మఫ్టీ బ్రాండ్ జీన్స్ తయారీ కంపెనీ క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఈ నెల 19న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.96 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 266–280 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పురుషుల మధ్యస్థాయి ప్రీమియం, ప్రీమియం క్యాజువల్ వేర్ దుస్తుల తయారీలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. దేశీయంగా 404 ప్రత్యేక బ్రాండ్ ఔట్‌లెట్స్, 1,807 టచ్‌పాయింట్స్‌సహా 71 లార్జ్ ఫార్మాట్, 1332 మల్టీ బ్రాండ్ స్టోర్ల ద్వారా విక్రయాలు నిర్వహిస్తోంది. గతేడాది(2022–23) ఆదాయం 46 శాతం ఎగసి రూ. 498 కోట్లను అధిగమించింది. నికర లాభం 117 శాతం దూసుకెళ్లి రూ. 77.5 కోట్లను తాకింది.
Comments
Please login to add a commentAdd a comment