
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ చైన్ విజయా డయాగ్నొస్టిక్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు శుక్రవారానికల్లా 4.54 రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. షేరుకి రూ. 522–531 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా 2.5 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం 11.36 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 13 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.3 రెట్లు, రిటైలర్ల నుంచి 1.1 రెట్లు చొప్పున స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 566 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. వెరసి రూ. 1,895 కోట్లు సమకూర్చుకుంది. ఇక స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ అమీ ఆర్గానిక్స్ ఐపీవోకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. ఇష్యూకి 64.5 రెట్లు అధిక స్పందన లభించింది. షేరుకి రూ. 603–610 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా 65.4 లక్షల షేర్లను ఆఫర్ చేసింది. 42.22 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ కోటా 87 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 155 రెట్లు, రిటైలర్ల నుంచి 13 రెట్లు అధిక దరఖాస్తులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment