పసివాడే పట్టాదారుడు  | Rythu Bandhu Check to the Kids | Sakshi
Sakshi News home page

పసివాడే పట్టాదారుడు 

Published Sun, May 13 2018 1:28 AM | Last Updated on Sun, May 13 2018 1:28 AM

Rythu Bandhu Check to the Kids - Sakshi

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌):  పదేళ్ల వయస్సు లేని బాలుడికి అధికారులు రైతుబంధు పథకం కింద పాస్‌పుస్తకం, పెట్టుబడి సాయం చెక్కు అందించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొంతం కవిత, నరేశ్‌ దంపతులకు నిర్మల్‌ (8), నిరంజన్‌(10) అనే కుమారులు ఉన్నారు. వీరి తాత బాల్‌నర్సయ్య తన మనుమల పేరున ఒక్కొక్కరికి ఎకరా 5 గుంటల భూమిని రెండేళ్ల క్రితం రిజిస్ట్రేషన్‌ చేయించారు.  పట్టాదారుకే సాయం అందించాలన్న నిబంధన మేరకు శనివారం అధికారులు నిర్మల్‌తోపాటు నిరంజన్‌కు పెట్టుబడి సాయం చెక్కులను అందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement