6 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు
ద్రవ్యోల్బణం దిగిరావడం, రిజర్వుబ్యాంక్ వడ్డీ రేటును తగ్గించడం వంటి సానుకూలాంశాలతో భారత్ స్టాక్ మార్కెట్లోకి జనవరి నెలలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) భారీగా రూ. 33,688 కోట్ల నికర పెట్టుబడులు చేశారు. ఒకే నెలలో ఇంత అత్యధిక పెట్టుబడులు గత ఆరునెలల్లో ఇదే ప్రథమం. ఈ పెట్టుబడుల్లో రూ. 12,919 కోట్లు స్టాక్ మార్కెట్లోకి, రూ. 20,769 కోట్లు రుణపత్రాల్లోకి తరలివచ్చినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రుణ మార్కెట్లో ఫండ్స్ పెట్టుబడులు రూ. 33,000 కోట్లు
ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలు మెరుగుపడటం, ప్రభుత్వ సంస్కరణల వల్ల స్థిర ఆదాయాన్నిచ్చే పత్రాల్లో రాబడి బావుంటుందన్న అంచనాలతో దేశీయ మ్యూచువల్ ఫండ్స్ జనవరి నెలలో రుణ మార్కెట్లో రూ. 33,000 కోట్ల పెట్టుబడులు చేశాయి. ఈక్విటీ మార్కెట్లో వీటి పెట్టుబడులు రూ. 270 కోట్లు మాత్రమే.