న్యూఢిల్లీ: దేశీ సర్వర్ల తయారీ సంస్థ నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఇండియా పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) జూలై 17న ప్రారంభమై 20న ముగియనునంది. ఇష్యూలో భాగంగా రూ. 206 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 85 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. సంజయ్ లోధా, వివేక్ లోధా, నవీన్ లోధా, నీరజ్ లోధా, అశోకా బజాజ్ ఆటోమొబైల్స్ .. ఓఎఫ్‌ఎస్ ద్వారా షేర్లను విక్రయించనున్నారు.
షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధుల్లో సుమారు రూ. 33 కోట్లను పెట్టుబడి వ్యయాలకు, రూ. 128 కోట్లను దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ. 22.5 కోట్లను రుణాల చెల్లింపు తదితర అవసరాల కోసం వినియోగించుకోనున్నారు. దేశీయంగా ఉన్న అతి కొద్ది సర్వర్ల తయారీ సంస్థల్లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌కు చెందిన నెట్‌వెబ్ టెక్నాలజీస్ కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకానికి కూడా ఎంపికైంది.
Comments
Please login to add a commentAdd a comment