
ఏప్రిల్ 3–5 మధ్య ఇష్యూ
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్ పబ్లిక్ ఇష్యూ వచ్చే నెల 3న ప్రారంభంకానుంది. వెరసి కొత్త ఆరి్థక సంవత్సరం(2024–25)లో వెలువడిన తొలి పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. ఏప్రిల్ 5న ముగియనున్న ఇష్యూలో భాగంగా టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ 7.5 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఫలితంగా ప్రస్తుత వాటాదారు సంస్థకు ఐపీవో నిధులు అందనున్నాయి.
ఇవి కంపెనీ ఈక్విటీలో 15 శాతానికి సమానంకాగా.. గతంలో 10 కోట్ల షేర్లను ఆఫర్ చేయాలని సంకలి్పంచిన సంగతి తెలిసిందే. యాంకర్ ఇన్వెస్టర్లకు 2న షేర్లను కేటాయించనుంది. కంపెనీ లిస్టయ్యేందుకు ఈ నెల రెండోవారంలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతిని పొందింది. కంపెనీలో భారతీ ఎయిర్‌టెల్ వాటా 70 శాతంకాగా.. ప్రభుత్వ రంగ టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా మిగిలిన 30 శాతం వాటాను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment