం కిసాన్ సాయానికి దూరమవుతున్నారు. కొంతమందికి ఏటా మూడు విడతల్లోనూ పెట్టుబడి సాయం జమ కావడం లేదు. మరికొంత మందికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే జమవుతోంది. 13.77 లక్షల దరఖాస్తులు పెండింగ్ విడతకు రూ.6 వేల చొప్పున ఏడాదిలో మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఆ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కలిపి వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పేరిట రూ.13,500 చొప్పున రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తోంది. కేవలం పంట భూమి గల యజమానులకు మాత్రమే కేంద్రం సాయం అందిస్తుంటే.. అటవీ, దేవదాయ భూముల సాగుదారులతో పాటు కౌలుదారులకు సైతం రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది. అయితే, వివిధ సమస్యలు, సాంకేతిక కారణాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 13.77 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత సమస్యలన్నిటినీ ఈ నెల 24వ తేదీలోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. పెండింగ్ దరఖాస్తుల డేటాను మండల వ్యవసాయాధికారులతో పాటు రైతు భరోసా కేంద్రాలకు కూడా పంపించింది. ఆర్బీకేల ద్వారా దరఖాస్తుదారులను గుర్తించి వారికి అవగాహన కల్పించాలని ఆదేశించింది. దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల పరిష్కారంలో ఆర్బీకే సిబ్బంది సాయపడతారు. మండల వ్యవసాయాధికారి వద్ద కిసాన్ పోర్టల్‌లో తగిన వివరాలను అప్లోడ్ చేయించి, ఆ తర్వాత బ్యాంకు ద్వారా ఎన్పీసీఐ పోర్టల్‌తో మ్యాపింగ్ చేయించేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేటగిరీల వారీగా పెండింగ్ ఇలా.. లబ్ధిదారు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి/పెన్షన్‌దారు ఉండటం వంటి కారణాలతో 3,11,158 మందికి చెల్లింపులు నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌ల్యాండ్ పోర్టల్ అనుసంధానం కాలేంటూ 5,32,145 మందికి, ఎన్పీసీఐ మ్యాపింగ్ సమస్యలతో 2.05 లక్షల మందికి, ఆదాయ పన్ను చెల్లింపుదారులంటూ 99,106 మందికి, ఆధార్ విఫలం, అప్డేట్ చేయటం వంటి కారణాలతో 97,215 మందికి, ఆర్టీజీఎస్/ఎన్ఐసీ సమస్యలతో 76,743 మందికి, చనిపోయిన కారణంతో 25,626 మందికి, అకౌంట్ బ్లాక్, ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పుగా నమోదైన కేటగిరీలో 13 వేల మందికి, డూప్లికేట్, ఉమ్మడి ఖాతాలున్నాయనే కారణంతో 8166 మందికి, ఇతర కారణాలతో 7,645 మందికి పీఎం కిసాన్ సాయం అందడం లేదని గుర్తించారు. వీరిలో 10 నుంచి 20 శాతం మందికి రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా సాయం జమవుతోంది. సద్వినియోగం చేసుకోవాలి అర్హులైన ప్రతి ఒక్కరికి పీఎం కిసాన్ సాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం. ఈ నెల 24వ తేదీలోగా పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరించి సాధ్యమైనంత ఎక్కువ మంది లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
రైతు సంక్షేమంలో ఆంధ్రా అద్భుతం
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి చేపట్టిన చర్యలన్నింటినీ మనçస్ఫూర్తిగా సమర్థిస్తున్నా. ప్రత్యేకించి రైతుభరోసా కింద అందిస్తున్న పెట్టుబడి సాయం, ధరల స్థిరీకరణ నిధి, ఉచిత పంటల బీమా వంటి పథకాలు అద్భుతం. వ్యవసాయ సంక్షోభం నుంచి రైతుల్ని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ చాలా బాగున్నాయి. వాటన్నింటినీ ప్రశంసిస్తున్నా. ఇందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు రాకుండాపోతే రైతు పరిస్థితి ఎలా ఉంటుంది? అటువంటప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులదే కదా.. ఆ పని ఏ ప్రభుత్వం చేసినా హర్షణీయమే. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా.ఆ విధానాలన్నీ నచ్చాయి కనుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఏపీ వ్యవసాయమిషన్లో సభ్యుడిగా ఉన్నా.. ప్రముఖ జర్నలిస్టు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, ఏపీ వ్యవసాయ మిషన్ సభ్యుడు డాక్టర్ పాలగుమ్మి సాయినాథ్ మాటలివి. సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు – వ్యవసాయంపై వాటి ప్రభావం గురించి గుంటూరులో ఇటీవల ఏర్పాటుచేసిన జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఈ గ్రామీణ జర్నలిస్టు సాయినాథ్ ‘సాక్షి ప్రత్యేక ప్రతినిధి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వ్యవసాయ చట్టాల రద్దుపై జరుగుతున్న పోరాటం మొదలు మీడియా తీరుతెన్నుల వరకు అనేక అంశాలపై ఆయన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. పార్లమెంటు సంపన్నుల పరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రమైతే వచ్చిందిగానీ స్వేచ్ఛ అందరికీ రాలేదన్నారు. నోరూవాయ లేని సామాన్యుడికి గొంతుకగా ఉండాల్సిన మీడియా సైతం కార్పొరేట్ల కబంధహస్తాల్లో చిక్కిందని చెప్పారు. స్వాతంత్య్రం కోసం రక్తమాంసాలను తృణప్రాయంగా త్యజించిన త్యాగధనులకు ఈవేళ దేశంలో నెలకొన్న పరిస్థితి క్షోభకలిగిస్తోందన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘రైతు కోసం ఏంచేసినా మంచిదే రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ఏర్పాటు హర్షణీయం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడా ఆ హామీని విస్మరించింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగు వ్యయాన్ని తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టింది. వాటిల్లో ఆర్బీకేలు ఒకటి. వాటిని ముందుకు తీసుకెళ్లాలి. వ్యవసాయ మిషన్‌లో నేనూ సభ్యుడిగా ఉన్నా. రైతును క్షేమంగా ఉంచేందుకు ఏంచేసినా మంచిదే. ఆర్బీకేలు ఎలా పనిచేస్తున్నాయో నేను తెలుసుకుంటున్నా. వ్యవసాయ చట్టాలను అందరూ వ్యతిరేకించాలి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఏపీ సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాలి. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశం. వ్యవసాయంపై ఏదైనా చట్టాన్ని తేవాలంటే దేశంలోని మూడింట రెండు వంతుల రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదం తెలపాలి. అటువంటిదేమీ లేకుండానే కేంద్రం చట్టాలు తెచ్చింది. ఈ తీరును నిరసించాలి. ఆ చట్టాల్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. అవి అమల్లోకి వస్తే చిన్న, సన్నకారు రైతులు ప్రత్యేకించి కౌలురైతులు బాగా చితికిపోతారు. అందుకే ఈ చట్టాలను వ్యతిరేకించమని ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అది సంపన్న రైతుల పోరాటమా?.. మతిలేని మీడియా ప్రచారమది.. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో 8 నెలలుగా సాగుతున్న రైతు పోరాటంపై ఐఎంఎఫ్ డైరెక్టర్‌గా ఉన్న సూర్జత్ భల్లా వంటి అపర మేధావులు, కొన్ని మతిలేని మీడియా సంస్థలు పేలేవి అవాకులు చెవాకులు. అది సంపన్న రైతుల పోరాటమని, నాలాంటి వాళ్లు సంపన్న రైతుల సోషలిజం కోసం పోరాడుతున్నామంటూ వెటకారమాడుతున్నారు. వాళ్ల మాదిరిగా కార్పొరేట్ల సోషలిజం కోసం పోరాడలేం కదా.. అందుకే రైతులకు మద్దుతు ఇస్తున్నాం. ఒక్కసారి పంజాబో, హరియాణానో, ఉత్తరప్రదేశో వెళ్లి చూస్తే ఈ పోరాటాన్ని కొనసాగించేందుకు సాదాసీదా రైతులు ఎంత కష్టపడుతున్నారో, తాము తినకపోయినా పర్లేదు, ఈ రూపాయి ఉంచండని ఎంతలా దాతృత్వం చూపిస్తున్నారో తెలుస్తుంది. రైతు ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని ఒక్కరోజులో సంపాయించే వాళ్లకు ఢిల్లీ పోరాటం ఏమర్థమవుతుంది? ప్రజాస్వామ్య చరిత్రలో అదో మహత్తర పోరాటం. దాని విలువ తెలుసుకోవాలంటే చాలా కష్టపడాలి. ప్రమాదంలో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యానికి దేవాలయమంటున్న పార్లమెంటులో సామాన్యులకు చోటులేకుండా పోతోంది. 2004లో 32 శాతం మంది ఎంపీలు కోటీశ్వరులైతే 2019 నాటికి ఇది 88 శాతానికి చేరింది. సమాజంలో అత్యధికులుగా ఉన్న వర్గాలకు వీళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే భయం వేస్తోంది. పేద ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయన్నదే నా ఆవేదన. స్వాతంత్య్ర సమరయోధులు, త్యాగశీలురు ఇటుక ఇటుక పేర్చుకుంటూ వచ్చిన ప్రజాస్వామ్య సౌధాన్ని కూల్చేస్తున్నారు. స్వాతంత్య్రమైతే వచ్చిందిగానీ స్వేచ్ఛ కొందరికే పరిమితమైంది. అయినప్పటికీ ఈ దేశ ప్రజలు చాలా శక్తిమంతులనే నా భావన. 1971లో దక్షిణ ముంబై నుంచి నావల్ టాటా అనే సంపన్నుడు పార్లమెంటుకు పోటీచేశారు. ఆయనకు ఎంత మెజారిటీ రావచ్చని పోల్ పండిట్లు లెక్కిస్తుంటే ఆ ప్రాంత ప్రజలు అనామకుడైన ఓ ట్రేడ్ యూనియన్ లీడర్ కైలాష్ నారాయణ్‌ను గెలిపించారు. అందువల్ల ఈ దేశ ప్రజలపై నాకు అపార విశ్వాసం ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పక తమ ఆయుధాన్ని బయటకు తీస్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు..’ అని సాయినాథ్ పేర్కొన్నారు. పెట్టుబడి సాయం అద్భుతం రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ రైతుభరోసా’ పథకం, ధరల స్థిరీకరణ నిధి, కనీస మద్దతు ధరలకు పంటల కొనుగోలు వంటివి ప్రాధాన్యత కలిగినవి. వాటికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నా. వీటితోపాటు చాలా సానుకూల నిర్ణయాలున్నాయి. కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో ఏడాది కాలంగా అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోలేదు. అవి ఎలా పనిచేస్తున్నాయో చూడాల్సి ఉంది. పథకాల వరకైతే అవి అద్భుతం. -
కౌలు రైతుల ఖాతాల్లో రూ.53.78 కోట్లు జమ
సాక్షి, అమరావతి: అర్హత పొందిన కౌలుదారులు, దేవదాయ భూములు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం సోమవారం వైఎస్సార్ రైతుభరోసా కింద తొలి విడత పెట్టుబడి సాయం రూ.53.78 కోట్లు అందజేసింది. రాష్ట్రంలో గత నెల 12 నుంచి 30 వరకు రైతుభరోసా కేంద్రాల స్థాయిలో నిర్వహించిన సీసీఆర్సీ (సాగు హక్కు పత్రాలు) మేళాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులు 96,335 మంది సీసీఆర్సీలు పొందగా, వారిలో 70,098 మంది రైతు భరోసాకు అర్హత పొందారు. వీరితోపాటు దేవదాయ భూములు సాగు చేస్తున్న 1,616 మంది కూడా అర్హత సాధించారు. ఇలా మొత్తం 71,714 మందికి రూ.7,500 చొప్పున వారి ఖాతాల్లో రూ.53.78 కోట్లు ప్రభుత్వం జమ చేసినట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ తెలిపారు. -
పోలవరం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన తరహాలోనే.. పోలవరం ప్రాజెక్టుకూ నీటిపారుదల విభాగం పనులకు నిధులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను బలపరుస్తూ జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు ఎస్కే హల్దార్ మంగళవారం నివేదిక ఇచ్చారు. యూపీ సింగ్ అధ్యక్షతన పనిచేసే సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా మండలి) 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇక ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కమిటీకి కూడా యూపీ సింగ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం నిధులు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వడం ఇక లాంఛనమే. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ఫైలును కేంద్ర ఆర్థిక శాఖ యథాత«థంగా ఆమోదించి కేంద్ర కేబినెట్‌కు పంపుతుంది. విభజన చట్టం ప్రకారం ఆ ఫైలును కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. దాంతో.. 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి విభజన చట్టం ప్రకారం వంద శాతం ఖర్చుతో పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలి. కానీ చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని పదేపదే కోరుతూ వచ్చారు. ఇందుకోసం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను సైతం తాకట్టు పెట్టారు. ఈ నేపథ్యంలో 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఆ మరుసటి రోజే 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టు నీటిపారుదల విభాగంలో మిగిలిన పనికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామనే మెలిక పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తూ అదే నెల 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ ప్యాకేజీకి ఆమోద ముద్ర వేసింది. అన్యాయంపై నోరుమెదపని వైనం పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేస్తామని.. డిజైన్ మారినా, ధరలు పెరిగి అంచనా వ్యయం పెరిగినా, భూసేకరణ వ్యయం పెరిగినా ఆ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని తేల్చిచెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు 2010–11 ధరల ప్రకారం మొదటిసారి సవరించిన అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లకు 2017 మే 8న కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్‌ను ఇచ్చినప్పుడు కూడా 2014 ఏప్రిల్ 1కి ముందు నీటిపారుదల విభాగానికి చేసిన ఖర్చుపోనూ, ఆ రోజు ధరల మేరకు మిగిలిన మొత్తాన్ని మాత్రమే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అప్పట్లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలు కేంద్ర కేబినెట్లో సభ్యులుగా ఉన్నారు. అయినా ఈ అన్యాయంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదప లేదు. 2013–14 ధరలతో నిధుల విడుదలకు ప్రధానికి లేఖ పైగా 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఆమోదించి నిధులు విడుదల చేయాలని కోరుతూ 2018 జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇదే అంశాలను ఎత్తిచూపుతూ 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించి, ఆమోదించాలని.. అప్పుడే రూ.2,234.28 కోట్లను రీయింబర్స్ చేస్తామని తేల్చిచెబుతూ 2020 అక్టోబర్ 12న కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. దాన్ని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కి పంపిన కేంద్ర జల్ శక్తి శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోవాలని కోరింది. 2017–18 ధరల ప్రకారమే ఇవ్వాలన్న జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రతిపాదనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌లను హుటాహుటిన ఢిల్లీకి పంపారు. కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్రసింగ్ షెకావత్‌లతో వారిద్దరూ సమావేశమై 2017–18 ధరల ప్రకారమే పోలవరానికి నిధులు ఇవ్వాలని కోరారు. కేంద్రం ఆమోదించిన భూసేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, సహాయ పునరావాస (ఆర్ఆర్) ప్యాకేజీ వ్యయం రూ.28,191.03 కోట్లకు పెరిగిందని.. ఈ నేపథ్యంలో 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సాధ్యం కాదని.. 2017–18 ధరల ప్రకారమే నిధులను విడుదల చేసి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని కోరుతూ అక్టోబర్ 31న ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లోపాలను లేఖలో ఎత్తిచూపారు. బేషరతుగా రూ.2,234.28 కోట్లు సీఎం లేఖపై ప్రధాని మోదీ స్పందించారు. కేంద్ర ఆర్థిక శాఖకు మార్గనిర్దేశనం చేశారు. దాంతో రూ.2,234.28 కోట్లను పోలవరానికి బేషరతుగా విడుదల చేస్తూ నవంబర్ 2న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. అదే రోజున సమావేశమైన పీపీఏ సర్వసభ్య సమావేశం కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని తేల్చిచెబుతూ కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక పంపింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లతో సమావేశమైన ప్రతిసారి పోలవరానికి 2017–18 ధరల ప్రకారం నిధులు ఇచ్చి.. శరవేగంగా పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. రూ.2,234.28 కోట్లను ఇప్పటికే రీయింబర్స్ చేసింది. ఫలించిన సీఎం వైఎస్ జగన్ కృషి పోలవరానికి 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేయాలన్న పీపీఏ సిఫారసుపై కేంద్ర జల్ శక్తి శాఖ సీడబ్ల్యూసీ అభిప్రాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే ఎస్కే హల్దార్ మంగళవారం నివేదిక ఇచ్చారు. ప్రాజెక్టు పనుల్లో నీటిపారుదల, నీటి సరఫరా వేర్వేరు కాదని.. రెండు ఒకటేనని పునరుద్ఘాటించారు. నీటిపారుదల విభాగం కిందకు జలాశయం(హెడ్‌వర్క్స్),భూసేకరణ, ఆర్అండ్ఆర్ (సహాయ పునవాస ప్యాకేజీ), కాలువలు, పిల్ల కాలువలు (డిస్ట్రిబ్యూటరీలు) వస్తాయని తేల్చిచెప్పారు. సాగునీటి కాలువల ద్వారానే తాగునీరు.. పారిశ్రామిక అవసరాలకు నీరు సరఫరా చేస్తారని స్పష్టం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకూ నీటిపారుదల విభాగం కింద నిధులు ఇస్తున్నామని ఎత్తిచూపారు. పోలవరం ప్రాజెక్టుకూ అదే రీతిలో నిధులు ఇవ్వాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే పోలవరం అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆర్సీసీ ఆమోదించిన వ్యయానికే.. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ 2019 ఫిబ్రవరి 11న ఆమోదించింది. జాతీయ ప్రాజెక్టుల అంచనా వ్యయం 25 శాతం కంటే పెరిగితే.. వాటిని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ)కి పంపి.. మదింపు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఆర్సీసీకి ప్రతిపాదించారు. కేంద్ర జల్ శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్మోహన్ గుప్తా నేతృత్వంలోని ఆర్సీసీ పోలవరం అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా తేల్చి కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలకు నివేదిక ఇచ్చింది. ఈ అంచనా వ్యయానికే కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తుందని అధికారవర్గాలు తెలిపాయి. -
ఫండ్స్ పెట్టుబడులను సమీక్షిస్తున్నారా..
దీర్ఘకాలంలో ఈక్విటీల్లో మంచి రాబడులకు అవకాశం ఉంటుందన్న అవగాహన పెరుగుతోంది. ఫలితమే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య గత కొన్నేళ్లలో పెరుగుతూ వస్తోంది. కాకపోతే మార్కెట్ పతనాల్లో సిప్ పెట్టుబడుల్లో కాస్త క్షీణత కనిపించడం సాధారణమే. తిరిగి మార్కెట్ల రికవరీతో పరిస్థితి మళ్లీ పూర్వపు స్థితికి చేరుకుంటుంది. అయితే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీయండి, డెట్ ఫండ్స్ కానీయండి.. వాటిల్లో పెట్టుబడులు పెట్టేయడంతో పని పూర్తయినట్టు కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో మన పెట్టుబడులను నిపుణులే నిర్వహిస్తుంటారు కనుక వాటి గురించి ప్రత్యేకంగా చూడాల్సినది ఏముంటుందని అనుకోవడం కూడా సరికాదు. తమ జీవిత లక్ష్యాలకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కోసం ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు తప్పకుండా క్రమానుగతంగా వాటి పనితీరును సమీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్జనా శక్తి పెరగడం, జీవిత అవసరాలు అధికం కావడం.. దీనికితోడు కాస్త రిస్క్ తీసుకుంటే మంచి రాబడులను ఈక్విటీల్లో సొంతం చేసుకోవచ్చన్న అవగాహనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను విస్తృతం చేస్తోంది. అయితే, ఎంతో మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడుతున్నప్పటికీ.. తమ పెట్టుబడులను తరచుగా సమీక్షించుకోవాలన్న విషయం వారికి తెలియడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ, గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. మీ పెట్టుబడులను సమీక్షించుకోవడం అంటే మీ పెట్టుబడులపై ఓసారి లుక్కేయడం కాదు. ఓ పథకంలో పెట్టుబడులపై లాభం లేదా నష్టం వచ్చిందా? అన్న దానికే పరిమితం కానే కాదు. మీ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోను సమీక్షించడం అంటే అందుకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. పెట్టుబడులపై రాబడులు వస్తే ఉత్సాహంతో పొంగిపోయినట్టే.. నష్టాలు కనిపిస్తే అసంతప్తికీ లోనవుతుంటారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా నష్టాలే చూపిస్తుంటే వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం దండగని భావించి అమ్మేయడం మాత్రం సరికాదు. అదే సమయంలో మార్కెట్లు పతనమయ్యాయా? అన్నది చూడాలి. ఇతర మ్యూచువల్ ఫండ్స్‌లో అదే సమయంలో రాబడుల తీరు ఎలా ఉందీ పరిశీలించాలి. ఫండ్స్ స్కీమ్ విధానాల్లో మార్పులు జరిగాయా? అన్నది చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే ఎక్స్పెన్స్ రేషియో (ఫండ్స్ పెట్టుబడుల నిర్వహణకుగాను వసూలు చేసే చార్జీ), రిస్క్, స్కీమ్ సైజు, అస్సెట్ రేషియో, రిస్క్ అంశాలు మారిపోయాయా అన్న దానిపై దృష్టి సారించాలి. అంతేకాదు, ఇన్వెస్టర్ ఏ అంశాలను చూసి అయితే ఆ పథకాన్ని ఎంచుకున్నారో.. అనంతర కాలంలో ఆ అంశాల్లో మార్పులు వచ్చాయేమో పరిశీలించడం మర్చిపోవద్దు. సాధారణంగా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మంచి రాబడుల తీరును (ఇతర పథకాలు, బెంచ్ మార్క్ కంటే మెరుగైన పనితీరు) చూపించే ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్కీమ్ ఉద్దేశాల్లో మార్పులు జరగకపోయి, ఇన్వెస్టర్ తాను ఏ అంశాలను అయితే మెచ్చి ఆ పథకాలను ఎంచుకున్నారో... అవేమీ మారనప్పుడు, కేవలం నష్టాలను చూపిస్తుంటే వాటి నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదన్నది నిపుణుల సూచన. కేవలం అద్భుత రాబడులనే చూసి పథకం ఎంచుకుంటే మాత్రం వాటిని ప్రత్యేకంగా సమీక్షించాల్సి ఉంటుంది. సమీక్ష ఏదైనా కానీయండి.. స్వల్ప కాలంలో రాబడుల తీరు నచ్చక ఆయా పథకాలను మార్చేస్తే పెట్టుబడులకు విజయం అందడం కష్టమేనని గుర్తించాలి. మరీ ముఖ్యంగా తమ జీవిత లక్ష్యాల్లో మార్పులు సంభవించినప్పుడు ఇన్వెస్టర్లు తప్పకుండా తమ పెట్టుబడులను సమీక్షించుకోవడం అవసరమని నిపుణుల సూచన. ఉదాహరణకు రిటైర్మెంట్ (60 ఏళ్లు వచ్చే నాటికి) కోసమని పెట్టుబడులు మొదలు పెట్టారనుకుంటే.. అనంతర కాలంలో 60 ఏళ్ల కంటే ముందుగానే రిటైర్ అవ్వాలని భావిస్తే అప్పుడు తప్పకుండా పోర్ట్ ఫోలియోలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడుల్లో సమతుల్యం కూడా అవసరం. పోర్ట్ ఫోలియోను వార్షికంగా ఒకసారి సమీక్షించుకోవడం వల్ల పన్నుల పరంగా ప్రయోజనం కూడా ఉంటుంది. ఆర్థిక లక్ష్యాలు, వాటికి తగిన పెట్టుబడుల సాధనాల ఎంపిక అనేది ఎక్కువ మంది ఇన్వెస్టర్లలో కనిపించదన్నది వాస్తవం. కానీ, దీన్ని ఎక్కువ మంది అంగీకరించరు లేదా గుర్తించరు. అందుకే ఈ విషయంలో ఆర్థిక సలహాదారుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని గుర్తించాలి. -
మోదీ ‘రియల్’ బూస్ట్!
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం, నిధుల లభ్యత తగినంత అందుబాటులో లేక నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి ఒక పరిష్కారంతో కేంద్రంలోని మోదీ సర్కారు ముందుకు వచ్చింది. రూ.25,000 కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్)ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. నిలిచిన 1,600 ఇళ్ల ప్రాజెక్టులు (అందుబాటు ధరల ప్రాజెక్టులు, మధ్య, తక్కువ ఆదాయ వర్గాల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులు) పూర్తి అయ్యేందుకు సాయపడుతుందని పేర్కొంది. మొండి బకాయిలు (ఎన్పీఏలు), దివాలా చర్యల కోసం దాఖలైన ప్రాజెక్టులూ ఈ నిధిని పొందేందుకు అర్హమైనవిగా తాజాగా నిర్ణయించింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరాలు వెల్లడించారు. రూ.25,000 కోట్ల ఏఐఎఫ్ నిధిలో కేంద్రం తన వాటా కింద రూ.10,000 కోట్లు సమకూరుస్తుందని, మిగిలిన మొత్తాన్ని ఎల్ఐసీ, ఎస్బీఐ అందిస్తాయని తెలిపారు. నిలిచిపోయిన మొత్తం 4.58 లక్షల ఇళ్ల యూనిట్లను పూర్తి చేసే లక్ష్యంతోపాటు, ఉపాధి కల్పన, సిమెంట్, ఐరన్, స్టీల్ రంగాల్లో డిమాండ్ పున రుద్ధరణకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ పథకం గురించి సెప్టెంబర్ 14నే ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. అయితే, రుణాలు చెల్లించలేక ఎన్పీఏలుగా మారిన ప్రాజెక్టులు, ఎన్సీఎల్టీ వద్దకు వెళ్లిన ప్రాజెక్టులను నాడు మినహాయించారు. తాజాగా వీటికీ ఏఐఎఫ్ ద్వారా నిధులివ్వాలని నిర్ణయించారు. సవరించిన ఈ పథకానికి ప్రధాని మోదీ అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సీతారామన్ తెలిపారు. కాకపోతే రెరా రిజిస్ట్రేషన్ ఉండి, సానుకూల నికర విలువ ఉ న్న ప్రాజెక్టులకే నిధుల సాయం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. సౌర్వభౌమ, పెన్షన్ ఫండ్స్ భాగస్వామ్యంతో ఈ నిధి మొత్తాన్ని పెంచే అవకాశం కూడా ఉందన్నారు. రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేసి, అవి స్వాధీనం కాకుండా ఈఎంఐలు చెల్లించే వారి సమస్యను పరిష్కరించినట్టు చెప్పారు. కొనుగోలుదారులకు ఉపశమనం ప్రభుత్వ నిర్ణయం ఇళ్ల కొనుగోలుదారుల (డబ్బులు చెల్లించి ఇళ్లను పొందలేనివారు)కు ఉపశమనం కల్పిస్తుంది. డిమాండ్ పడిపోయిన రియల్ ఎస్టేట్ రంగంలో సెంటిమెంట్‌కు ఊతం ఇస్తుంది. – అనుజ్‌పూరి, ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ అన్‌రాక్ చైర్మన్ సమస్యకు పరిష్కారం ఇళ్ల కొనుగోలుదారుల దీర్ఘకాలిక సమస్యకు ఇది పరిష్కారం తో పాటు ప్రయోజనం కూడా చేకూరుస్తుంది. తొలుత ప్రకటన(సెప్టెంబర్ 14)లో చేసిన మార్పు ఆహ్వాననీయం. ఇప్పుడు నిధుల సాయం పొందేందుకు నిర్దేశించిన ఏకైక అర్హత సానుకూల నికర విలువ కలిగి ఉండడమే... ఎన్పీఏ లేదా ఎన్సీఎల్టీ ముందున్న ప్రాజెక్టు అయినా సరే, నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయించడం కోసమే ఈ నిధిని ఏర్పాటు చేసినట్టు భరోసా ఇస్తోంది. – జక్సయ్ షా, క్రెడాయ్ చైర్మన్ -
కాలంతోపాటే ప్రణాళిక
రుణం తీసుకొని ఇన్వెస్ట్ చేయొద్దు. ఆర్జిస్తున్న దాని కంటే తక్కువే ఖర్చు పెట్టు. ఇవి తరచుగా వినిపించే మనీ సూత్రాలు. వీటికి కట్టుబడి నడుచుకుంటే ఆర్థిక వ్యవహారాలు తప్పుదోవలో వెళ్లకుండా చూసుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక విషయంలో ఇలాంటివే ఎన్నో సాధారణ సూత్రాలు ఉన్నాయి. వీటిని కాలంతోపాటే వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా ఉన్నతీకరించుకుని ఆచరణలో పెడితేనే ఆశించినంత ప్రయోజనం నెరవేరుతుందని ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తున్నారు. ఆధునిక కాలంలో మార్చుకోదగిన సిద్ధాంతాల గురించి వారు ఇలా తెలియజేస్తున్నారు... వేతనంలో రిటైర్మెంట్కు పొదుపు నెలవారీ ఆర్జనలో 10 శాతాన్ని పెన్షన్ కోసం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలన్నది గతంలోని సూత్రం. రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతమైన జీవనం కోసం ఈ మాత్రం పొదుపు చేసుకోవాలి. కానీ, పెరుగుతున్న జీవన ప్రమాణాలతో ఆయుర్దాయమూ అధిగమవుతోంది. కనుక వేతనంలో కనీసం 20 శాతాన్ని రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆప్టిమా మనీ మేనేజర్స్ వ్యవస్థాపకుడు మత్పాల్ తెలిపారు. జీవన వ్యయం పెరిగిపోతున్నందున, వైద్య వ్యయాలు కూడా భారమవుతుండడంతో రిటైర్మెంట్కు అధిక పొదుపు అవసరమని గుర్తించిన చరణ్ (35), వేతనం వచ్చిన వెంటనే 20 శాతాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపాడు. ఈక్విటీల్లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి? సాధారణంగా తమ పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం కాకుండా డెట్, తదితర సాధనాల మధ్య కేటాయింపులు చేసుకోవాలని, తద్వారా రిస్క్‌ను సమతుల్యం చేసుకోవాలని ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తుంటారు. మరి ఈక్విటీల్లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలన్న ప్రశ్న తలెత్తిత్తే... 100 నుంచి తమ వయసును తీసివేయగా మిగిలే అంత శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది ఓ ప్రాథమిక సూత్రం. ఉదాహరణకు చరణ్ వయసు 35 ఏళ్లు. 100లో 35 తీసివేస్తే 65 వస్తుంది. కనుక తన మొత్తం పెట్టుబడుల్లో గరిష్టంగా 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే, కాలంతోపాటే ఇందులోనూ మార్పులు అవసరమన్నది నిపుణుల భావన. ఆర్జన ఆగిపోయిన తర్వాత కూడా 25 ఏళ్ల వరకు జీవించాల్సి వస్తున్న పరిస్థితుల్లో... ఈక్విటీలకు అధిక కేటాయింపులు అవసరమని సూచిస్తున్నారు. కనుక 100 కాకుండా 120 స్థాయిని నిర్ణయించుకోవాలన్నది వారి సూచన. ఈ నేపథ్యంలో 120 నుంచి తమ వయసును మినహాయించి మిగిలే అంత మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ముంబైకి చెందిన చేతన్ (39) ప్రస్తుతానికి పలు మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ప్రతీ నెలా రూ.50,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అంటే మొత్తం పెట్టుబడుల్ని తీసుకెళ్లి ఈక్విటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాడు. దీనికి బదులు నూతన సూత్రం ప్రకారం 120 నుంచి చేతన్ వయసు 39ని తీసివేసి చూస్తే 81 వస్తుంది. కనుక పెట్టుబడిచేయదగిన మొత్తంలో 81 శాతం మాత్రమే.. ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను రూ.40,000కు పరిమితం చేసుకోవాలి. మరింత చిన్న వయసుల్లో వారు (25–35 వయసు) ఈక్విటీలకు 85–90 శాతాన్ని, డెట్‌కు 10 శాతాన్ని కేటాయించుకోవచ్చని మనీ మ్యాటర్స్ సీఈవో తేజల్ గాంధీ సూచించారు. 60 ఏళ్ల తర్వాత కూడా ఈక్విటీలకు 25–30 శాతం కేటాయింపులు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 50–20–30 సూత్రం 50–20–30 సూత్రం తెలుసు కదా? పన్ను బాధ్యతలు పోను మిగిలే నెలవారీ ఆదాయంలో 50 శాతాన్ని కనీస అవసరాల కోసం వినియోగించుకోవాలి. 20 శాతాన్ని భవిష్యత్తు లక్ష్యాలు, అవసరాల కోసం కేటాయించుకోవాలి. మిగిలిన 30 శాతాన్ని తమ విచక్షణ అవసరాల కోసం ఖర్చు చేసుకోవచ్చన్నది ఈ సూత్రం అంతరార్థం. అయితే, మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ఇందులో భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాల కోసం 20% చాలదని, కనీసం 30% అయినా కేటాయించుకోవాలని ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తున్నారు. వీలయితే 40% కేటాయించుకోవడం మంచిదన్నది సలహా. మంచి వేతనాల్లో ఉన్న వారికి ఇది సాధ్యమే. జీవిత బీమా జీవిత బీమా అవసరాన్ని నేడు చాలా మంది గుర్తిస్తున్నారు. అయితే, పాలసీ తీసుకుంటున్నారు కానీ అవసరమైన మొత్తానికి బీమా రక్షణ ఉండేలా జాగ్రత్త వహిస్తున్న వారు కొద్ది మందే. నిజానికి ఆర్జించే వ్యక్తికి ఎంత మేర జీవిత రక్షణ ఉండాలి? అన్న సందేహం ఎదురైతే... వార్షిక వేతనానికి కనీసం 10 రెట్లు అయినా తీసుకోవాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తుంటారు. అయితే, అందరికీ వర్తించే ఉమ్మడి సూత్రం కాదిది. విడిగా వ్యక్తుల అవసరాలు, రుణాలు, వారిపై ఆధారపడిన వారు ఎంత మంది ఉన్నారు తదితర ఎన్నో అంశాలు జీవిత బీమా రక్షణ మొత్తాన్ని నిర్ణయిస్తాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే ఆర్జన మొదలు పెట్టి, తక్కువ వేతనంలో ఉన్న యువకులకు జీవిత బీమా కొంచెం అధికంగానే ఉండాలంటున్నారు నిపుణులు. ‘‘చిన్న వయసులో బీమా పాలసీ తీసుకుంటుంటే... బీమా కవరేజీ వార్షిక వేతనానికి కనీసం 20 రెట్లు అయినా ఉండాలి. ఎందుకంటే చిన్న వయసులో ఉన్న వారికి వేతనంలో పెరుగుదల వేగంగా ఉంటుంది. దీనికి తగినట్టు జీవిత బీమా కవరేజీ పెంచుకుంటూ వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు’’ అని మత్పాల్ వివరించారు. అయితే 40 ఏళ్లకు పైగా వయసున్న వారు మాత్రం ఇంతకుముందు మాదిరే వార్షిక వేతనానికి పది రెట్ల మొత్తం బీమా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. హెల్త్ కవరేజీ వైద్య రంగంలో వస్తున్న అత్యాధునిక చికిత్సలు ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి బయటపడేస్తున్నాయి. వైద్య రంగంలో పరిశోధనలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ, అత్యాధునిక చికిత్సా విధానాలు అమల్లోకి వస్తుండడంతో వాటి వ్యయాలు కొంచెం ఖరీదుగానే ఉంటున్నాయి. కనుక నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.3–5 లక్షల వైద్య బీమా అవసరం అని భావిస్తుండగా, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 15 శాతంగా ఉంటుందన్న నేపథ్యంలో పట్టణాల్లో నివసించే వారికి ఇది చాలదంటున్నారు నిపుణులు. దీన్ని కనీసం రూ.10 లక్షలకు పెంచుకోవాలని సూచిస్తున్నారు. కిరణ్ కుమార్ తల్లికి అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చింది. బీమా కవరేజీ రూ.3 లక్షలు ఏ మాత్రం సరిపోలేదు. దీంతో హెల్త్ కవరేజీ మరింత అవసరమని అర్థం చేసుకున్న అతడు రూ.25 లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్ కవరేజీని పెంచుకున్నాడు. ఇందులో తన తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలకు కూడా కవరేజీ ఉండేలా చూసుకున్నాడు. క్రిటికల్ ఇల్నెస్ పాలసీల ప్రాముఖ్యతనూ కూడా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలం పాటు చికిత్స అవసరమైతే ఇవి ఆదుకుంటాయని, సంప్రదాయ పాలసీలు దీర్ఘకాలం పాటు చికిత్సా వ్యయాలను తీర్చలేవని గుర్తు చేస్తున్నారు. అత్యవసర నిధి ఎంత మొత్తం? ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు లేదా వైద్య పరమైన ఆకస్మిక చికిత్సలు అవసరం పడినప్పుడు లేదా ఇతర ఆర్థిక అత్యవసరాల్లో ఆదుకునేందుకు అత్యవసర నిధిని తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలన్నది ఓ ఆర్థిక సూత్రం. కనీసం మూడు నుంచి ఆరు నెలల కుటుంబ అవసరాలకు సరిపడా మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలో అత్యవసర నిధిగా ఉంచుకోవాలన్నది ఇప్పటి వరకు చెబుతున్న సూత్రం. కానీ, దీన్ని తొలి అడుగుగానే చూడాలంటున్నారు. ముందు ఆరు నెలల మొత్తాన్ని సమకూర్చుకున్న తర్వాత దానిని కనీసం 9 నెలల అవసరాలకు సరిపడా మొత్తానికి పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఫార్మా కంపెనీలో పనిచేసే వైభవ్ కుమార్ (36) నెలవారీ వేతనం రూ.50,000. కానీ, ఇతడు రూ.4.5 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంచాడు. దీనికి అదనంగా అతడికి రూ.10 లక్షలకు హెల్త్ ప్లాన్ కూడా ఉంది. అయితే, ఫిక్స్డ్ డిపాజిట్లలో రాబడి తక్కువ కనుక ఒక నెల అవసరాలకు సరిపడా ఎఫ్డీగా ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది సూచన. -
రైతుల ఖాతాల్లో రూ.700 కోట్లు జమ
సాక్షి, హైదరాబాద్: రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పెట్టుబడి సొమ్ము చేరుతోంది. రబీ రైతుబంధు సొమ్ము రెండో రోజు మంగళవారం నాటికి రూ.700 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 52 లక్షల మందికి రబీ పెట్టుబడి సొమ్ము అందజేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. వారందరి బ్యాంకు ఖాతాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 17 లక్షల మంది రైతుల ఖాతాలు సేకరించి క్షుణ్నంగా పరిశీలించారు. ఇప్పటివరకు ఆరున్నర లక్షల ఖాతాల్లో సొమ్ము జమ చేశారు. దీంతో రైతులు బ్యాంకుల వద్దకు క్యూలు కడుతున్నారు. దీపావళి నాటికి రైతులందరి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని సర్కారు కృతనిశ్చయంతో ఉంది. గత ఖరీఫ్‌లో ప్రభుత్వం రైతులకు పెట్టుబడి చెక్కులను గ్రామసభల్లో అందజేసిన సంగతి తెలిసిందే. దాదాపు 51 లక్షల మంది రైతులకు రూ. 5,200 కోట్ల వరకు ప్రభుత్వం అందజేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రబీలో చెక్కుల రూపం లో ఇవ్వకూడదని, హడావుడిగా పంపిణీ చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది. దీంతో రైతుల ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమ చేయాలని తెలిపింది. దీంతో వ్యవసాయశాఖ రైతుల బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ–కుబేర్ సాఫ్ట్వేర్ ద్వారా రైతులకు పెట్టుబడి సొమ్ము బ్యాంకులకు పంపిస్తున్నారు. -
రైతు సొమ్ము.. రాబందుల పాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు సొమ్ముపై రాబందుల కన్ను పడింది. రైతులకు పెట్టుబడి కింద ఇస్తున్న సొమ్మును కొన్నిచోట్ల అక్రమార్కులు కాజేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో పెట్టుబడి మొత్తాన్ని స్వాహా ఘటన వెలుగు చూడటంతో సర్కారు ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఎంతో పకడ్బందీగా పెట్టుబడి చెక్కులను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. అక్రమాలు జరగడం ఆగలేదు. ఇందులో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు కీలక సూత్రధారులుగా ఉన్నట్లు తెలిసింది. దీంతో సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. పెట్టుబడి సొమ్మును బ్యాంకు, రెవెన్యూ అధికారులతోపాటు బయటి వ్యక్తులు అక్రమంగా కొట్టేసినట్లు ప్రాథమిక విచారణలో ఈ మేరకు వెల్లడైంది. సుమారు రూ.70 లక్షలు కాజేసినట్లు నిర్ధారణ అయింది. వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యం కూ డా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగాయా అన్న కోణంలోనూ ప్రభుత్వం దృష్టి సారించింది. మిగిలిన చెక్కులు 7.7 లక్షలు గత మేలో ప్రభుత్వం రైతుబంధు చెక్కుల పంపిణీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం 58.16 లక్షల మంది పట్టాదారులకు 58.81 లక్షల చెక్కులు ముద్రించారు. 51.11 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. 7.7 లక్షల చెక్కులు పంపిణీ కాకుండా మిగిలిపోయాయి. ఇందులో చనిపోయిన వారి పేరు మీద, భూమిని మొత్తం అమ్ముకున్న వారి పేర్ల మీద, విస్తీర్ణం ఉన్న దాని కంటే ఎక్కువ, తక్కువగా పడి మరికొందరి పేర్ల మీద చెక్కులు ముద్రితమయ్యాయి. అందులో విదేశాల్లో ఉన్నవారి పేరు మీద దాదాపు 70 వేలు, చనిపోయిన రైతుల పేరు మీద లక్షకు పైగా ఉన్నట్లు అంచనా. కొన్ని రకా ల చెక్కుల్లో లోపాలున్నందున వాటిని తీసుకొచ్చే రైతులకు సొమ్ము చెల్లించవద్దని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీచేసింది. వాటిని విత్‌హోల్డ్‌లో పెట్టా లని ఆదేశించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు నల్లగొండలో ‘విత్ హోల్డ్’లో ఉన్న 551 చెక్కులను నగదుగా మార్చుకుని పంచుకున్నారు. నల్లగొండలోని నాంపల్లి మండలంలో ఎస్బీఐ బ్యాం కు క్యాషియర్, ప్రభుత్వాధికారులు, బయటి వారితో కలిసి సొమ్మును కాజేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పెద్ద అడిశెర్లపల్లి, చింతపల్లి, నాంపల్లి, గుర్రంపోడు, దేవర కొండ, చండూరు మండలాలకు చెందిన విత్‌హోల్డ్‌లో ఉన్న రైతుబంధు చెక్కులు డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ సంఘటనలు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు నుంచి ఎలా కొట్టేశారు నిబంధనల ప్రకారం సంబంధిత పట్టాదారు రైతు మాత్రమే చెక్కు తీసుకుని బ్యాంకుకు వెళ్లాలి. నగదు తీసుకునే సమయంలో పట్టాదారు పాసు పుస్తకం చూపించాలి. ఒకవేళ పాసు పుస్తకం రానట్లయితే ఆధార్ కార్డు, ఓటరు ధ్రువీకరణ కార్డును చూపించాల్సి ఉంది. కాని ఇవేమీ పట్టించుకోకుండానే నాంపల్లి మండల ఎస్బీఐ క్యాషియర్.. విత్‌హోల్డ్‌లో ఉంచిన రైతుబంధు చెక్కులను రెవెన్యూ, ఇతర ప్రభుత్వాధికారులతో కలిసి అక్రమంగా నగదులోకి మార్చారు. అయితే రైతుల వద్ద ఉన్న చెక్కులను రెవెన్యూ అధికారులు, బ్యాంకర్లు ఎలా కొట్టేశారో ఇప్పటికీ తేలలేదు. మరోవైపు మిగిలిపోయిన చెక్కులను ప్రభుత్వం ఇంకా జిల్లాల్లోనే ఉంచడంలో అర్థం లేదన్న చర్చ జరుగుతోంది. పైగా విదేశాల్లో ఉన్న పట్టాదారు చెక్కులను పంపిణీ చేయడంలో తాత్సారం చేస్తుండటంపైనా విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్‌ను ఆదేశించాం పెట్టుబడి చెక్కుల సొమ్మును కాజేసిన అంశంపై విచారణ చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాం. ఇందులో రెవెన్యూ, బ్యాంకు అధికారులు బాధ్యులుగా ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. ఇప్పటికే బ్యాంక్ క్యాషియర్‌పై కేసు నమోదైంది. కలెక్టర్ నుంచి రెండు, మూడు రోజుల్లో నివేదిక రానుంది. పార్థసారథి, ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ -
పసివాడే పట్టాదారుడు
జగదేవ్‌పూర్(గజ్వేల్): పదేళ్ల వయస్సు లేని బాలుడికి అధికారులు రైతుబంధు పథకం కింద పాస్‌పుస్తకం, పెట్టుబడి సాయం చెక్కు అందించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొంతం కవిత, నరేశ్ దంపతులకు నిర్మల్ (8), నిరంజన్(10) అనే కుమారులు ఉన్నారు. వీరి తాత బాల్‌నర్సయ్య తన మనుమల పేరున ఒక్కొక్కరికి ఎకరా 5 గుంటల భూమిని రెండేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేయించారు. పట్టాదారుకే సాయం అందించాలన్న నిబంధన మేరకు శనివారం అధికారులు నిర్మల్‌తోపాటు నిరంజన్‌కు పెట్టుబడి సాయం చెక్కులను అందించారు. -
గల్ఫ్‌లో ఉన్న రైతులకూ పెట్టుబడి సాయం
సిరిసిల్ల: గల్ఫ్‌లో ఉన్న రైతులకు కూడా ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన ‘రైతుబంధు పథకంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు స్థానికంగా ఉన్న రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 17వ తేదీ తర్వాత గల్ఫ్‌లో ఉన్న వారికి.. చిన్నచిన్న సమస్యలతో ఆగిన వారికి చెక్కులను అందిస్తామని మంత్రి వెల్లడించారు. రైతులందరికీ రైతుబంధు పథకం వర్తిస్తుందన్నారు. ఇందులో ఆ పార్టీ, ఈ పార్టీ అనే భేదంలేదన్నారు. ఇంతపెద్ద కార్యక్రమంలో చిన్నచిన్న పొరపాట్లు ఉంటే.. సవరించేందుకు ప్రభుత్వం, యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. ఎవరైనా గొడవలు చేసినా భయపడేది లేదని, ధర్నాలు చేయించినా.. ఆందోళన పడొద్దని మంత్రి కోరారు. అలాగే కేవలం చెక్కులు ఇచ్చి వెళ్లిపోకుండా ప్రతి రైతును కలవాలని కేటీఆర్ సూచించారు. టీఆర్ఎస్ నాయకులు బస్సుల్లో రావాలి. ఈనెల 10న హుజూరాబాద్‌లో జరిగే సీఎం సభకు జిల్లా నుంచి 25వేల మంది రైతులు రావాలని మంత్రి కోరారు. టీఆర్ఎస్ నాయకులు కార్లలో కాకుండా రైతులతోపాటు బస్సుల్లో రావాలన్నారు. ఏ ఊరి నాయకులు ఆ ఊరి రైతులతో కలసి రావాలని, బస్సులకు మామిడి తోరణాలు కట్టుకుని దసరా పండుగలాగా.. సంతోషంగా రావాలని సూచించారు. రెండురోజుల పాటు ఇసుక లారీలు, గ్రానైట్ లారీలను ఆపి వేయాలని ఎస్పీ రాహుల్‌హెగ్డేను కోరారు. అందరూ క్షేమంగా ఇల్లు చేరే విధంగా టీఆర్ఎస్ నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు. సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు. ఎండల నేపథ్యంలో చెక్కుల పంపిణీని ఉదయం, సాయంత్రం వేళల్లో చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
తొలి విడత 20.93 లక్షల మంది రైతులకు ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: ‘రైతుబంధు’పెట్టుబడి సాయం అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 19 నుంచి పెట్టుబడి సొమ్మును రైతులకివ్వాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొదటి విడత 20.93 లక్షల మంది రైతులకు పెట్టుబడి అందజేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖ రైతుల సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించి శుక్రవారం బ్యాంకులకు అందజేసింది. మొదటివిడత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన 3,275 గ్రామాల రైతుల పేర్లను బ్యాంకులకు ఇచ్చింది. ఎకరాలు, గుంటలు, ఎవరికి ఎంతెంత సొమ్ము వంటి వివరాలతో అత్యంత సెక్యూరిటీ కోడ్‌తో పెన్‌డ్రైవ్, సీడీ, మెయిల్ పద్ధతుల్లో బ్యాంకులకు అందజేసింది. తమకిచ్చిన వివరాల ఆధారంగా రైతుల పేరుతో బ్యాంకులు చెక్కులను ముద్రిస్తాయి. శనివారం నుంచే చెక్కులను ముద్రించే ప్రక్రియను ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు, సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఐవోబీలు ప్రారంభిస్తాయి. చెక్కులపై వ్యవసాయశాఖ కమిషనర్ డిజిటల్ సంతకం ముద్రిస్తారు. పెట్టుబడి సొమ్మును మూడు విడతలుగా రైతులకు అందజేస్తారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సమస్యలు ఉన్నందున అక్కడి రైతుల పేర్లను బ్యాంకులకు వ్యవసాయశాఖ అందజేయలేదు. మరోసారి పరిశీలించాకే ఆ జిల్లాల సమాచారాన్ని బ్యాంకులకు ఇస్తారు. -
అన్నదాతా సుఖీభవ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అన్నదాతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రైతుల కోసం కొత్తగా ప్రారంభించే రెండు పథకాలకు భారీగా నిధులు కేటాయించింది. ఖరీఫ్, రబీలకు కలిపి ఎకరాకు రూ. 8 వేల చొప్పున అందజేసే ‘పెట్టుబడి’ పథకానికి రూ. 12 వేల కోట్లు కేటాయించింది. అందులో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ. 1,854 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 1,089.60 కోట్లు కేటాయింపులు చేసింది. ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు 72 లక్షల మంది రైతులకు 1.65 కోట్ల ఎకరాల భూమికి పెట్టుబడి పథకం కింద సీజన్‌కు రూ. 4 వేల చొప్పున ప్రభుత్వం అందించనుంది. వచ్చే నెల 19 నుంచి పెట్టుబడి సాయాన్ని రైతులకు అందిస్తారు. రబీ సీజన్‌కు నవంబర్‌లో పెట్టుబడి సాయం అందజేస్తారు. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. చెక్కుల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం ఇస్తారు. ఖరీఫ్‌లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందజేస్తారు. 1.65 కోట్ల ఎకరాలకు రైతులకు రూ. 6,600 కోట్లు అందజేస్తారు. ఇక మిగిలే రూ. 5,400 కోట్లు రబీలో రైతులకు ఇస్తారు. రబీలో పంట సాగు చేసే రైతులను గుర్తించి వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందజేస్తారు. రైతు బీమాకు రూ. 500 కోట్లు రైతుల కోసం కొత్త బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేవలం పంటలు నష్టపోతేనే వాటి కింద రైతుకు బీమా పరిహారం ఇచ్చేవారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎక్స్‌గ్రేషియా కింద రూ. 6 లక్షలు ఇచ్చే అవకాశం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకంలో అన్నదాతలు ఒకవేళ సాధారణ మరణం పొందినా, ఆత్మహత్యలు చేసుకున్నా, ప్రమాదంలో చనిపోయినా కూడా ఆయా రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు. ఇందుకోసం బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించారు. ఆ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 72 లక్షల మంది రైతుల తరపున ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లిస్తుంది. కాగా, కీలకమైన రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌కు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు. కార్పొరేషన్‌కు ప్రభుత్వం ఇప్పటికే రూ. 200 కోట్లను మూలనిధి కింద విడుదల చేయడంతో బడ్జెట్లో కేటాయింపులేవీ చూపించలేదు. వ్యవసాయానికి రూ.9 వేల కోట్లు అదనం 2017–18 బడ్జెట్‌కంటే భారీగా పెరిగిన నిధులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం వ్యవసాయానికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. 2017–18 బడ్జెట్లో రూ.6,498.15 కోట్లు కేటాయిస్తే, 2018–19 ప్రగతి బడ్జెట్లో రూ.15,511 కోట్లు కేటాయించింది. ఏకంగా రూ.9,013 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం. అందులో ఈసారి కొత్తగా ప్రవేశపెట్టబోయే ‘పెట్టుబడి’ పథకానికి రూ.12 వేల కోట్లు, రైతు బీమాకు రూ.500 కోట్లు కేటాయించారు. ఇవిగాక వ్యవసాయ యాంత్రీకరణకు 2017–18 బడ్జెట్లో రూ.336.80 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో రూ.522 కోట్లు కేటాయించారు. ఈసారి వరినాటు యంత్రాలను రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల వరకు పంచేందుకు సర్కారు సన్నద్ధం కావడంతో ఈ మేరకు నిధులు కేటాయించారు. ఇక పంటల బీమా పథకానికి గత బడ్జెట్లో రూ.343 కోట్లు కేటాయిస్తే, ఈసారి 500 కోట్లు కేటాయించారు. విత్తన సరఫరాకు గత బడ్జెట్లో రూ.138 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్లో రూ.178 కోట్లు కేటాయించారు. రైతు వేదికల కోసం రూ.158 కోట్లు కేటాయించారు. ఉద్యానశాఖకు 2017–18 బడ్జెట్లో రూ.207 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్లో రూ.376 కోట్లు కేటాయించడం గమనార్హం. అయితే వ్యవసాయ మార్కెటింగ్‌కు 2017–18 బడ్జెట్లో రూ. 457 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్లో కేవలం రూ.122 కోట్లు మాత్రమే కేటాయించారు. ఏకంగా రూ. 335 కోట్లు తగ్గించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా.. పెట్టుబడి పథకం, రైతు బీమా వంటి రెండు పథకాలు బడ్జెట్లో ప్రవేశపెట్టడం అభినందనీయం. ఈ బడ్జెట్ పూర్తిగా రైతును రాజుగా చేసేదిలా ఉంది. ఈ రెండు పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ఇక రైతు బీమా పథకం అనేది ఆయా కుటుంబాలకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. సన్న చిన్నకారు రైతులకు పెట్టుబడి పథకం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అనేకమంది రైతులు సాగు చేసేందుకు ముందుకు వస్తారు. – డాక్టర్ పిడిగం సైదయ్య, ఉద్యాన వర్సిటీ పెట్టుబడి పథకంపై అనుమానాలు పెట్టుబడి పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఖరీఫ్‌కు అందరికీ ఇచ్చినా, రబీలో సాగు చేసే రైతులకే ఇస్తారు. అప్పుడు ఇంత సొమ్ము అవసరంలేదు. ఇందులో ఏదో మతలబు ఉంది. రైతులను మభ్య పెట్టేందుకే సర్కారు పెట్టుబడి పథకానికి ఎక్కువ నిధులు కేటాయించినట్లు చూపిస్తుంది. – సారంపల్లి మల్లారెడ్డి,రైతు సంఘం జాతీయ నేత అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు కేసీఆర్‌పై జీవన్‌రెడ్డి మండిపాటు సాక్షి, హైదరాబాద్: తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు ముందు రూ.70 వేల కోట్ల అప్పు ఉండేదని, రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో అది మరో రూ.70 వేల కోట్లు పెరిగిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. అప్పుల రాష్ట్రంగా తెలంగాణను తయారు చేశారన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లపాటు ప్రధాని మోదీ పాట పాడిన సీఎం కేసీఆర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారని విమర్శించారు. -
మార్చి 14 లేదా 15న బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: 2018–19 వార్షిక బడ్జెట్‌ను మార్చి 14 లేదా 15న ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. మార్చి 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని భావిస్తోంది. పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి వీలుగా సమావేశాలు రెండు వారాలు జరగవచ్చు. పంచాయతీరాజ్ కొత్త చట్టం బిల్లును బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇటీవలే ప్రకటించారు. సాధారణ ఎన్నికల ముందు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావటంతో మరిన్ని జనాకర్షక పథకాలుంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శాఖల ప్రతిపాదనలు, కేటాయింపులపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం స్వయంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. గతేడాది రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్లో నిర్వహణ పద్దు కింద రూ.61,607 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.88,038 కోట్లు కేటాయించింది. ఈసారి భారీ అంచనాలుండటం, ఆదాయ వృద్ధీ ఆశించినంతగా ఉండటంతో భారీ బడ్జెట్‌ను ప్రకటించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. రూ.1.8 లక్షల కోట్ల మేరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. పెట్టుబడి సాయం.. రైతు బీమా రెండేళ్ల కిందట సాగునీటికి స్పష్టమైన కేటాయింపులతో కొత్త అధ్యాయానికి తెర తీసిన రాష్ట్ర ప్రభుత్వం సాగుకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని నిర్ణయించింది. ఇది బడ్జెట్‌కు అనుబంధంగా ఉంటుంది. సాగుకు రూ.15 వేల కోట్లు కేటాయించవచ్చు. ఖరీఫ్, రబీ పంటలకు కలిపి ఏడాదికి ఎకరాకు రూ.8 వేల పెట్టుబడి సాయమందించే పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఏప్రిల్ నుంచే రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు పంపిణీ చేస్తోంది. ఈ పథకానికి తొలి ఏడాది రూ.12 వేల కోట్లు కావాలని అంచనా. సీఎం తాజాగా ప్రకటించిన మేరకు రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా, 50 శాతం సబ్సిడీపై నాటు వేసే యంత్రాలు, 75 శాతం సబ్సిడీపై టార్పాలిన్లు, పంట రుణాలకు వడ్డీ రాయితీ తదితరాల నేపథ్యంలో సాగుకు ఈసారి భారీగా కేటాయింపులుండనున్నాయి. సాగునీటికి పెద్ద వాటా సాగునీటి ప్రాజెక్టులకు ఈసారీ భారీగా నిధులందనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును వచ్చే జూన్ నాటికి పూర్తి చేయటంతో పాటు 50 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరందించాలన్న లక్ష్య సాధనకు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పరిపూర్తి తదితరాలకు రూ.30 వేల కోట్ల దాకా కేటాయించవచ్చు. కొత్త పథకాలివే పాత పథకాలకు మెరుగులు దిద్దడంతో పాటు ఈసారి బడ్జెట్లో పలు కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఆసరా పెన్షన్ల మొత్తం, పరిధి పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సాయం పెంపు, నెలకు రూ.2,000 నిరుద్యోగ భృతి తదితరాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిరుపేద గిరిజనుల ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేసే పథకానికీ రూపకల్పన చేస్తోంది. అలాగే జనాభాను బట్టి ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల దాకా ప్రభుత్వమే నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. -
6 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు
ద్రవ్యోల్బణం దిగిరావడం, రిజర్వుబ్యాంక్ వడ్డీ రేటును తగ్గించడం వంటి సానుకూలాంశాలతో భారత్ స్టాక్ మార్కెట్లోకి జనవరి నెలలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) భారీగా రూ. 33,688 కోట్ల నికర పెట్టుబడులు చేశారు. ఒకే నెలలో ఇంత అత్యధిక పెట్టుబడులు గత ఆరునెలల్లో ఇదే ప్రథమం. ఈ పెట్టుబడుల్లో రూ. 12,919 కోట్లు స్టాక్ మార్కెట్లోకి, రూ. 20,769 కోట్లు రుణపత్రాల్లోకి తరలివచ్చినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రుణ మార్కెట్లో ఫండ్స్ పెట్టుబడులు రూ. 33,000 కోట్లు ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలు మెరుగుపడటం, ప్రభుత్వ సంస్కరణల వల్ల స్థిర ఆదాయాన్నిచ్చే పత్రాల్లో రాబడి బావుంటుందన్న అంచనాలతో దేశీయ మ్యూచువల్ ఫండ్స్ జనవరి నెలలో రుణ మార్కెట్లో రూ. 33,000 కోట్ల పెట్టుబడులు చేశాయి. ఈక్విటీ మార్కెట్లో వీటి పెట్టుబడులు రూ. 270 కోట్లు మాత్రమే.